breaking news
Climbing wall
-
మహిళా కాలేజీని చుట్టుముట్టి.. గోడ దూకి రచ్చ రచ్చ!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మిరాండా హౌస్ మహిళా కళాశాలలో ఈనెల 14న నిర్వహించిన దీపావళి మేలా ఉద్రిక్తతంగా మారింది. క్యాంపస్‌లో వేడుకలు జరుగుతున్న క్రమంలో కళాశాల వద్దకు చేరుకున్న పదుల సంఖ్యలో పోకిరీలు విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా నినాదాలు చేయటం, గోడలు, గేట్లు దూకి లోపలికి వెళ్లిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీపావళి వేడుక ప్రారంభమైన ఒక గంట సమయంలోనే.. మహిళా కళాశాల చుట్టూ పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపించాయి. పోకిరీలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని నిలువరించలేమని గ్రహించిన కళాశాల యాజమాన్యం అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. ‘క్యాంపస్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా యాజమాన్యం వారిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో చాలా మంది పురుషులు ఆగ్రహంతో రెచ్చిపోయారు. లోపలికి అనుమతించాలని అసభ్యకరంగా నినాదాలు చేశారు. గోడలు, గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వీడియోలు భయానకంగా కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయంతో వణికిపోయారు. లోపలికి ప్రవేశించిన కొందరు మహిళల తరగతి గదుల వంటి నిషేధిత ప్రాంతాలను ఆక్రమించారు. ప్రొఫెసర్స్, స్టాఫ్ మాటలను సైతం లెక్కచేయలేదు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. కళాశాలలో ఇష్టానుసారం వ్యవహరించారు.’ అని కళాశాల విద్యార్థి సంఘం ఓ ప్రకటన చేసింది. పురుషులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించటం, వేధింపులకు పాల్పడటాన్ని ఖండిస్తున్నట్లు తెలిపింది. క్యాంపస్‌లోకి వచ్చిన పోకిరీలు.. అక్కడి మహిళలను తమ కోరికలు తీర్చే వస్తువులుగా పేర్కొన్నారని, దాంతో విద్యార్థినులు భయంతో పరుగులుతీసినట్లు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో వీడియోలు వైరల్‌గా మారిన క్రమంలో పోలీసులు రంగంలోకి దిగారు. వీడియోల ఆధారంగా సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తాజాగా ప్రకటించారు. ఈ సంఘటన అక్టోబర్ 14న జరిగినట్లు తెలిపారు. Men climbing over the walls to get into Miranda House during an open fest. What followed was horrible. Cat-calling, groping, sexist sloganeering and more. Men entering safe spaces to harass gender minorities is nothing new, but they out do themselves every time. pic.twitter.com/UkMAuJZKVU — Sobhana (@sobhana__) October 15, 2022 ఇదీ చదవండి: నయనతార, విఘ్నేష్ సరోగసీ వివాదానికి తెర! -
సవాల్
గోడ మీది బల్లిని తలపించే ఆట అది. వేలాడే మనుషుల్ని వాల్స్ మీద చూపించే వింత అది. సిటీలో సరికొత్త అభిరుచిగా సందడి చేస్తోంది. నగరవాసుల వీకెండ్ డైరీలో ఇప్పుడు దీనిదే చెప్పుకోదగ్గ స్థానం. గోడల్ని పట్టుకుని ఎగబాకడంలో సత్తా చూపించేందుకు నగర యువత ఉత్సాహపడుతోంది. దీని కోసం సిటీలో కొన్ని ప్రత్యేకమైన వేదికలు సైతం ఏర్పాటవుతున్నాయి. బౌల్డరింగ్ పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఆట విశేషాలివి.. - ఎస్.సత్యబాబు క్లైంబింగ్ అనేది తొలుత పర్వతాలతో ప్రారంభమైంది. పర్వతారోహణ (మౌంటెనీరింగ్), రాక్‌క్లైంబింగ్, ఐస్ క్లైంబింగ్ .. ఇలా విస్తరించింది. రాక్ మీద ఐస్ ఫామ్ అయితే దాన్ని మిక్స్డ్ క్లైంబింగ్ అంటారు. క్లైంబింగ్ క్రేజ్ ఇటీవల బాగా పెరిగింది. అయితే దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే ప్రతిసారీ మౌంటెన్స్, రాక్స్ వెతుక్కుంటూ వెళ్లలేం కదా. ఈ నేపథ్యంలో పుట్టుకొచ్చినవే ఆర్టిఫిషియల్ వాల్స్. ఆర్టిఫిషియల్ వాల్ మీద చేసే క్లైంబింగ్ని స్పోర్ట్స్ క్లైంబింగ్ అంటున్నారు. దీనిలో కూడా 3 విభాగాలున్నాయి. గోడ ఎత్తు 15 అడుగులు అంతకన్నా తక్కువుంటే బౌల్డరింగ్ సెగ్మెంట్ అంటారు. ఈ సెగ్మెంట్లో పాల్గొనేవాళ్ల కోసం కిందపడినా గాయాలు కాకుండా ఫ్లోర్ మీద పరుపులు వేసి ఉంచుతారు. ఇక లీడ్ క్లైంబింగ్లో గోడ 30-40 అడుగుల ఎత్తుంటుంది. భయం లేకుండా ఉంటేనే లీడ్ క్లైంబింగ్. దీనిలో గోడకు హ్యాంగర్స్ ఉంటాయి. దీనికి చాలా శారీరక సామర్థ్యం ఉండాలి. దీనిలో క్రీడాకారుడు రోప్ కట్టుకుని వాల్ మీద ఎక్కుతాడు. బౌల్డరింగ్ ‘భాగ్యం’... లీడ్, స్పీడ్ క్లైంబింగ్‌లు మౌంటెనీరింగ్‌ను సీరియస్ హాబీగా తీసుకున్నవారికి మాత్రమే పరిమితం. పైగా అంత కాంపిటీటివ్ వాల్స్ కూడా సిటీజనులకు అందుబాటులో లేవు. దీంతో బౌల్డరింగ్ ఒక ఫన్ యాక్టివిటీగా, ఫిజికల్ ఫిట్‌నెస్‌కు ఉపకరించేదిగా ఇప్పుడు నగరవాసులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే బౌల్డరింగ్ని ఒక వినోద సాధనంగా, వ్యాయామ మార్గంగా పలు చోట్ల ఏర్పాటు చేశారు. నగరంలోని ప్రసాద్స్ ఐమాక్స్, ఫిలింనగర్ క్లబ్, పలు రిసార్ట్స్‌తో పాటు రన్‌వే 9, గచ్చిబౌలిలోని ఓక్రిడ్జ్ స్కూల్‌తో పాటు లాటిట్యూడ్, సోల్ వంటి జిమ్స్‌లోనూ ఈ బౌల్డరింగ్ సాధన కోసం అమర్చిన వాల్స్ ఉన్నాయి. ఇదంతా ఒకెత్తయితే ఇప్పుడు బౌల్డరింగ్ కోసమే ప్రత్యేకించిన క్రాగ్ స్టూడియో.. కొండాపూర్‌లో ఏర్పాటైంది. ఇది బౌల్డరింగ్ లవర్స్‌కి మరింత ఊపునిస్తోంది. ఏడాది శ్రమ ఫలితం... ‘సాప్ట్వేర్ ఉద్యోగం చేస్తూ హాబీగా క్లైంబింగ్ చేసేవాణ్ని. అమెరికా, యూకేలలో ఉన్నట్టుగా వ్యక్తిగతంగా ప్రాక్టీస్ కోసం ఒక ఆర్టిఫిషియల్ వాల్ పెట్టుకుందామనుకున్నాను. తర్వాత ఆ ఆలోచన మార్చుకుని దీన్ని నాలాంటి అభిరుచి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశా. మొత్తం 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో క్రాగ్ స్టూడియో కన్స్ట్రక్ట్ చేశాను. ఇక్కడ బౌల్డరింగ్ కోసం 12 అడుగుల ఎత్తున్న 3 వాల్స్ ఉన్నాయి. 24 ఫీట్స్ లీడ్ క్లైంబింగ్ ఒకటి ఉంది’ అని వివరించారు క్రాగ్ స్టూడియో నిర్వాహకుడు వూటుకూరు రంగారావు. ఈ స్టూడియోలో సభ్యత్వం కోసం నెలకు రూ.1,500 ఛార్జ్ చేస్తున్నామన్నారు. హైపర్ యాక్టివిటీ హై ఎనర్జీ, హైపర్ యాక్టివిటీ ఉన్న చిన్నారులకు ఇప్పుడు వాల్ క్లైంబింగ్ అద్భుతమైన హాబీ. దీనిలో గంట పాటు బౌల్డరింగ్ చేస్తే 900 కేలరీలు బర్న్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మంచి ఫన్ కూడా ఉండడంతో సిటీలో చాలా మందిని ఎట్రాక్ట్ చేస్తోంది. దీనికి పెరుగుతున్న క్రేజ్ నేపథ్యంలో కొందరు వ్యక్తిగతంగా ఇళ్లలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.పూణె లాంటి నగరాల్లో చిల్డ్రన్ బెడ్‌రూమ్స్‌లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు. పిల్లల కోసం అయితే 8, 9 అడుగుల వాల్ సరిపోతుంది. ఆల్రెడీ ఉన్న వాల్కి దీన్ని సెటప్ చేస్తారు. బెడ్రూమ్ ఉంటే ఒక కార్నర్లో క్లైంబింగ్ వాల్ పెడతారు. ఇదే ట్రెండ్‌ని సిటీలో కూడా పలువురు ఫాలో అవుతున్నారు.