breaking news
chalo HCU
-
ఏప్రిల్ 6న హెచ్‌సీయూ ముట్టడి
గచ్చిబౌలి : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ జేఏసీ ఏప్రిల్ 6న ‘చలో హెచ్‌సీయూ’కు పిలుపునిచ్చింది. శనివారం హెచ్‌సీయూలో జేఏసీ సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రోహిత్ వేముల ఆత్మహత్య, మార్చి 22న జరిగిన లాఠీ చార్జీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలిసింది. మీడియా, ఇతర నాయకులు, ప్రముఖులను లోపలికి అనుమతించక పోవడంతో ఉద్యమం ఆశించిన స్థాయిలో జరగడం లేదని జేఏసీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఈ క్రమంలో యూనివర్సిటీ ప్రధాన ద్వారం ముందు నిరసన తెలపాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 6న చలో హెచ్సీయూకు పిలుపునిచ్చింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల విద్యార్థులు చలో హెచ్సీయూకు తరలిరావాలని కోరింది. పది వేల మంది విద్యార్థులతో హెచ్‌సీయూను ముట్టడించన్నుట్లు జేఏసీ ప్రతినిధులు తెలిపారు. -
సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
-
సెంట్రల్ యూనివర్సిటీలో టెన్షన్ టెన్షన్
హైదరాబాద్: హెచ్ సీయూలో సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన పీహెచ్డీ విద్యార్థి రోహిత్‌కు న్యాయం జరగాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీల విద్యార్థులు చలో హెచ్సీయూకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బయటి వ్యక్తులను యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు. రాజకీయ నాయకులు, ఇతర సంఘాల నాయకులు సైతం యూనివర్సిటీలోకి ప్రవేశించడానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మహారాష్ట్ర నుంచి వచ్చిన ఇద్దరు మాజీ మంత్రులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, ఏపీ నుండి పలువురు విద్యార్థులు హెచ్సీయూకు చేరుకున్నట్లు విద్యార్థి నాయకులు తెలిపారు. కాగా ఐడీ కార్డు లేనివారిని పోలీసులు యూనివర్సిటీలోకి అనుమతించడం లేదు. దేశవ్యాప్తంగా సుమారు 10,000 మంది విద్యార్థులు హెచ్సీయూకు రానున్నట్లు విద్యార్థి జేఏసీ నేతలు వెల్లడించారు. హెచ్‌సీయూలో ఇవాళ నిర్వహించే సభలో అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు బాలచంద్ర ముంగేకర్, జేఎన్‌యూ అసిస్టెంట్ ప్రొఫెసర్ మీనా కందస్వామి, హరగోపాల్, కాకి మాధవరావు సహా పలువురు పాల్గొననున్నారు. -
'ఉద్యమం ఆగదు.. 25న ఛలో హెచ్‌సీయూ'
హైదరాబాద్: దళిత పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో తాము చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసినంతమాత్రాన తమ ఉద్యమం ఆగబోదని హెచ్‌సీయూ విద్యార్థి జేఏసీ స్పష్టం చేసింది. మరో ఏడుగురు విద్యార్థులతో మరోసారి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నట్టు తెలిపింది. హెచ్‌సీయూ ప్రాంగణంలో విద్యార్థుల దీక్షను భగ్నం చేసి.. వారిని ఆస్పత్రికి తరలించిన నేపథ్యంలో విద్యార్థి జేఏసీ నేతలు శనివారం రాత్రి విలేకరులతో మాట్లాడింది. రోహిత్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ, తమ డిమాండ్లన్నీ నెరవేరేవరకూ తమ పోరాటం కొనసాగుతుందని హెచ్‌సీయూ జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 25న 'ఛలో హెచ్‌సీయూ' కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశంలోని అన్ని వర్సిటీల నుంచి విద్యార్థుల తరలిరావాలని కోరారు.