breaking news
Cloverfield Lane 10
-
Sagubadi: విలక్షణ పంట లవంగం!
సుగంధ ద్రవ్య పంటలకు నిలయమైన కేరళప్రాంతంలో పండే ‘తలనాడన్ గ్రాంబూ’ (లవంగం) తన ప్రత్యేకతతో భౌగోళిక గుర్తింపు (జీఐ) దక్కించుకుంది. కొట్టాయం జిల్లాలోని ఈరాట్టుపేట బ్లాక్ పంచాయతీ పరిధిలోని తలనాడ్, ఈరాట్టుపేట, ఈకోయ్, మేలుకావు, పూంజర్ వంటి పశ్చిమ కనుమల కొండప్రాంతాల్లో ఈ పంట విశేషంగా సాగవుతోంది. తలనాడన్ లవంగ రైతు సహకార సంఘం, కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయం కృషి ఫలితంగా ఈ గుర్తింపు లభించింది. ఇది మనప్రాంతంలో పండే పంట కాకపోయినా, లవంగాలు మనమూ వాడుతూ ఉంటాం కాబట్టి ఈ పంటకు సంబంధించిన విశేషాలు సరదాగా తెలుసుకుందాం..ప్రత్యేక గుణాలు.. నాణ్యత..సాధారణ లవంగాలతో పోలిస్తే తలనాడన్ లవంగాలు పరిమాణంలో పెద్దవిగా, బరువుగా ఉంటాయి. గ్రాము బరువుకు కేవలం 8 నుంచి 10 మొగ్గలు మాత్రమే తూగుతాయి. ఇవి లేత ఆకుపచ్చ నుంచి గులాబీ రంగులోకి మారి, ఎండబెట్టిన తర్వాత ఆకర్షణీయమైన గోధుమ రంగు సంతరించుకుంటాయి. కొట్టాయంప్రాంతంలో ఉండే చల్లని వాతావరణం, దట్టమైన ΄÷గమంచు, అటవీ నేలల తేమ కారణంగా వీటిలో ‘యూజెనాల్’ అనే సుగంధ నూనె శాతం, పాలిఫెనాల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల ఇవి మంచి సువాసన, ఘాటు, అధిక ఔషధ గుణాలను కలిగి ఉంటాయి.చెట్టుకు 10–15 కిలోలులవంగం చెట్ల విత్తనాలతో మొక్కలు పెంచి నాటుతారు. నాటిన 4–5 సంవత్సరాల్లో కాపు ప్రారంభమై, 7–8 సంవత్సరాల నుంచి పూర్తిస్థాయి దిగుబడి ఇవ్వటం ప్రారంభిస్తాయి. ప్రతి ఏటా జూన్–జూలై నెలల్లో మొగ్గ తొడిగి, డిసెంబర్–జనవరి నాటికి కోతకు వస్తాయి. మొగ్గలు విచ్చుకోకముందే చేతితో సేకరించి వెంటనే ఎండబెడతారు. సరిగ్గా ఎండబెట్టకపోతే నాణ్యత తగ్గి ‘ఖోకర్‘ అనే నిరుపయోగ రకంగా మారే ప్రమాదం ఉంది. ఎదిగిన ఒక చెట్టు నుంచి ఏడాదికి 10–15 కిలోల వరకు దిగుబడి వస్తుంది. రైతులకు ఆర్థిక ప్రయోజనంసాగు వ్యయంతో పోలిస్తే తలనాడన్ లవంగం రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తోంది. మార్కెట్లో ఎండు లవంగాల ధర నాణ్యతను బట్టి కిలో రూ. 500 నుంచి రూ. 2000 వరకు పలుకుతుంది. లవంగ కాడలు కూడా కిలో రూ. 100 నుంచి రూ. 250 వరకు అమ్ముడవుతున్నాయి. జీఐ ట్యాగ్ లభించటం వల్ల నకిలీల భయం లేకుండా రైతులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలు, మంచి మద్దతు ధర లభిస్తున్నాయి. నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
ఈ వారం youtube హిట్స్
10 క్లోవర్ఫీల్డ్ లేన్ : థ్రిల్లర్ నిడివి : 2 ని. 43 సె. హిట్స్ : 45,01,742 పిక్చర్ విడుదల కావడానికి ఏడాది సమయం ఉండగానే రిలీజ్ అయిన ‘ట్రైలర్’ ఇది. చిత్రం పేరు ‘10 క్లోవర్ఫీల్డ్ లేన్’. ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. తనకు తెలియకుండా ఎలాగో ఓ అండర్‌గ్రౌండ్ సెల్లార్లోకి వచ్చి పడుతుంది. అక్కడి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంటుంది. ఆ క్రమంలో జరిగే ఉత్కంఠభరితమైన ఘటనలను, సన్నివేశాలను ట్రైలర్లో శాంపిల్‌గా చూడొచ్చు. 2008లో వచ్చిన మాన్స్టర్ హారర్ ఫిల్మ్ ‘క్లోవర్ఫీల్డ్’తో ఈ సినిమాకు ‘రక్త సంబంధం’ అందని నిర్మాత జె.జె.అబ్రామ్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. కెన్ సెలబ్స్ పాస్? స్పెల్లింగ్ టెస్ట్ నిడివి : 2 ని. 11 సె. హిట్స్ : 8,51,807 ‘బజ్‌ఫీడ్’ అనేది అమెరికన్ ఇంటర్నెట్ మీడియా కంపెనీ. సామాజిక పరిణామాలను, వినోదాన్ని మేళవించి కొత్త కొత్త కార్యక్రమాలను రూపొందిస్తుంటుంది. లేటెస్టుగా బజ్‌ఫీడ్ అప్లోడ్ చేసిన వీడియో.. ‘కెన్ సెలబ్స్ పాస్ ఎ ఫిఫ్త్ గ్రేడ్ స్పెల్లింగ్ టెస్ట్?’. ఇదేంటో ఇప్పటికే మీకు అర్థమైయుంటుంది. ప్రముఖులకు ఇంగ్లీషు పదాల స్పెల్లింగులపై ఎంత పట్టు ఉందో తెలుసుకునేందుకు బజ్‌ఫీడ్ చేసిన ప్రయత్నం ఇది. ఒక ఆటలా సాగిన ఈ వీడియోలో స్పెల్లింగ్ కరెక్టుగా చెప్పిన, చెప్పలేకపోయిన ప్రముఖుల హావభావాలు, ఉద్వేగాలు సరదాగా ఉన్నాయి. లైఫ్హ్యాక్ : కిడ్స్ బూట్స్ నిడివి : 15 సె. హిట్స్ : 1,55,856 ‘లైఫ్హ్యాక్’ అంటే జీవన నైపుణ్యం. రోజువారీ పనులను కష్టపడకుండా అవలీలగా, ఒడుపుగా చేయగల టెక్నిక్. ఈ వీడియోలో ఒక తండ్రి తన చిన్న కూతురు తొడుక్కుని ఉన్న బూట్లను ఇంట్లోకి రాగానే ఎంత తేలిగ్గా, ఫన్నీగా తొలగించాడో చూడవచ్చు. ‘మంచు కురిసే రుతువులో కాలి బూట్లను తియ్యడం ఎంతో కష్టం. అయితే నేను నా కూతురి బూట్లను కనీసం నా చేతులు కూడా ఉపయోగించకుండా తీసి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాను చూడండి’ అంటూ చిన్న లైఫ్హ్యాక్తో ఆ తండ్రి మనల్ని ఆశ్చర్యపరుస్తాడు గిలిగింతలు పెడతాడు. మీరూ తప్పక చూడండి.


