breaking news
china tourism
-
2,200 ఏళ్ల నాటి మట్టి సైన్యం.. ఈ అద్భుతం చూశారా?
చైనాలోని పురాతన చరిత్రను ప్రపంచానికి పరిచయం చేసిన అద్భుతమైన నిర్మాణాలే టెర్రకోట ఆర్మీ. వేలాది మంది సైనికులు, గుర్రాలు, రథాల ప్రతిమలతో కూడిన ఈ భారీ సముదాయం చైనాలోని షాన్సీ ప్రావిన్స్‌లో, షియాన్ నగరానికి సమీపంలో ఉంది. మట్టితో తయారు చేసిన ఈ సైనిక ప్రతిమలను సుమారు 2,200 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రతి ప్రతిమ ముఖ కవళికలు, కేశాలంకరణ, దుస్తులు భిన్నంగా కనిపించడం ఈ ప్రదేశం ప్రత్యేకత.చక్రవర్తి సమాధిని కాపాడేందుకు..చైనాలో తొలి చక్రవర్తిగా పేరొందిన కిన్ షి హువాంగ్ (Qin Shi Huang) సమాధి సముదాయంలో భాగంగా టెర్రకోట ఆర్మీని నిర్మించారు. క్రీ.పూ. మూడో శతాబ్దంలో ప్రారంభమైన ఈ నిర్మాణం, మరణానంతర జీవితంలోనూ తనకు సైన్యం రక్షణగా ఉండాలనే చక్రవర్తి నమ్మకాన్ని ప్రతిబింబిస్తుందని చరిత్రకారులు భావిస్తారు.1974లో స్థానిక రైతులు ఒక బావి కోసం నేలను తవ్వుతున్న సమయంలో ఈ ప్రతిమల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆ తర్వాత జరిగిన పురావస్తు తవ్వకాలలో వేలాది సైనికులు, గుర్రాలు, రథాల అవశేషాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆవిష్కరణ ప్రపంచ పురావస్తు చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘట్టాల్లో ఒకటిగా నిలిచింది.హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?హైదరాబాద్ నుంచి చైనాలోని షియాన్కు విమానంలో వెళ్లేందుకు సాధారణంగా మరో నగరంలో కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకోవాల్సి ఉంటుంది. షియాన్ జియాన్యాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నగరానికి మెట్రో, ట్యాక్సీ వంటి రవాణా సౌకర్యాలు ఉన్నాయి.ఈ నగరం నుంచి టెర్రకోట ఆర్మీ మ్యూజియం సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెట్రో లైన్ 9లో హువాచింగ్చి స్టేషన్ చేరుకుని, అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా వెళ్లవచ్చు. టెర్రకోట ఆర్మీని చూసేందుకు ఒక రోజు పూర్తిగా కేటాయించండి.షియాన్ లో చూడదగిన ఇతర ప్రదేశాలుషియాన్ సిటీ వాల్: పురాతన నగర రక్షణ గోడపై నడవవచ్చు, సైకిల్ తొక్కుతూ సిటీ టూర్ చేయవచ్చు.బిగ్ వైల్డ్ గూస్ పగోడా: చైనా బౌద్ధ చరిత్రకు సంబంధించిన ప్రసిద్ధ కట్టడం.ముస్లిం క్వార్టర్: స్థానిక వీధి ఆహారం, మార్కెట్లు, చారిత్రాత్మక వీధులకు ప్రసిద్ధి చెందింది.హువాచింగ్ ప్యాలెస్: చైనా చరిత్రతో ముడిపడిన రాజభవన సముదాయం.ఏం తినాలి?షియాన్ లో బియాంగ్బియాంగ్ నూడుల్స్, రౌజియామో అనే చైనీస్ బ్రెడ్ శాండ్విచ్, యాంగ్రో పావోమో అనే రొట్టె ముక్కలతో చేసే సూప్ ప్రసిద్ధి. మాంసాహారం తిననివారు వెజిటేరియన్ రెస్టారెంట్లను ముందుగానే గుర్తించుకోవడం మంచిది.ప్రయాణానికి ముందు..వసంతకాలం, శరదతువులో వాతావరణం సాధారణంగా అనుకూలంగా ఉంటుంది. టెర్రకోట ఆర్మీ ప్రవేశ టికెట్లను ముందుగానే బుక్ చేసుకుని, పాస్΄ోర్ట్ వెంట తీసుకెళ్లాలి. చైనాకు వెళ్లే ముందు వీసా నిబంధనలు, చెల్లింపుల యాప్‌లు, ఇంటర్నెట్ సదుపాయాలను కూడా పరిశీలించాలి.చరిత్రను పుస్తకాల్లో చదవడం వేరుం దానిని ప్రత్యక్షంగా చూడటం వేరు. వేలాది మట్టి సైనికుల మధ్య నిలబడి నాటి చైనా సామ్రాట్ కథను తెలుసుకోవడం ఒక సినిమాటిక్ ఫీలింగ్‌ను ఇస్తుంది.ఇదీ చదవండి: సముద్రం పక్కనే ఎర్రటి కొండలు.. ఈ బీచ్ అందాలు చూశారా? -
టాయిలెట్ విప్లవం.. ఇక్కడ కాదు!
అభివృద్ధిలో చైనా చాలా దూసుకెళ్లిపోతోందని అనుకుంటాం. అక్కడంతా అత్యాధునిక నిర్మాణాలు ఉన్నాయని చెప్పుకొంటాం. కానీ, అక్కడ పందుల పెంపకం కేంద్రాలకు సమీపంలోనే బహిరంగ మల విసర్జన జరుగుతోందట. ఇలాంటి వాటిని నివారించడానికి గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ విప్లవం' ఒకటి మొదలుపెట్టి, సుమారు 52 వేల టాయిలెట్లను అప్‌గ్రేడ్ చేయడం లేదా కొత్తగా నిర్మించడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం తమకిచ్చిన లక్ష్యంలో 92.7 శాతాన్ని చేరుకున్నామని చైనా నేషనల్ టూరిజం అడ్మినిస్ట్రేషన్ (సీఎన్టీఏ) ఒక నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక పేరు.. 'ప్రోగ్రెస్ ఆఫ్ ద టాయిలెట్ రివల్యూషన్'. 2015 సంవత్సరంలో చైనా దేశవ్యాప్తంగా 'టాయిలెట్ రివల్యూషన్' ప్రారంభించింది. చైనాలో గ్రామీణ ప్రాంతాల్లోను, పర్యాటక ప్రాంతాల వద్ద ఉన్న టాయిలెట్ల వల్ల ఆ దేశ పరువు ప్రతిష్ఠలకు భంగం వాటిల్లుతోందని గుర్తించారు. చైనా గ్రామీణ ప్రాంతాల్లో చాలావరకు సరైన టాయిలెట్లు లేవు. పర్యాటక ప్రాంతాల్లో టాయిలెట్లు తగినంతగా లేకపోవడం, పారిశుధ్య కార్మికులు కూడా సరిపడ సంఖ్యలో లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన సందర్భాలున్నాయి. 2015 నుంచి 2017 మధ్య కాలంలో 33వేల టాయిలెట్లను కొత్తగా కట్టాలని, 24 వేల టాయిలెట్లను పునర్నిర్మించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. పర్యాటక ప్రాంతాల్లో ఉన్న టాయిలెట్లను త్రీ స్టార్ ప్రమాణాల స్థాయికి తీసుకెళ్తామని సీఎన్టీఏ అప్పట్లో చెప్పింది.


