breaking news
Chennur forest area
-
ఆ పులి జాడేది?
సాక్షి, చెన్నూర్: మంచిర్యాల జిల్లా చెన్నూర్ అటవీ డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో సంచరిస్తున్న కే–4 ఆడ పులి జాడ కానరావడం లే దు. పులుల సంరక్షణ కోసం డివిజన్లో పెద్ద ఎత్తు న సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ శాతం ఈ ప్రాంతంలోనే సంచరించే కే–4 పులి 20 రోజులుగా సీసీ కెమెరాలకు చిక్కకపోవడం గమనార్హం. ఈ క్రమంలో పులి జాడ కోసం అటవీ అధికారులు ముమ్మర గాలింపు నిర్వహిస్తున్నట్లు సమాచారం. నడుముకు ఉచ్చుతో.. కే–4 పులి నడుము చుట్టూ ఉచ్చు బిగిసి ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా మొండిగా జీవిస్తోంది. ఇన్నాళ్లు డివిజన్‌లోనే సంచరించే పులి 20 రోజులుగా కనిపించకపోవడంపై అధికారుల్లో ఏమై ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా 15 నుంచి 30 రోజుల్లోపు పులి కెమెరాలకు చిక్కకుంటే అటవీ శాఖ అధికారులు దాని జాడ కోసం దృష్టి పెడుతుంటారు. నీటి కోసం.. వేసవి ప్రారంభమవుతుండటంతో పులి నీటి కోసం అటవీ మార్గంలో విస్తృతంగా సంచరించే అవకాశముంది. ఎక్కువగా సమీపంలోని వాగుల వద్దకు వెళ్తుంటుంది. చెన్నూర్ అటవీ డివిజన్లోని చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి రేంజ్‌ల పరిధిలో 5 నుంచి 6 వాగులున్నాయి. ఈ ప్రాంతాల్లోనూ అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే ఇందులో కూడా పులి జాడ కానరాకపోవడంతో హైరానా పడుతున్నారు. నాలుగేళ్ల క్రితం.. కాగజ్‌నగర్ అటవీ ప్రాంతం నుంచి చెన్నూర్ అటవీ ప్రాంతానికి వస్తున్న క్రమంలో కే–4 ఆడపులి 2017లో వేటగాళ్లు అమర్చిన ఇనుపవైర్లు నడుముకు చుట్టుకుని ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకుని ఇక్కడికి చేరినట్లు సీసీ కెమెరాల్లో నమోదైంది. ఈ క్రమంలో నడుముకు చుట్టుకున్న ఇనుపవైర్ రాపిడీతో గాయమైంది. ఈ గాయంతోనే పులి చెన్నూర్, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతాల్లో సంచరిస్తున్న విషయాన్ని అధికారులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుంటున్నారు. పట్టుకునేందుకు రూ.10 లక్షల ఖర్చు.. గాయంతో ఉన్న పులిని పట్టుకుని రక్షించాలని అటవీ అధికారులు 2018 నుంచే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా టైగర్ ట్రాకర్స్నూ రప్పించినా ఫలితం లేకుండా పోయింది. బోన్లు సైతం ఏర్పాటు చేశారు. అమెరికా తరహాలో సెంట్ స్ప్రే చేసి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఒక్క కే–4 పులిని పట్టుకునేందుకు సుమారు రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేసినట్లు తెలిసింది. అయినా ఇప్పటికీ కే–4 చిక్కకపోవడం గమనార్హం. ఈ పులి పట్టుబడితే నడుముకు ఉన్న ఇనుప వైరును తొలగిస్తే ఆరోగ్యంగా ఉండేదని పలువురు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక బృందాలు.. పులుల సంక్షరణ కోసం చెన్నూర్ డివిజన్ అటవీ అధికారులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డివిజన్లో 5 యానిమల్ ట్రాకర్స్‌ను నియమించారు. అంతేకాకుండా చెన్నూర్ మండలంలోని సంకారం, కోటపల్లి, నీల్వాయి అటవీ ప్రాంతాల్లో మూడు బేస్ క్యాంప్‌లను ఏర్పాటు చేశారు. క్యాంపునకు ఐదు మంది చొప్పున సిబ్బందిని నియమించారు. వీరితో పాటు అటవీ సిబ్బంది పని చేస్తున్నారు. ఇంతమంది సిబ్బంది పని చేస్తున్నా కే–4 జాడ కనిపించకుండా పోవడం ప్రశ్నార్థకంగా మారింది. -
పరారీ ఖైదీ లొంగిపోయాడు..
న్యాయవాది ద్వారా కోర్టుకు హాజరు చెన్నూర్ అటవీ ప్రాంతంలో బేడీలు గోదావరిఖని: కరీంనగర్ జిల్లా గోదావరిఖని కోర్టు నుంచి గురువారం ఎస్కార్ట్ సిబ్బంది కళ్లుగప్పి పరారైన అండర్ ట్రయల్ ఖైదీ నీలపు వంశీకృష్ణ శుక్రవారం అదే కోర్టులో పోలీసులకు లొంగిపోయాడు. పలు కేసుల్లో నిందితుడైన వంశీకృష్ణను ఓ హత్యకేసులో గురువారం కోర్టుకు తీసుకురాగా, పరారైన విషయం తెలి సిందే. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు లు వంశీకృష్ణ తల్లిదండ్రులను తీసుకువచ్చి ఒత్తిడి తేవడంతో అతడు లొంగిపోవాలని నిర్ణయించుకున్నాడు. న్యాయవాది పూర్మ శ్రీనివాస్ ద్వారా శుక్రవారం కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోనే వంశీకృష్ణను వన్‌టౌన్ సీఐ సీహెచ్.శ్రీధర్ అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వంశీకృష్ణను అరెస్ట్ చేశామని, శనివారం కోర్టులో హాజరుపర్చుతామని సీఐ తెలిపారు. వంశీకృష్ణను బైక్‌పై తప్పించిన నాగరాజు కూడా పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చెన్నూరు అటవీ ప్రాంతంలో మకాం.. అయితే, వంశీకృష్ణ కోర్టు నుంచి తప్పించుకొని ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లాడు. గోదావరినది బ్రిడ్జి దాటిన తర్వాత బైక్‌ను వదిలేసి మరో వాహనంలో చెన్నూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు వంశీకృష్ణను పట్టుకోవడానికి ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే వంశీకృష్ణ బంధువులు న్యాయవాదిని సంప్రదించారు. ఆయన అటవీ ప్రాంతానికి వెళ్లి వంశీకృష్ణను తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. వంశీకృష్ణ చేతులకు నూనె రాసి బేడీలను తొలగించుకుని చెన్నూర్ అటవీ ప్రాంతంలోనే పడేశానని తెలిపినట్టు న్యాయవాది వివరించారు. జైల్లో చంపుతాడనే భయానికే... కరీంనగర్ జిల్లా జైలులోనే ఉన్న మరో నిందితుడు తనని చంపుతాడనే భయంతోనే వంశీకృష్ణ పరారైనట్లు న్యాయవాది తెలిపారు. ఈ నెల 11న గోదావరిఖని ఐబీ కాలనీలో ప్రశాంత్ అలియాస్ సన్నీ అనే యువకుడి హత్య కేసులో చందు అనే నిందితుడిని జిల్లా జైలుకు తీసుకొచ్చారు. చందు, వంశీకృష్ణలు హైదరాబాద్‌లో ఉండగా, వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. తర్వాత వారు కలుసుకోలేదు. ఇరువర్గాల మధ్య వైరం అలాగే కొనసాగుతోంది. ఈ క్రమంలో చందు తనను చంపుతాడనే భయంతోనే పరారైనట్లు వంశీకృష్ణ చెప్పాడని న్యాయవాది సత్యనారాయణ పేర్కొన్నారు.