breaking news
cheting case booked
-
దుర్గ గుడిలో కాదంబరీ జత్వానికి రాచ మర్యాదలు
సాక్షి,విజయవాడ : విజయవాడ దుర్గగుడిలో కాందాంబరి జత్వానికి రాచమర్యాదలు చేశారు ఆలయ అధికారులు. చీటింగ్ కేసులో నిందితురాలిగా ఉన్న జత్వానీ కోసం ఇద్దరు కానిస్టేబుళ్లతో ప్రత్యేక ప్రోటోకాల్ కల్పించారు. ఎమ్మెల్యే,ఎంపీ కాకపోయినా దగ్గరుండి వీఐపీ దర్శనం చేయించారు. పోలీసులపై కేసుపెట్టిన జత్వానీకి పోలీసుల సాయంతో దర్శనం చేయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీఐపీ దర్శన సమయం ముగిసినా..వీఐపీ దర్శనం కల్పించారు. చీటింగ్ కేసు నిందితురాలికి వీఐపీ దర్శనం కల్పించిన పోలీసులు,ఆలయ అధికారులపై భక్తులు మండిపడుతున్నారు. దుర్గగుడిలో భక్తుల అసహనంమరోవైపు ఇంద్రకీలాద్రికి ప్రోటోకాల్ దర్శనాలు పోటెత్తడంతో సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వీఐపీ టైమ్ స్లాట్ దర్శనాలు అమలు కావడంతో భారీగా మొత్తంలో సిఫార్సు లెటర్స్ భక్తులు భారీగా క్యూకట్టారు. దీంతో క్యూలైన్లు ముందుకు కదలక సామాన్య భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. రూ.500 రూపాయలు టిక్కెట్లు తీసుకున్న భక్తులు నాలుగు గంటలుగా క్యూలైన్లోనే దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. రూ.500 రూపాయల టికెట్ ఎందుకు పెట్టారంటూ క్యూలైన్లలోని భక్తులు పోలీసులు,అధికారులతో వాగ్వాదానికి దిగారు. రూ.500 రూపాయలు ఎందుకు పెట్టారంటూ మండిపడుతున్నారు. -
నగదు మార్పిడి ముఠా అరెస్టు
గంపలగూడెం : నగదు మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వి.శ్రీనివాసరావు వివరాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత పాతనోట్లను తీసుకుని పది శాతం కమీషన్‌పై మార్పిడికి పాల్పడుతున్న ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాలకు చెందిన నలుగురి మండల పరిధిలోని గోసవీడులో అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో తిరువూరు మండలం మునుకుళ్ళకు చెందిన శ్రీలం వెంకట్రామిరెడ్డి, వావిలాలకు చెందిన పినపాటి నాగేశ్వరరావు, తెలంగాణలోని ఖమ్మం జిల్లా వెంసూరు మండలం రామన్నపాలేనికి చెందిన గుండాల మురళి, వైరాకు చెందిన నాయుడు మల్లికార్జునరావులను ఉన్నట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.4.40 లక్షల విలువైన రూ.2 వేల నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న గంపలగూడెం ఎస్ఐ శివరామకృష్ణ వారిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. వీరిలో వెంకట్రామిరెడ్డి యాడ్కం సెల్ కమ్యూనికేషన్లో తెలంగాణ ప్రాంతంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తుండగా మిగిలిన నలుగురు తొలుత రియల్ఎస్టేట్ వ్యాపారంలో పరిచయం అయినట్లు చెప్పారు. నోట్ల రద్దుతో వీరంతా కలిసి కమీషన్ వ్యాపారం ప్రారంభి, నోట్లు మార్చినందుకు వెంకట్రామిరెడ్డికి ఎనిమిది శాతం, మిగిలిన ముగ్గురికి రెండు శాతం లాభాన్ని పంచుకుంటున్నారని డీఎస్పీ తెలిపారు. వీరిపై చీటింగ్ , క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నమన్నారు.