breaking news
chetan b sanghi
-
గౌరవంగా బతికేందుకు మరో అవకాశం
సాక్షి, హైదరాబాద్: అక్రమ రవాణాకు గురైన మహిళలను రక్షించి, సమాజంలో గౌరవంగా జీవించేందుకు వారికి మరో అవకాశం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి చేతన్ బి.సంఘి పేర్కొన్నారు. ఇందుకోసం మానవ అక్ర మ రవాణా వ్యతిరేక చట్టానికి ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. మానవ అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు నిందితుల పట్ల ఈ చట్టం కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా యూఎస్ కాన్సులేట్ జనరల్, ప్రజ్వల, కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇక్కడ ప్రారంభమైన దక్షిణాసియా ప్రాంత సదస్సు లో చేతన్ బి.సంఘి మాట్లాడారు. ప్రజ్వల సంస్థ వ్యవస్థాపకురాలు సునీతా కృష్ణన్ చొరవ ఫలితంగా మానవ అక్రమ రవాణా నిర్మూలనకు చట్టం రూపొందించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందన్నారు. పటిష్టమైన భాగస్వామ్యం లేకపోతే మానవ అక్రమ రవాణాలో ప్రభుత్వం, పోలీసులు, న్యాయ వ్యవస్థ, పౌర సమాజం, మీడియా, స్వచ్ఛం ద కార్యకర్తలెవరూ విజయవంతం కాలేరని యూఎస్ కాన్సుల్ జనరల్ కేథరిన్ హడ్డా స్పష్టం చేశారు. కోటి మందికి అవగాహన మానవ అక్రమ రవాణా, వ్యభిచారాన్ని జయించి బయటకు వచ్చిన విజేతల సారథ్యంలో 2016లో స్వరక్ష ప్రచారోద్యమాన్ని ప్రారంభించి, కోటి మందికి అవగాహన కల్పించామని సునీతా కృష్ణన్ తెలిపారు. 18,500 మంది బాధితులను కాపాడానని తెలిపారు. -
నిరుద్యోగ సమస్యపై ఉద్యమిద్దాం
జాతీయ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ చేతన్ బీ సంఘీ సాక్షి, హైదరాబాద్: దేశంలో యువత ప్రధానంగా ఎదుర్కొంటున్న సవాలు నిరుద్యోగమేనని జాతీయ సాంఘిక సంక్షేమ మండలి చైర్మన్ చేతన్ బీ సంఘీ అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ సమస్యతో సతమతమవుతున్న వారిలో 35 ఏళ్లలోపు వారే అధికంగా ఉన్నారని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు శ్రద్ధ చూపాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శుక్రవారం జరిగిన జాతీయ సాంఘిక సంక్షేమ మండలి సదస్సులో ఆయన పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి మహిళకు చేరేలా రాష్ట్ర సాంఘిక సంక్షేమ మండళ్లు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్రం మహిళల కోసం తలపెట్టిన కార్యక్రమాల్ని ప్రారంభించేందుకు త్వరలో రాష్ట్రాని కి కేంద్ర మంత్రి మేనకాగాంధీ రానున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ రాగం సుజాత యాదవ్ చెప్పారు. సదస్సులో వివిధ రాష్ట్రాల ఎస్ డబ్ల్యూబీ చైర్పర్సన్లు, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి జగదీశ్వర్ పాల్గొన్నారు.