breaking news
Character building
-
‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!
ఐఐటీలు అంటే అడ్వాన్స్ టెక్నాలజీలతో కూడిన కోర్సులు..పరిశోధనలు..ఆవిష్కరణలు..స్టార్టప్‌లు.. మల్టీనేషనల్ కంపెనీల్లో రూ.లక్షల్లో ప్యాకేజీలతో కూడిన వేతనాలు.. ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఓ విద్యార్థి మంచితనం ఎలా అలవరుచుకోవాలనే దానిపై ఓ ప్రత్యేక కోర్సును ప్రారంభించింది ఐఐటీ హైదరాబాద్. ఉరుకులు పరుగుల జీవితాల్లో కొందరు మంచితనాన్ని మరచిపోతున్నారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు.ఈ నేపథ్యంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు మంచితనాన్ని నేర్పించడంతో పాటు, వ్యక్తిత్వం, బాధ్యత, వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేందుకు దేశంలోనే తొలి సారిగా ‘గుడ్నెస్: క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ హ్యూమన్ ఫ్లోరిషింగ్ క్రెడిట్’కోర్సును ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్నెస్ ఫౌండర్ రవిశర్మ నేతృత్వంలో ప్రారంభించిన ఈ కోర్సులో సుమారు 140 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ కోర్సుల్లో పలు సెషన్లు ఉంటాయి. కేవలం విద్యాపరమైన జ్ఞానంపైనే దృష్టి పెట్టకుండా, విద్యార్థుల సక్సెస్‌కు నిర్వచనం ఏంటి? జీవితంలో దేనికి విలువ ఇస్తారు? ఆ ఎంపికలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను సైతం బోధిస్తారు. - సాక్షిప్రతినిధి, సంగారెడ్డిగుడ్నెస్ క్లాసుకు హాజరైన ఐఐటీహెచ్ విద్యార్థులుఏం నేర్పిస్తారంటే?మంచితనాన్ని అర్థం చేసుకోవడం: దైనందిన జీవితంలో విలువలు, నీతి, నైతికత, మంచితనాన్ని అన్వేషించడం.మంచితనాన్ని కొలవడం (గుడ్నెస్ ఇండెక్స్): దయ, కరుణ, నిజాయితీ, బాధ్యత, న్యాయం, విశ్వసనీయత, పర్యావరణ పరిరక్షణ వంటి గుణాలను అర్థం చేసుకోవడం.విజయం మరియు మంచితనం: ర్యాంకింగ్‌లు, వృత్తిపరమైన విజయం నిర్వచనాలు, సంపద, ఆనందం, సంబంధాలు, సమాజానికి చేసిన సేవను పరిశీలించడం.జీవిత పంచతంత్రం–మానవ వికాసం: శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును అన్వేíÙంచడం.సమగ్రత–విశ్వాసం: బాధ్యతాయుతమైన ప్రవర్తన సమాజ అభివృద్దికి ఎలా దోహదపడతాయో అర్థం చేసుకోవడం.మంచితనాన్ని నేర్చుకోవడం, ఆచరించడం : వ్యక్తిగత సామాజిక బాధ్యత, కుటుంబం, సహచరులు, సంస్థలు, పర్యావరణం పట్ల మన బాధ్యతలపై మననం చేసుకోవడం.వ్యక్తిగత శీలం, సామాజిక విశ్వాసం: సంస్థాగత బలం, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని దేశ నిర్మాణంతో అనుసంధానించడం.నన్ను నేను మార్చుకునేలా చేసింది...నాకు సక్సెస్ అంటే, మంచితనం అంటే అస్పష్టమైన నిర్వచనాలు ఉండేవి. కానీ ఈ కోర్సు ద్వారా ఈ అంశాలపై మరింత స్పష్టత వస్తోంది. నన్ను నేను మార్చుకునేలా చేసింది.నా తోటి విద్యార్థుల ముందు ఒక చిన్న ప్రసంగం చేసినప్పుడు నా స్టేజ్ ఫియర్‌ను కూడా అధిగమించాను. కోర్సు అంశాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నా. – ఆయుష్, విద్యార్థి, ఏఐ.నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది...గుడ్నెస్ కోర్సును తీసుకునే ముందు, ఇది ఓ సాధారణ కోర్సు అని అనుకున్నా.. కానీ అత్యంత విశిష్టమైన, ఆలోచింపజేసే అభ్యాస ఎక్స్పీరియన్గా నిలుస్తోంది. మంచితనం, సక్సెస్ అంటే ఏంటి? అనే అంశాలు నేర్చుకుంటున్నాను. తరచుగా అపార్థం చేసుకునే భావనల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేలా ఈ కోర్సు ప్రోత్సహించింది. నా హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని మెరుగుపరిచి, నా విలువలు మరియు నమ్మకాలపై పునరాలోచించుకునేలా చేసింది. – అనిరుద్దా కభ్రా,విద్యార్థి, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్.అర్థవంతమైన జీవితాన్ని వివరిస్తుంది...విద్య కేవలం జ్ఞానాన్ని, వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికే పరిమితం కాకూడదు. విద్యార్థులను వారి వ్యక్తిత్వం, బాధ్యతలు, సమాజానికి వారి సహకారం గురించి ఆలోచించేలా ప్రోత్సహించాలి. ‘గుడ్నెస్’కోర్సు అర్థవంతమైన జీవితాన్ని గడపడం అంటే ఏమిటో వివరిస్తుంది. మెరుగైన సమాజానికి, సమైక్య భారత్‌కు ఎలా దోహదపడతాయో మా విద్యార్థులు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. – ప్రొ.బీ.ఎస్.మూర్తి, ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ఇదీ చదవండి: బలవంతపు నవ్వైనా.. బోలెడంత రిలీఫ్... ఓసారి నవ్వి చూడండి! -
పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు?
సెల్ఫ్ చెక్ చెట్టుకు వేళ్లు ఎంత ప్రధానమైనవో, మనిషికి సచ్చీలత అంతే ప్రధానం. వేర్ల దృఢత్వం మీద చెట్టు ఆధారపడినట్లే, మనిషికి మంచి నడవడి విలువను ఇస్తుంది. క్యారెక్టర్ బిల్డింగ్ చిన్నతనం నుంచే జరగాలి. అందుకే పిల్లల్లో మంచి విలువలను పెంపొందించడానికి తల్లిదండ్రులు, నానమ్మ, తాతయ్యలు విశేష పాత్ర వహించాలి. మీరు ఎలా పెంచుతున్నారు? 1. పిల్లలకు మంచిబుద్ధులు చెప్పేముందు మీరెలాగ ఉన్నారో మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారు. ఎ. కాదు బి. అవును 2. పిల్లలు మీతో ఎంత సమయం గడుపుతున్నారో గమనిస్తారు. సమాజం గురించి పూర్తి అవగాహనను వారికి అందిస్తారు. ఎ. కాదు బి. అవును 3. తప్పు, ఒప్పుల ప్రస్తావన తెచ్చేకంటే, మంచిగా ఉండటం ఎలానో నేర్పటానికే ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 4. పనిలో శ్రద్ధ, స్వీయ క్రమశిక్షణ, ఇతరుల యందు దయతో ఉండటం, సమాజసేవ, నిజాయితీ, దాతృత్వం మొదలైన లక్షణాలు పిల్లల్లో పెంపొందించటానికి ప్రయత్నిస్తారు. ఎ. కాదు బి. అవును 5. అందరూ కలిసి ఒకే సమయంలో భోజనం చేసే విషయాన్ని చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు. అక్కడే పిల్లల ప్రవర్తన గమనించి వారికి మంచి అలవాట్లు నేర్పుతారు. ఎ. కాదు బి. అవును 6. పిల్లలకు పాఠశాల దశ చాలా ముఖ్యమైంది. అందుకే ఈ దశలో పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతారు. ఎ. కాదు బి. అవును 7. పిల్లలు చెప్పేదాన్ని శ్రద్ధగా వింటారు. వారితో ఇంటరాక్షన్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయిస్తారు. ఎ. కాదు బి. అవును 8. పిల్లలు తప్పులు చేయటం సహజం. అందుకే దండనతో కాకుండా ప్రేమతో వారిని మంచి నడవడికలో పెడతారు. ఎ. కాదు బి. అవును 9. పిల్లల నైతికతకు అడ్డొచ్చే ప్రసారమాధ్యమాలను దూరంగా పెడతారు. మంచి కార్యక్రమాలపై వారికి ఆసక్తిని కలిగిస్తారు. ఎ. కాదు బి. అవును 10. వీలున్నప్పుడల్లా పిల్లలకు నీతి కథలు చెప్తుంటారు. చెడుగా ప్రవర్తించటం వల్ల కలిగే ప్రమాదాలను వివరిస్తారు. మంచి పుస్తకాలు చదివేలా ప్రేరణ కలిగిస్తారు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే పిల్లల్లో శీల నిర్మాణానికి మీరు బాగా కృషి చేస్తున్నట్లే. చెప్పేటందుకే నీతులు ఉన్నాయన్నట్లు కాకుండా మీరూ మంచి నడవడికతో ఉంటూ పిల్లల్లో స్ఫూర్తిని నింపుతుంటారు. ఇలానే కొనసాగిస్తూ పిల్లల్లో నైతిక ప్రవర్తన మెరుగు పడటానికి కృషి చేయండి. ‘ఎ’ లు ఆరు దాటితే పిల్లల్లో క్యారెక్టర్ బిల్డింగ్‌కు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే చెప్పాలి. పిల్లల్లో అనుకరణ ఎక్కువ. అందుకే మంచి పనులు ఎలా చేయాలో వారికి తెలుపండి. ఇఫ్ దే ఆర్ నాట్ గెట్ ద క్యారెక్టర్, దెయిర్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్.


