Christian churches
-
ఇక చర్చిల ఆస్తులపై గురి!
న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తదుపరి లక్ష్యం క్రైస్తవ సంస్థల ఆస్తులేనని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తాజాగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ బిల్లులోని అనేక అంశాలు వివాదాస్పదంగా మారిన నేపథ్యంలో రాహుల్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి రాహుల్ గాంధీ శనివారం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో నడిచే ‘ఆర్గనైజర్’లోని కథనాన్ని ఉదహరించారు. కాథలిక్ సంస్థలకు దేశవ్యాప్తంగా 7 కోట్ల హెక్టార్ల భూములున్నాయని, ఇంత భారీగా భూములున్న ప్రభుత్వేతర సంస్థ ఇదేనంటూ అందులో పేర్కొన్నారని రాహుల్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ కన్ను ఇప్పుడిక కాథలిక్ భూములపై పడినట్లు ఈ కథనంతో అర్థమవుతోందని ఆరోపించారు. ముస్లిం వర్గం ఆస్తులే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బిల్లు ఇతర వర్గాలకు లక్ష్యంగా చేసుకోవడానికి ఒక ఉదాహరణగా ఉంటుందని రాహుల్ శనివారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అతి త్వరలోనే క్రైస్తవుల ఆస్తులపై ఆర్ఎస్ఎస్ దృష్టి పడనుందని ఆయన జోస్యం చెప్పారు. ‘ఇటువంటి దాడుల నుంచి మనకు రక్షణ కల్పించే ఏకైక సాధన రాజ్యాంగం. రాజ్యాంగాన్ని మనం కలిసికట్టుగా పరిరక్షించుకుందాం’అని పిలుపునిచ్చారు. ఇండియన్ చర్చ్ యాక్ట్–1927 ప్రకారం బ్రిటిషర్ల పాలనలో కాథలిక్ సంస్థలు అత్యధికంగా భూములు సంపాదించుకున్నట్లు ఆర్గనైజర్ కథనం పేర్కొంది. అయితే, వలస పాలనలో లీజుకిచ్చిన భూములను చర్చి ఆస్తులుగా పరిగణనలోకి రావంటూ 1965లో భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేసింది. -
భాష భద్రం.. ఆచారం శుద్ధం
సంస్కృతి, సంప్రదాయాలు మానవ జీవన స్రవంతిలో భాగాలు. ప్రతి ప్రాంతానికి.. దేశానికి తమకంటూ ప్రత్యేక భాష, ఆచారాలు, సంప్రదాయాలు ఉంటాయి. వందల ఏళ్ల క్రితం ఇజ్రాయేల్‌లో చోటుచేసుకున్న మారణకాండ నేపథ్యంలో చెల్లాచెదురైన యూదులు ఎన్నో దేశాల్లో తలదాచుకున్నారు. అలా వచ్చిన ఓ సమూహం తెలుగు గడ్డపై జనజీవనంలో కలసిపోయింది. అయితే తమ ఆచారాలు, భాష, సంప్రదాయాలను ఎన్నడూ వీడక ప్రత్యేకత చాటుకుంటోంది. సాక్షి, తెనాలి: బెనె యాకోబ్ సినగాగె (సమాజ మందిరం) ఆంధ్రప్రదేశ్‌లో యూదుల ఏకైక ప్రార్థన మందిరం. చేబ్రోలు సమీపంలోని కొత్తరెడ్డిపాలెంలో నడుస్తోంది. వందల ఏళ్లుగా తెలుగు జనజీవన స్రవంతిలో ఈ యూదులు (ఇజ్రాయేల్ మూలాలు) కలిసిపోయారు. అయితే వారి మాతృభాష, ఆచార వ్యవహారాలను పరిరక్షిస్తున్న ‘సమాజ మందిరం’ నిర్వాహకుడు, ఏడుగురు పెద్దల నాయకత్వంలో అక్కడి 40 కుటుంబాల్లోని 300 మంది యూదులు తమ మూలాలను కాపాడుకుంటూ వస్తున్నారు. చెల్లాచెదురై.. తెలుగు గడ్డకు చేరి క్రీస్తుపూర్వం 772, 445ల్లో టర్కీ, బాబిలోన్ దాడులతో చెల్లాచెదురైన ఇజ్రాయెలీల్లో కొందరు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ మీదుగా జమ్మూకశ్మీర్‌లోకి చేరుకున్నారు. కొందరు ఒడిశా మీదుగా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకొని, తెలంగాణలో స్థిరపడ్డారు. తర్వాత అమరావతి చేరుకుని జీవనం సాగించారు. బ్రిటిష్ హయాంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగం రావడంతో మకాం కొత్తరెడ్డిపాలేనికి మారింది. 1909లో పూరిపాకలో ఆరంభించిన సమాజ మందిరాన్ని, 1991లో రాతిగోడలతో రేకుల షెడ్డుగా పునర్ని ర్మించారు. సిఖ్యా అనే యూదుడు రాజుకు బహూకరించిన దీపస్తంభం నేటికీ అక్కడి మ్యూజియంలో ఉందని, అమరావతిలో తమవారి జీవనానికి అదొక సాక్ష్యమని మందిరం నిర్వాహకుడు సాదోక్ యాకొబి చెప్పారు. 2004లో ప్రపంచానికి వెల్లడైన ఉనికి రాష్ట్రంలో యూదు జాతీయులు మొత్తం 125 కుటుంబాలు జీవనం సాగిస్తున్నట్టు అంచనా. ఎలాంటి ప్రచారం లేకుండా మతాన్ని అనుసరిస్తుంటారు. ప్రభుత్వ రికార్డుల్లో ‘మాదిగ’గా నమోదయ్యారు. బెనె ఎఫ్రాయిమ్ గోత్రాన్ని హిబ్రూలో ‘మగద్దీన్’ అంటారు. ఆ మాటతో వీరిని మాదిగ కులస్తులుగా నమోదు చేశారని చెబుతారు. 2004లోనే కొత్తరెడ్డిపాలెం యూదుల గురించి ప్రపంచానికి తెలిసింది. అప్పట్లో ఇక్కడి యూదులను మట్టుపెట్టేందుకు కుట్రపన్ని, రెక్కీ నిర్వహించారనే ఆరోపణపై ప్రభుత్వం లష్కరేతోయిబాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేసింది. అప్పుడే జిల్లా కలెక్టరు, పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడకు వచ్చి వీరిగురించి తెలుసుకున్నారు. క్రమం తప్పని ఆచార వ్యవహారాలు ఎక్కువమంది వ్యవసాయ కూలీలు. చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడిన వారున్నారు. అందరికీ యూదు పేరు, హిందూ పేరు ఉన్నాయి. ప్రతి శనివారం విశ్రాంతి దినం (షబ్బాత్). పనులకు వెళ్లరు.. దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ గడుపుతారు. ఆదివారం హెబ్రూ భాషా స్కూల్‌ను నడుపుతూ, మాతృభాషను కొనసాగిస్తున్నారు. హెబ్రూ క్యాలెండరు ప్రకారం సృష్టి ఆరంభం నుంచి ఇది 5780 సంవత్సరం. ముఖ్యమైన ఏడు పండుగలను జరుపుకుంటారు. పండుగలన్నింటికీ యూదులంతా కలుస్తారు. ఏడుగురు పెద్దల ఆధ్వర్యంలో జరిగే వివాహాల్లో వరకట్నం ఉండదు. వరుడే ఓలి ఇస్తారని సమాజ పెద్ద ఇట్స్‌కాక్ (ఇస్సాకు) చెప్పారు. లా ఆఫ్ రిటర్న్‌తో ఆశలు ఇజ్రాయేల్ దేశం లా ఆఫ్ రిటర్న్ జీవోతో ఎక్కడెక్కడో ఉంటున్న ఆ జాతీయులకు మాతృదేశం వెళ్లే అవకాశం లభించింది. ఆ అవకాశం కోసం ఇక్కడి యూదులు సైతం ఎదురుచూస్తున్నారు. ప్రపంచ దేశాల్లోని యూదులను ‘బెయిత్డిన్’ (యూదుల కోర్టు) నిర్ధారిస్తుంది. సంబంధిత దేశం అనుమతితో వారిని ఇజ్రాయేల్‌కు తీసుకెళ్తారు. మణిపూర్, మిజోరం నుంచి ‘మనష్’ గోత్రికులు పెద్దసంఖ్యలో స్వదేశం వెళ్లారు. మచిలీపట్టణం నుంచి సడోక్ యాకోబి సోదరుడు షమ్ముయేల్ యాకొబి బిడ్డలు ఇజ్రాయేల్‌కు వెళ్లారు. మైనారిటీలుగా గుర్తించాలి సర్వమానవ సౌభ్రాతృత్వం హెబ్రూల ఆశయం. వేరు మతాన్ని తప్పుగా ఎంచి, దీనిలోకి రండి అనే దురలవాటు మాకు లేదు. క్రైస్తవులు అని చెప్పి లాభపడటానికి ఇష్టపడం. మైనారిటీలుగా మమ్మల్ని గుర్తించి, ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలి. అక్కడక్కడా ఉంటున్న మా కుటుంబాలకు ప్రత్యేక కాలనీని ఏర్పాటు చేయాలి. – సాదోక్ యాకొబి, సమాజ మందిరం నిర్వాహకుడు హిబ్రూకు తెలుగుకు సంబంధం మానవులంతా ఒకే రక్తసంబంధీకులు. ఏమీ తేడా లేదు. హిబ్రూ భాషకు తెలుగుకు ఎంతో దగ్గర సంబంధం ఉందని నేను కనుగొన్నా. రెండింటికి సంబంధమున్న, ఒకే అర్థం కలిగిన 300 పదాలను గుర్తించాను. మరిన్ని విశేషాలతో త్వరలోనే పుస్తకం తీసుకురానున్నాను. – షమ్ముయేల్ యాకోబి, భాషా పరిశోధకుడు -
క్రిస్మస్ సంబరం
-
ఉప్పు ఒలికిపోతే..?
మరికొన్ని వింత నమ్మకాలు మనకు ఇష్టం లేని వ్యక్తి పదే పదే మనింటికి వచ్చి విసిగిస్తుంటే... అతడు వచ్చినప్పుడు చిటికెడు ఉప్పును అతని మీద వెయ్యాలట. అంతే... అతడు మళ్లీ రాడట! సముద్ర జలాల మీద ఉన్నప్పుడు ఉప్పు అన్న మాట నోట రాకూడదని, వస్తే క్షేమంగా తిరిగి వెళ్లలేరని కొన్ని దేశాల్లోని జాలర్లు నమ్ముతారు! కొత్త పెళ్లికూతురు తన పెళ్లి వస్త్రాల మీద కాసింత ఉప్పు చల్లుకుంటే... కాపురం పదికాలాలు పచ్చగా ఉంటుందట! బయటి నుంచి ఉప్పును అరువుగా తెచ్చుకుంటే, దానితో పాటే దురదృష్టం ఇంటికొచ్చి తిష్ట వేస్తుందట! కొత్తగా పుట్టిన శిశువుని ఉప్పు నీటిలో ముంచి తీస్తే, దుష్టశక్తులు దగ్గరకు రావట! ఓ అమ్మాయి డైనింగ్ టేబుల్ మీద ఉప్పు పెట్టడం మర్చిపోయిందంటే, ఆ అమ్మాయి జీవితంలో ఏ అబ్బాయీ లేడని అర్థమట! మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా అని అడుగుతారు ఒకరు. మా కంపెనీ ఉప్పు తినండి, జీవితంలో పెకైదగండి అంటూ ప్రచారం చేస్తారు ఇంకొకరు. ఉప్పు సరిపడా తినకపోతే ఆరోగ్యం చెడిపోతుందంటారు పెద్దలు. సరిపడా ఉప్పు తినని వారికి తెలివితేటలు పెరగవంటారు డాక్టర్లు. కానీ ఉప్పుతో మనకు ముప్పు ఏర్పడుతుందని ఎవరైనా చెప్పారా? ఉప్పు రూపంలో అదృష్ట దురదృష్టాలు మనతో ఆటలాడుకుంటాయని ఎవరైనా చెప్పడం విన్నారా? వంటకి ఉప్పు కావాలి. ఆరోగ్యానికి ఉప్పు కావాలి. అలాంటి ఉప్పుతో ముప్పు వస్తుందని ఎవరు అనుకుంటారు! కానీ వస్తుందనే నమ్మకం ఎన్నో చోట్ల, ఎన్నో యేళ్లుగా ప్రచారంలో ఉంది. ఉప్పును పారబోయడం అశుభ సూచకం అన్న నమ్మకం చాలా దేశాల్లో ఉంది. ఉప్పు ఒలికితే ఏదో చెడు జరుగుతుందని చెప్పడమే కాదు... ఒలికిన ఉప్పుని ఎత్తి, ఎడమ భుజమ్మీదుగా వెనక్కి విసిరేయాలని, దానివల్ల కీడు తొలగిపోతుందని పరిహారం కూడా చెబుతుంటారు. ఎందుకంటే దెయ్యాలు, దుష్టశక్తులు ఎప్పుడూ మనిషికి ఎడమవైపునే ఉంటాయట. అందుకని ఎడమవైపుకు పారబోయాలట. అంతేకాదు. ఎంత ఉప్పు ఒలికిందో, అదంతా కరిగిపోయేటన్ని కన్నీళ్లు కార్చాలనే ఆచారం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఇది మరీ అతిగా ఉందని కొందరు ఆధునికులు కొట్టి పారేస్తున్నా... ఇప్పటికీ దీన్ని అనుసరిస్తున్నవాళ్లు తక్కువేమీ లేరు. ఈ నమ్మకానికి నాంది పలికినవాడు లియొనార్డో డావిన్సీ అని చెప్పవచ్చు. అతడు వేసిన ‘లాస్ట్ సప్పర్’ చిత్రంలో యూదా ఇస్కరియోతు (ఏసుక్రీస్తును పట్టించినవాడు) చేతి దగ్గర ఓ చిన్న సీసాలాంటిది వేశాడు. అది పడిపోయినట్టు, అందులోంచి ఉప్పు ఒలికిపోయినట్టు చిత్రించాడు. లాస్ట్ సప్పర్ (యేసుక్రీస్తు శిష్యులతో కలసి చేసిన ఆఖరు భోజనం) తరువాత యేసుక్రీస్తును సైనికులు బంధించడం, సిలువ వేయడం వంటివి జరిగాయి. దాన్నిబట్టి... ఉప్పు ఒలికిపోవడం అన్న సంఘటన జరగబోయే అనర్థానికి సూచికలా ఉందనీ, అందుకే ఉప్పును ఒలకబోయకూడదనే నమ్మకం మొదలయ్యిందని చెబుతుంటారు చరిత్రకారులు. ఇది ఎంతవరకూ నిజం అనేదానికి ఆధారాలయితే లభించడం లేదు. పైగా బైబిల్ ప్రకారం, లాస్ట్ సప్పర్‌లో వాళ్లు కేవలం రొట్టె తిని, ద్రాక్షరసం తాగారు. మరి అక్కడ ఉప్పు ఎందుకుంది అనే ప్రశ్న కూడా కొందరిలో తలెత్తింది. అలాగే బైబిల్లో ఉప్పు గురించి గొప్పగా రాశారు. మనిషి ఎలా ఉండాలి అనేదానికి ఉప్పును ఉదాహరణగా చూపించి చెప్పారు. మీరు లోకానికై ఉప్పై ఉండండి అన్నారు క్రీస్తు. ఉప్పు నేలమీద పడితే నిస్సారమైపోతుంది, మనిషి జీవితం కూడా వెళ్లకూడని దారిలో వెళ్తే ఎందుకూ పనికి రాకుండా పోతుందంటూ గొప్పగా చెప్పారు. అలాంటి ఉప్పు వల్ల చెడు జరగడమేమిటి అనేవాళ్లు కూడా ఉన్నారు. పూర్వం చాలా ఖరీదు కనుక... ఏ రకంగా చూసినా ఉప్పు చుట్టూ ఉన్నవి మూఢనమ్మకాలుగా అనిపిస్తాయే తప్ప, నిజమైన నమ్మకాలుగా అనిపించడం లేదంటారు కొందరు విజ్ఞులు. పూర్వం ఉప్పు చాలా ఖరీదు. అందుకే జాగ్రత్తగా వాడుకొమ్మని చెప్పేందుకు, ఇష్టమొచ్చినట్టు వృథా చేయకుండా అడ్డుకునేందుకు ఇలాంటి కథలన్నీ పుట్టించారని చెబుతారు వారు. ప్రాచీన రోమన్లు ఉప్పును ఎంతో విలువైన వస్తువుగా భావించేవారు. ఇప్పటికీ రోమ్‌లోని క్రైస్తవ దేవాలయాల్లో పవిత్ర జలాన్ని తయారు చేసేందుకు ఉప్పును వాడతారట.