breaking news
children bank of india
-
మరో ఏటీఎంలో నకిలీ నోటు కలకలం
న్యూఢిల్లీ: దేశరాజధానిలో మరో ఏటీఎంలో నకిలీ నోటు వ్యవహారం కలకలం రేపింది. సౌత్ ఢిల్లీ అమర్ కాలనీ ప్రాంతంలోని ఒక ప్రైవేటు బ్యాంకు ఏటీఎంలో నకిలీ రూ.2 వేల నోట్లు దర్శనమిచ్చాయి. గతనెలలో ఈ నకిలీ రూ.2వేల నోట్లు బ్యాంకు ఖాతాదారుల్లో ఆందోళన సృష్టించిన ఘటన మరువకముందే గురువారం మరో నకిలీనోటు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. స్థానిక వినియోగదారుడు చందన్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినపుడు చిల్డ్రన్ బ్యాంకు ఆఫ్ ఇండియా పేరుతో ముద్రించిన నకిలీ నోటు కనిపించడంతో వెంటనే ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు చందన్ ఫిర్యాదు ఆధారంగా, 489 బి, ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేశామని డీసీపీ రోమిల్ బానియా చెప్పారు. దీనిపై లోతుగా పరిశీలన నిమిత్తం ఈ కేసును క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశామని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అయితే అత్యధిక విలువ కలిగిన నోట్లలో ఫేక్ నోట్లు వరుసగా వెలుగు చూడడంతో వినియోగదారుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఒకనెలరోజుల్లో ఇది రెండవ ఘటన కాగా, ఈ నకిలీ నోట్లపై 'మనోరంజన్ బ్యాంక్ , చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ముద్రించి ఉండడం గమనార్హం. కాగా ఫిబ్రవరి 6 న సంగం విహార్ లో బ్యాంకు ఖాతాదారుడు రోహిత్ కుమార్ ఎస్బీఐ ఏటీ ఏంలో డ్రా చేసినపుడు ఇలాంటి నకిలీ రూ. 2వేల నోటు వెలుగు చూసింది. ఈ సంఘటనలో ఇషాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఎస్బీఐ ఏటీఎంలో రూ.2000 దొంగనోట్లు
న్యూఢిల్లీ: నిత్యావసర ఖర్చులకోసం డబ్బు డ్రా చేసుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు బిత్తరపోయాడు. రూ.8000ను విత్ డ్రా చేయగా మొత్తం రూ.2000 దొంగ నోట్లు రావడంతో అవాక్కయ్యాడు. వాస్తవానికి నోటు అచ్చం కొత్త రూ.2000 నోట్ల మాదిరిగానే ఉన్నప్పటికీ దానిపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అనే పేరిట నోట్లు ముద్రించి ఉన్నాయి. ఫిబ్రవరి 6న ఈ ఘటన ఢిల్లీలోని సంఘం విహార్‌లో గల ఎస్బీఐ ఏటీఎంనుంచి ఈ నోట్లు రావడంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఒరిజినల్ నోటుపై ఎలాంటి అక్షరాలను ఉపయోగించారో అచ్చం అలాంటివే దొంగనోట్ల ముద్రణకు వాడారని, వాటర్ మార్క్ వద్ద చురాన్ పట్టి అని రాసి ఉందని, మిగితా అన్ని అంశాలు కూడా ఆర్బీఐ మాదిరిగానే ముద్రించారని ఆ వ్యక్తి తెలిపాడు. బ్యాంకు అధికారులను కూడా సంప్రదించి పోలీసులు దర్యాప్తు వేగం పెంచారు.