breaking news
church priest
-
మత ప్రచారకులపై సుప్రీం ఆగ్రహం
తిరువనంతపురం : కేరళలో ఇటీవల తరుచుగా నమోదవుతున్న మత ప్రచారకుల అత్యాచార కేసులపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా కేరళలో క్రైస్తవ మత బోదకులపై లైంగిక వేధింపుల కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. జస్టిస్ ఏకే సిక్రీ, ఆశోక్ బూషన్‌తో కూడిన ధర్మాసనం కేరళకు చెందిన రెండు వేర్వేరు పిటిషన్లను విచారిస్తూ.. ఈ ఘటనలపై పూర్తి వివరాలను ఆగస్ట్ 26లోపు తన ముందుంచాలని గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవలం క్రైస్తవ మత ప్రచారకులపైనే ఐపీసీ 376 ప్రకారం ఎందుకు రేప్ కేసులు నమోదవుతున్నాయని, ఒకదాని తరువాత ఒకటి ఎందుకు పునరావృత్తం అవుతున్నాయని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తాజాగా లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాదర్ జైసీ కే జార్జ్, ఫాదర్ సోనీ అరెస్ట్‌లపై ఆగస్ట్ ఆరు వరకు సుప్రీం స్టే విధించింది. పలువురిపై అత్యాచారం జరిపారన్న ఆరోపణలతో జూన్ 12న అరెస్టయిన జాబ్ మాథ్యూకు బుధవారం కేరళ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 2009 నుంచి మాథ్యూ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పలు ఆరోపణలు చేశారు. చర్చలో మరో ఫాదర్ తన భార్యను బ్లాక్ మెయిల్ చేసి లైంగికంగా వేధిస్తున్నారంటూ ఇటీవల ఓ మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీటన్నింటిపై తనకు పూర్తి నివేదికను అందించాలని న్యాయస్థానం కేరళ ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
బాలికపై అత్యాచారం.. చర్చి ఫాదర్ కోసం గాలింపు
కేరళలో 14 ఏళ్ల బాలికపై పలుమార్లు అత్యాచారం చేసిన చర్చి ఫాదర్ కోసం పోలీసులు పలు రాష్ట్రాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. ఫాదర్ ఎడ్విన్ ఫిగర్జ్ జోసెఫ్ అనే వ్యక్తిపై ఏకంగా వాటికన్ సిటీ వరకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దాంతో అతడిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఎర్నాకులంలోని ఓ చర్చిలో గత జనవరి నుంచి మార్చి వరకు ఐదుసార్లు ఓ బాలిక కన్ఫెషన్ కోసం రాగా.. ఆ ఐదుసార్లూ ఆమెపై అతడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలున్నాయి. అతడు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, హైకోర్టు తిరస్కరించింది. దాంతో మే 5 నుంచి అతడు పరారీలో ఉన్నాడు. చర్చి కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే పదో తరగతి విద్యార్థిని దాదాపు ఏడాది నుంచి ఆ ఫాదర్‌తో కలిసి పనిచేసేది. అయితే అతడీ అఘాయిత్యానికి పాల్పడటంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వాళ్లు పిల్లలపై లైంగిక నేరాలను అరికట్టే సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అతడి కోసం లుకౌట్ నోటీసు జారీ అయింది. అన్ని విమానాశ్రయాలు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కూడా అప్రమత్తం చేశారు.