cloud storage apps
-
జేఈఈ వెబ్సైట్లో సెక్యూరిటీ బ్లండర్.. ఐఐటీ రూర్కీకి చెమటలు
న్యూఢిల్లీ: జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల వెబ్సైట్లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్ష వెబ్‌సైట్‌లోని ఒక భారీ సాంకేతిక భద్రతా లోపాన్ని (సైబర్ సెక్యూరిటీ ఇష్యూ) 16 ఏళ్ల వయసున్న ఒక సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ గుర్తించి వెల్లడించాడు. ఈ లోపం కారణంగా లక్షలాది మంది విద్యార్థుల వ్యక్తిగత సమాచారం బహిర్గతమైంది. వెంటనే రంగంలోకి దిగిన ఐఐటీ రూర్కీ ఆ కుర్రాడికి ధన్యవాదాలు చెబుతూ, తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టింది.బహిర్గతమైన లక్షలాది మంది విద్యార్థుల డేటారైలన్ అనిల్ (@DarthKermy72747) అనే 16 ఏళ్ల విద్యార్థి, జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పబ్లిక్ క్లౌడ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ లోపం ఉందని గుర్తించాడు. దీనివల్ల ఎలాంటి అథెంటికేషన్ (లాగిన్ వివరాలు) లేకుండానే విద్యార్థుల డేటా యాక్సెస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీని ద్వారా దాదాపు 1,79,600 మంది ఫలితాల రికార్డులు, 1,87,300 అడ్మిట్ కార్డ్ పీడీఎఫ్‌లు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఇందులో అభ్యర్థుల పేర్లు, పుట్టిన తేదీలు, మొబైల్ నంబర్లు వంటి అత్యంత కీలకమైన సమాచారం ఉంది.దిద్దుబాటు చర్యల్లో ఐఐటీ రూర్కీ ఈ భద్రతా లోపాన్ని గుర్తించిన వెంటనే రైలన్ అనిల్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ఐఐటీ రూర్కీని అప్రమత్తం చేశాడు. దీనిపై ఐఐటీ రూర్కీ స్పందిస్తూ.. ‘క్లౌడ్ స్టోరేజ్ డివైజ్‌లో కాన్ఫిగరేషన్ లోపాన్ని ఎత్తి చూపినందుకు ధన్యవాదాలు. ప్రాధాన్యత క్రమంలో దీనిని సరిచేస్తున్నాం. అయితే ఇందులో నిక్షిప్తమైన డేటా కేవలం ‘రీడ్-ఓన్లీ’ మోడ్‌లో మాత్రమే ఉంది. కాబట్టి ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదు. మీ బాధ్యతాయుతమైన ప్రవర్తనను అభినందిస్తున్నాం’ అని పేర్కొంది. దీనిపై సదరు విద్యార్థి స్పందిస్తూ, భద్రతను మెరుగుపరచడంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నాడు.సీబీఎస్ఈ బోర్డులోనూ తీవ్ర గందరగోళంమరోవైపు, పరీక్షల సాంకేతిక వ్యవస్థలపై దేశవ్యాప్తంగా నిఘా పెరిగిన తరుణంలో సీబీఎస్ఈ బోర్డులోనూ అలజడి రేగింది. క్లాస్ 12 మార్కుల పునఃపరిశీలన పోర్టల్‌లో సాంకేతిక లోపాలు, సైబర్ దాడుల ఆరోపణల నేపథ్యంలో సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్, సెక్రటరీ హిమాన్షు గుప్తాలు బదిలీ అయ్యారు. ప్రశాంత్ లోఖండే కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆన్-స్క్రీన్ మార్కింగ్ విధానంలో అవకతవకలు జరిగాయంటూ సార్థక్ సిద్ధాంత్ అనే 17 ఏళ్ల విద్యార్థి పార్లమెంటరీ కమిటీ ముందు హాజరై నివేదిక సమర్పించడం గమనార్హం. -
మీ స్మార్ట్‌ఫోన్‌లో మెమరీ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా..! ఐతే ఇలా ట్రై చేయండి..!
మీరు ఒక యాప్‌ను ఇన్స్టాల్ చేస్తోన్న సమయంలో ‘స్టోరేజ్ ఫుల్ డిలీట్ సమ్ ఐటమ్స్’ అంటూ మెసేజ్ వస్తే వెంటనే మనకు పనికిరాని ఫోటోలను, ఇతర ఫైళ్లను డిలీట్ చేస్తాం. ఇలాంటి సందర్భాలను మనలో చాలా మందే ఎదుర్కొని ఉంటాం. మీకున్న స్మార్ట్‌ఫోన్‌తోనే మెమరీ స్టోరేజ్ సమస్యలను ఈ చిన్న చిట్కాతో తొలగించవచ్చును. స్మార్ట్‌ఫోన్ మెమరీ స్టోరేజ్‌లో కాకుండా క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌తో మీకు నచ్చినంతా మెమరీ క్లౌడ్‌లో సేవ్ చేసుకోవచ్చును. పలు క్లౌడ్ యాప్స్ అత్యంత సురక్షితమైనవి, సమర్థవంతమైనవి. మీ డేటాను ఇంటర్నెట్ సహయంతో క్లౌడ్ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవడంతో మీ స్మార్ట్‌ఫోన్‌లో ఎప్పుడూ..‘ స్టోరేజ్ ఫుల్ డిలీట్ సమ్ ఐటమ్స్..’ అనే మెసేజ్ ఎప్పుడు రాదు. ఇప్పటివరకు వందల్లో క్లౌడ్ యాప్స్‌లో అందుబాటులో కలవు. వాటిలో కొన్ని ఉచితంగానే సర్సీస్‌ను అందిస్తున్నాయి. మరికొన్ని యాప్స్ కొంత మేర ఫీజును వసూలు చేస్తున్నాయి. టాప్ క్లౌడ్ స్టోరజ్ యాప్స్ మీ కోసం... ► అమెజాన్ డ్రైవ్ అమెజాన్ తీసుకొచ్చిన క్లౌడ్ ఆధారిత స్టోరేజ్ యాప్ అమెజాన్ డ్రైవ్. అమెజాన్ ప్రైమ్ యూజర్లు వీటి సేవలను పొందవచ్చును. ఫోటోలు, వీడియోల కోసం అపరిమిత బ్యాకప్‌తో పాటు 5GB ఉచిత నిల్వను అమెజాన్ డ్రైవ్ యూజర్లకు అందిస్తోంది. మీరు సంవత్సరానికి సుమారు రూ. 700 చెల్లిస్తే అపరిమిత స్టోరేజ్‌ను అప్‌గ్రేడ్ కావచ్చు. ► ఆటోసింక్(Autosync) ఈ యాప్‌ను మెటాకంట్రోల్ రూపొందించింది. క్లౌడ్ స్టోరేజ్ మెనేజర్‌గా ఆటోసింక్ ఎంతబాగో ఉపయోగపడుతుంది. ఈ యాప్‌లో మీరు గూగుల్ డ్రైవ్, వన్‌డ్రైవ్, డ్రాప్ బాక్స్, బాక్స్, మెగా లాంటి క్లౌడ్ యాప్స్‌ను ఒకే దగ్గర కల్పిస్తోంది. అపరిమిత స్టోరేజ్ కోసం నెలకు 9.99 (సుమారు రూ. 745)డాలర్లను వసూలు చేస్తోంది. ► డ్రాప్ బాక్స్ ఈ యాప్ మనలో కొంత మందికి సుపరిచితమే. డ్రాప్ బాక్స్ ఇప్పటికే చాలా మంది స్మార్ట్‌ఫోన్ యూజర్స్ వాడుతున్నారు. ఇది 2జీబీ డేటా వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్ అప్షన్‌ను అందిస్తోంది. నెలకు రూ. 12 వందలను చెల్లిస్తే 2టీబీ స్టోరేజ్‌ను ఒకేసారి ఆరుగురు సభ్యులు వాడవచ్చును. ► గూగుల్ డ్రైవ్ ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటుగా క్లౌడ్ స్టోరేజ్ సౌకర్యాన్ని గూగుల్ అందిస్తోంది. యూజర్లు 15 జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు సుమారు రూ. 150 చెల్లించి 100జీబీ డేటాను క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. ► మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ గూగుల్ డ్రైవ్ మాదిరి క్లౌడ్ స్టోరేజ్ విషయంలో మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ సేవలను మైక్రోసాఫ్ట్ అందిస్తోంది. మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ అనేది ఒక ప్రముఖ క్లౌడ్ స్టోరేజ్ ఎంపిక. ఎందుకంటే ఇది వివిధ రకాల విండోస్ ఉత్పత్తులతో నేరుగా కలిసిపోతుంది. యూజర్లు 5జీబీ వరకు ఉచిత క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు 6.99 డాలర్లను చెల్లిస్తే 1టీబీ వరకు క్లౌడ్ స్టోరేజ్‌ను పొందవచ్చును. వన్‌డ్రైవ్‌తో పాటుగా ఆఫీస్365 సేవలను కూడా పొందవచ్చును. ► నెక్స్ట్‌క్లౌడ్ నెక్స్ట్‌క్లౌడ్ అనేది విభిన్నమైన క్లౌడ్ స్టోరేజ్ యాప్. ఇది రెసిలియోసింక్ యాప్ లాగా పని చేస్తుంది.మీ కంప్యూటర్ , మీ ఫోన్ మధ్య ఫైల్‌లను సమకాలీకరించడానికి యాప్ మిమ్మల్ని అనుమతిస్తుంది. నెక్స్ట్ క్లౌడ్ సర్వర్‌లో మీ క్లౌడ్ స్టోరేజ్ సపరేట్గా ఆన్లైన్లో ఏర్పాటుచేయాల్సి ఉంటుంది. ► రెసిలియో సింక్ రెసిలియో సింక్ (బిట్టోరంట్ సింక్)గా కొత్త మందికి ఈ క్లౌడ్ స్టోరేజ్ యాప్ పరిచయం. స్వంత క్లౌడ్ స్టోరేజీని చేయాలనుకునే ప్రతి ఒక్కరికీ ఉత్తమమైన క్లౌడ్ స్టోరేజ్ సొల్యూషన్ రెసిలియో సింక్. ఇది డ్రాప్‌బాక్స్, గూగుల్ డ్రైవ్ మొదలైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌లా పనిచేస్తుంది. మీ స్టోరేజ్‌ను ఈ యాప్‌ను సింక్‌లో ఏర్పాటుచేయడం ద్వారా క్లౌడ్‌లో మీ ఫైల్స్ భద్రంగా సేవ్ అవుతాయి. ► ట్రెసోరిట్ ట్రెసోరిట్ అనేది సరికొత్త, ఖరీదైన క్లౌడ్ స్టోరేజ్ యాప్స్‌లో ఒకటి. అయితే, ఈ యాప్ భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడదు. అప్లోడ్ చేయబడిన ప్రతి ఫైల్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను కలిగి ఉంటుంది. ప్రైమరీ యూజర్లకు 1 జీబీ వరకు ఉచిత స్టోరేజ్‌ను పొందవచ్చును. నెలకు 12.50 డాలర్లను చెల్లించి 500జీబీ క్లౌడ్ స్టోరేజ్ డేటాను ప్రీమియం యూజర్లకు అందిస్తోంది. చదవండి: స్మార్ట్ ఫోన్ ఇండస్ట్రీలో కింగ్..జనవరి నుంచి ఆ స్మార్ట్ ఫోన్ ఇక కనిపించదు!


