breaking news
Centre for Development of Advanced Computing
-
ఉద్యోగాలు
సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రాంచిలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ ఓవర్‌మెన్: 94 అర్హతలు: డీజీఎంఎస్ జారీచేసిన ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. మైనింగ్ సిర్దార్: 238 అర్హతలు: డీజీఎంఎస్ జారీ చేసిన మైనిం గ్ సిర్దార్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి. డిప్యూటీ సర్వేయర్: 15 అర్హతలు: పదో తరగతితో పాటు డీజీఎంఎస్ జారీ చేసిన మైన్స్ సర్వే సర్టిఫికెట్ ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16 వెబ్సైట్: http://ccl.gov.in/ సీడాక్ హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రాజెక్ట్ మేనేజర్: 1 ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 2 ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రాజెక్ట్ అసిస్టెంట్: 4 ప్రాజెక్ట్ ఇంజనీర్ (మల్టీమీడియా): 1 అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1 వెబ్సైట్: http://cdac.in/ సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ భువనేశ్వర్‌లోని సెంట్రల్ టూల్ రూమ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: మెకానికల్/ ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం అవసరం. మేనేజర్ (ప్రొడక్షన్) అర్హతలు: టూల్ డిజైన్‌లో పీజీ లేదా పీజీ డిప్లొమా ఉండాలి. ఐదేళ్ల అనుభవం అవసరం. సీనియర్ ఇంజనీర్ (ప్రొడక్షన్) అర్హతలు: పీజీ డిప్లొమా ఇన్ టూల్ డిజైన్/ప్రొడక్షన్ లేదా క్యాడ్-క్యామ్ ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31 వెబ్సైట్: www.cttc.gov.in -
పరమ్ సూపర్ కంప్యూటర్
న్యూఢిల్లీ: భారత శాస్త్రవేత్తలు రూపొందించిన పరమ్ యువ- 2 సూపర్ కంప్యూటర్ ప్రపంచంలో విద్యుత్‌ను సమర్థంగా వినియోగించుకునే కంప్యూటర్ సిస్టమ్‌లలో ఒకటిగా నిలిచింది. అమెరికాలోని డెన్వర్‌లో జరిగిన సూపర్ కంప్యూటింగ్ కాన్ఫరెన్స్(ఎస్సీ 2013)లో ఈ మేరకు ‘గ్రీన్500’ జాబితా విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీ-డాక్) తయారు చేసిన పరమ్ యువ-2 సూపర్ కంప్యూటర్ దేశంలో మొదటి స్థానంలో.. ఆసియాలో 9వ స్థానంలో, ప్రపంచంలో 44వ స్థానంలో నిలిచింది. విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునే కంప్యూటర్లకు ‘గ్రీన్-500’ ర్యాంకులను ప్రకటిస్తూ ఉంటుంది.