ట్రంప్‌కు సీఐఏ డైరెక్టర్ వార్నింగ్
వాషింగ్టన్: ఇరాన్‌తో అణు ఒప్పందం విషయంలో అమెరికాలోని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్‌తో గతంలో ఉన్న అణుఒప్పందాన్ని రద్దు చేస్తామని ట్రంప్ చెప్పడాన్ని తప్పుబట్టింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డోనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ఓ బహిరంగ సమావేశంలో చెప్పారు.
దీనిని ఉద్దేశిస్తూ సీఐఏ డైరెక్టర్ జాన్ బ్రెన్నాన్ మాట్లాడుతూ అణు ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే ఇరాన్ కచ్చితంగా అంతర్గతంగా అణ్వాయుధాల ఉత్పత్తిని పెంచుకుంటుందని, అదే బాటలో మరిన్ని దేశాలు వెళ్లే ప్రమాదం లేకపోలేదని ఆయన హెచ్చరించారు. పొరుగు దేశాలతో, వాటికి జరిగే నష్టాలతో సంబంధం లేకుండా తమకు నచ్చిన తీరుగా వ్యవహరించే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించారు. సాధారణంగా సీఐఏ డైరెక్టర్ ఇలాంటి హెచ్చరికలు చేయరు. కానీ, ఇరాన్ తో అణు ఒప్పందమనేది చాలా చెత్త ఒప్పందం అని అభివర్ణించిన విషయం తెలిసిందే.