ప్రేమకథలో...
ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కెమిస్ట్రీ’. ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. విశాల్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్న కన్నడ సినిమా ఇది. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు మేకర్స్. ‘‘కెరీర్ బిగినింగ్‌లో రొమాంటిక్ మూవీస్‌లో నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్న నభా నటేష్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఈ జానర్లో ‘కెమిస్ట్రీ’ అనే సినిమా చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఒక పూర్తిస్థాయి ప్రేమకథా చిత్రంలో ఆమె కనిపించడం విశేషం. ధ్రువ సర్జా, నభా నటేష్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. ఈ ఏడాది ‘నాగబంధం’ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన నభా నటేష్ ‘కెమిస్ట్రీ’మూవీతోనూ ఆకట్టుకుంటారు’’ అని చిత్రయూనిట్ పేర్కొంది.