-
హైదరాబాద్‌లో దారుణం.. 17 బాలికపై ఇద్దరు యువకుల అఘాయిత్యం
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చత్రినకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పగూడలో 17 ఏళ్ల మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. గతంలో అలి అనే యువకుడితో బాలికకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో బాగంగా ఉప్పుగూడలో అలి సదరు బాలికను ఇంటికి పిలిచాడు. అనంతరం తన మిత్రుడు ఆర్బాస్‌తో కలిసి అలి బాలికపై లైంగిక దాడి చేశారు. బాధిత బాలిక కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు నిందితులు అలి, అర్బాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని..
హైదరాబాద్‌సిటీ: పాతబస్తీ చత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాజీనగర్‌లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపం చెందిన విజయ్, దీపిక అనే యువతీయువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విజయ్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆస్పత్రికని వెళ్లి... నర్సు అదృశ్యం
చాంద్రాయణగుట్ట: పని నిమిత్తం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ.. ఉప్పుగూడ అరుంధతి కాలనీకి చెందిన ఎల్లయ్య కూతురు శివనీల (19) అదే ప్రాంతంలో ఉన్న శ్రీసాయి క్లినిక్‌లో నర్సుగా పని చేస్త్తోంది. కాగా, ఈ నెల 12వ తేదీన ఉదయం 9 గంటలకు క్ల్లినిక్కు వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల వద్ద ఆరా తీసినా ఫలితం లేకుండా పోయింది. బుధవారం వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేష్ అనే యువకుడిపై అనుమానం ఉన్నట్లు అందులో పేర్కొన్నారు. -
కత్తిపోట్లకు దారితీసిన సిగరెట్ లొల్లి
హైదరాబాద్: వైన్స్ సిట్టింగ్ రూమ్‌లో సిగరేట్ విషయమై ఇద్దరు యువకుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన యువకుడు మరో యువకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాగా.. నిందితుడు వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాప్‌కు వెళ్లి కత్తి తీసుకొచ్చి దాడి చేయడం గమనార్హం. ఇన్స్పెక్టర్ ఎన్.లక్ష్మీనారాయణ కథనం ప్రకారం....తలాబ్‌కట్టా ప్రాంతానికి చెందిన అబ్దుల్ నవీద్ (28), తన స్నేహితుడు షరీఫ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం గౌలిపురా మార్కెట్ ప్రాంతంలోని మాత వైన్స్‌లో మద్యం తాగేందుకు వచ్చాడు. అదే సమయంలో సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన కొందరు యువకులు మద్యం తాగడానికి అదే వైన్స్‌కు వచ్చారు. అంతా కలిసి సిట్టింగ్ రూమ్‌లో మద్యం తాగుతున్నారు. ఆ సమయంలో ఓ యువకుడు నవీద్‌ను సిగరేట్ అడిగాడు. సిగరేట్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే చిత్తుగా తాగి ఉన్న ఆ యువకుడు ఆగ్రహంతో వైన్స్ ఎదురుగా ఉన్న మటన్ షాపు వద్దకు పరుగెత్తికెళ్లాడు. మటన్ వ్యాపారి వద్ద ఉన్న కత్తిని లాక్కొచ్చి నవీద్‌పై దాడి చేశాడు. మెడ భాగంలో పొడిచేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో నవీద్ అడ్డుకోవడంతో ఎడమ చేతిపై పొడిచాడు. బాధితుడు, నిందితుడు పెనుగులాడుకుంటూ బయటికి వచ్చారు. బయట ఉన్న జనాన్ని చూసి నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. ఇది గమనించిన స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement