breaking news
cherukuru
-
యువకుడి దారుణహత్య
చెరుకూరు (రొద్దం) : మండల పరిధిలోని చెరుకూరు గ్రామ సమీపంలో మడకశిర - పెనుకొండ ప్రధాన రహదారి పక్కన గుర్తు తెలియని యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. శుక్రవారం అర్ధరాత్రి గ్రామప్రజలంతా శివరాత్రి జాగారంలో ఉండగా 35 ఏళ్ల వయసున్న యువకుడి ముఖంపై బండరాళ్లతో మోది చంపేశారు. ఆపై గుర్తు పట్టడానికి లేకుండా పెట్రోల్ పోసి శవాన్ని తగలబెట్టారు. శనివారం గ్రామస్తుల ద్వారా విషయం తెలుసుకున్న సీఐ వేంకటేశ్వర్లు, ఎస్ఐ మున్నీర్‌ఆహ్మద్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌లతో పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన వ్యక్తి ఆచూకీ, హత్యకు గల కారణాలు, దుండగుల వివరాలు తెలుసుకోవడానికి అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసు నమోదు చేసినట్లు సీఐ, ఎస్ఐలు తెలిపారు. -
వ్యక్తి దారుణ హత్య...
ప్రకాశం: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. చెరుకూరు గ్రామానికి చెందిన నవాబు సురేశ్(28) పుట్టుకతోనే మూగవాడు.అదే గ్రామానికి చెందిన ఆరుద్ర సాంబయ్య అనే వ్యక్తి సోమవారం రాత్రి సురేశ్‌ను కత్తితో నరికి ఆటోలో పారిపోయాడు. వివాహేతర సంబంధం నేపథ్యంలో సాంబయ్య, సురేశ్‌ను హత్య చేశాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సురేశ్ భార్య, సాంబయ్యకు మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం ఉందని ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పలు సార్లు ఘర్షణ జరిగిందని స్థానికులు తెలిపారు.