breaking news
Chief Minister O. Panneerselvam
-
కొనసాగుతున్న ‘రేషన్’ఆత్మహత్యలు
రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల పర్వం కొనసాగుతూనే ఉన్నది. సీఎం పన్నీరు సెల్వం బంధువుకు సైతం అధికారుల వేధింపులు తప్పలేదు. సీఎం సొంత గ్రామం తేని జిల్లా పెరియకుళంలో గురువారం రేషన్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అలాగే, తేనిలో మరో ఉద్యోగి ఆసుపత్రి పాలయ్యాడు. సాక్షి, చెన్నై : రాష్ర్టంలో పౌరసరఫరాల విభాగం నేతృత్వంలో ముప్పై వేలకు పైగా రేషన్ దుకాణాలు ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల కాలంగా అధికారులు తమను వేధిస్తున్నారంటూ, రేషన్ దుకాణాల్లో పనిచేస్తున్న సిబ్బంది ఆత్మహత్యాయత్నాల బాట పడుతున్నారు. ఈ ఘటనలకు నిరసన తెలుపుతూ ఓ రోజు బంద్‌కు సైతం రేషన్ సిబ్బంది పిలుపునిచ్చారు. తమపై వేధింపులు మానుకోవాలని డిమాండ్ చేస్తూ, ఆందోళనలు కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం పన్నీరు సెల్వం బంధువుకు సైతం అధికారుల వేదింపులు తప్పలేదని చెప్పవచ్చు. బుధవారం రాత్రి సీఎం పన్నీరు సెల్వం సొంత జిల్లా తేనిలో ఇద్దరు రేషన్ సిబ్బంది వేర్వేరుగా ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. ఆత్మహత్యాయత్నాల బాట : తేని జిల్లా పెరియకుళంకు దక్షిణ వీధికి చెందిన పళని స్వామి కుమారుడు రమేష్(27) సీఎం పన్నీరు సెల్వంకు బంధువుగా సమాచారం. అక్కడి రేషన్ దుకాణంలో పనిచేస్తున్న రమేష్ బుధవారం రాత్రి విషం సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని చికిత్స నిమిత్తం పెరియకుళం ఆసుపత్రికి తరలించారు. అతడు రాసి పెట్టిన లేఖలో తనను అధికారులు వేధిస్తున్నారని, తడిసిన, చెడి పోయిన బియ్యం వినియోగం చేయమని హెచ్చరిస్తున్నారని ఆరోపిస్తూ ఆ లేఖలో పేర్కొన్నాడు. ఆ ప్రాంత ఉన్నతాధికారి మనోహర్‌పై ఆరోపణలు గుప్పించడంతో ఆ దిశగా విచారణ సాగుతున్నది. ఇక, తేనిలో మరో సిబ్బంది ఆత్మహత్యాయత్నం చేశాడు. తనను అధికారులు బలవంతంగా మరో చోటకు బదిలీ చేశారని ఆరోపిస్తూ, అధికారుల తీరును ఖండిస్తూ ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్నట్టుగా తేనికి చెందిన అజ్మత్ ఖాన్ లేఖ రాసి పెట్టడం గమనార్హం. ఇక, రేషన్ సిబ్బంది అధికారుల ఒత్తిళ్లతో ఆత్మహత్యాయత్నాల బాట పడుతుండటంతో ఆ సంఘం నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. -
పన్నీరు బడ్జెట్
రాష్ర్ట అసెంబ్లీలో సీఎం, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వం బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టారు. కొత్తగా పన్నుల మోత విధించకుండా, వాహనాలు, రిజిస్ట్రేషన్లపై పన్నులు తగ్గించి, ప్రజలపై పన్నీరు చల్లారు. నిధుల కేటాయింపులో కేంద్రం చూపుతున్న నిర్లక్ష్యం, పథకాలు, ప్రాజెక్టులు, తదితర నిర్మాణాలకు పెరిగిన వ్యయం వెరసి ప్రభుత్వ ఖజానాను మరింత అప్పుల్లోకి నెట్టినట్టుగా లెక్కలు చూపించారు. మళ్లీ సీఎం పదవి చేపట్టేందుకు త్వరలో ముందుకు రావాలని తమ అమ్మ జయలలితకు ఈ సందర్భంగా ఆహ్వానం పలికారు. సాక్షి, చెన్నై: 2015-16 గాను రాష్ట్ర బడ్జెట్ దాఖలుకు సీఎం, ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం ఉదయాన్నే సిద్ధమయ్యారు. పోయస్ గార్డెన్లో అమ్మ, పార్టీ అధినేత్రి జయలలిత ఆశీస్సుల్ని అందుకున్నట్టు సమాచారం. అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు స్పీకర్ ధనపాల్ స్వాగతం పలికారు. సభకు వచ్చిన సీఎంకు అన్నాడీఎంకే సభ్యులు, మంత్రులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. గతంలో జయలలిత వెన్నంటి నడిచి సూట్‌కేసు చేతబట్టి అసెంబ్లీలోకి అడుగు పెట్టిన పన్నీరు సెల్వం, తాజాగా ఒంటరిగానే వచ్చారు. తన ప్రసంగంలో అధినేత్రి జయలితను పదే పదే స్తుతిస్తూ ముందుకు సాగారు. రెండు గంటల 19 నిమిషాల పాటుగా బడ్జెట్ ప్రసంగం చేసిన పన్నీరు సెల్వం కొత్తగా ప్రజలకు వరాలు కురిపించింది ఏమీ లేదు, పాత పథకాలకు, పనులకు నిధుల్ని కేటాయిస్తూనే, కొత్తగా పన్ను భారం మాత్రం ప్రజల నెత్తిన రుద్దలేదు. అదే సమయంలో రాష్ట్ర ఆదాయ వనరుల మేరకు కొన్ని కీలక ప్రకటనలు చేశారు. ఇందులో సెల్ఫోన్ల, ఇతర వస్తువుల ధరలు, వాహనాలు, రిజిస్ట్రేషన్లు తదితర వాటికిగాను పన్నులు తగ్గించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఖర్చు రూ.1,47,297.35 కోట్లు, ఆదాయం రూ. 1,42,681.33 కోట్లుగా బడ్జెట్లో చూపించారు. లోటు రూ. 4,616.02 కోట్లుగా ప్రకటించారు. మూల ధన ఖర్చుగా రూ. 27,213.17 కోట్లు, నిధుల కొరత రూ. 31,829.19 కోట్లుగా చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉందంటూ, ఇక, బడ్జెట్లో ఇతర పనులకు గాను కేటాయింపులను వివరించారు. ఆమేరకు.... కేటాయింపులు: గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దారులను ప్రోత్సహించే రీతిలో ఉత్పత్తి పన్ను రద్దు. అలాగే, రాష్ట్రంలో విద్యుత్ కొరతను అధిగమించే రీతిలో చర్యలు. మేఘదాతులో కర్ణాటక డ్యాముల నిర్మాణాన్ని అడ్డుకునే విధంగా చట్ట పరంగా చర్యలు. న దుల అనుసంధానానికి రూ.253 కోట్లు కేటాయింపు. జాలర్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు రూ.183 కోట్లు. చెన్నై మహానగర అభివృద్ధి పథకానికి రూ.500 కోట్లు మెట్రో రైలు ప్రాజెక్టుకు రూ.615.78 కోట్లు విద్యార్థులకు ల్యాప్ టాప్ల పంపిణికీ రూ.1100 కోట్లు. 6.62 లక్షల మంది విద్యార్థులకు ఈ ఏడాది ఉచిత సైకిళ్ల పంపిణీ. అంగన్ వాడీ కేంద్రాల్లో వంట గ్యాస్ కనెక్షన్లు మంజూరుకు నిర్ణయం రాష్ట్రంలోని మరో 206 ఆలయాల్లో అన్నదాన పథకం అమలు పది లక్షల మందికి ఉపయోగ పడే విధంగా కుదిరై వాయిల్ మొళి, ఆలందలైలలో 186.5 కోట్లతో నిర్లవరణీకరణ పథకం అమలు. ఆరోగ్య బీమా పథకానికి రూ.781 కోట్లు రాష్ట్రంలో 67 లక్షల మొక్కల నాటడమే లక్ష్యంగా కార్యాచరణ రూ.1260 కోట్ల ఖర్చుతో 60 వేల కుటుంబాలకు గ్రీన్ హౌస్‌ల నిర్మాణం 15 లక్షల ఇళ్లల్లో మరుగు దొడ్ల నిర్మాణం లక్ష్యంగా రూ.150 కోట్లు కేటాయింపు 3.5 లక్షల మందికి ఇంటి పట్టాల పంపిణీకి చర్యలు పోలీసు శాఖకు రూ.5,569 కోట్లు కేటాయింపు విద్యార్థుల ఉచిత బస్సు పయనం లక్ష్యంగా రూ.480 కోట్లు కేటాయింపు రేషన్ వస్తువుల నిరాటంకంగా పంపిణీ చేయడం లక్ష్యంగా రూ.5,300 కోట్లు కేటాయింపు. కొరట్టూరు, మాధవరం, అంబత్తూరు చెరువుల పునరుద్ధరణకు రూ.50 కోట్లు. ఉచిత ధోవతి, చీరల పథకానికి రూ.499 కోట్లు చెన్నై నెహ్రూ స్టేడియంలో వికలాంగుల కోసం ప్రత్యేక క్రీడ ప్రాంగణం ఏర్పాటుకు నిర్ణయం.