breaking news
Central Tourism Minister
-
ఏపీకి స్వదేశీ దర్శన్ నిధులు మంజూరు చేయండి..
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లద్ సింగ్ పటేల్‌ను బుధవారం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, వైఎస్సార్సీసీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధిపై చర్చించారు. అనంతరం మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రం స్వదేశీ దర్శన్ పథకం కింద రాష్ట్రానికి నిధులు మంజూరు చేయాలని కోరామన్నారు. గతం ప్రభుత్వం పట్టించుకోని కారణంగా రాష్ట్రానికి ఈ పథకం ద్వారా నిధులు రాలేదని, కేంద్రానికి స్వదేశి దర్శన్ కింద 900 కోట్లకు ప్రతిపాదనలు ఇచ్చినట్లు తెలిపారు. దీనిపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని, త్వరలో అమరావతి లేదా విశాఖపట్నంలో పర్యాటక రంగంలో పెట్టుబడులపై సదస్సు నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కేంద్రం పర్యాటక మంత్రి సమయాన్ని బట్టి తేదీలను ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఆ తేదీలకు అనుగుణంగానే పర్యాటక సదస్సును నిర్వహిస్తామన్నారు. ఈ నెల 25న జరిగే పర్యాటక శాఖ మంత్రుల సమావేశంలో తేదీలు ఖరారు చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం దేవాలయాలను కూల్చి ఘోర తప్పిదం చేసిందని, ఆ 24 దేవాలయాలను తిరిగి పున ప్రతిష్ట చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయాల కోసం ప్రత్యేకంగా ఆర్థిక సాయం చేయాలని కోరినట్లు, దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పును తమ ప్రభుత్వం సరిచేస్తుందని స్పష్టం చేశారు. -
ఐటీసీకి చార్మినార్, జీఎమ్ఆర్కు గోల్కొండ!
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ ఎర్రకోటను దాల్మియా భారత్ కంపెనీ చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ కోవలోకి ఇప్పుడు జీఎమ్ఆర్, ఐటీసీ హోటల్స్ కూడా చేరాయి. ఈ క్రమంలో ఐటీసీ కంపెనీ 400 ఏళ్ల నాటి చారిత్రక కట్టడం, హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న చార్మినార్‌ను దత్తత తీసుకోవడం కోసం ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ)ను దాఖలు చేసింది. చార్మినార్ దత్తత కోసం ఐటీసీకి పోటీగా మరే ఇతర కంపెనీ పోటీ పడకపోవడంతో ఐటీసీ దరఖాస్తును విజన్ కమిటీ, ఒవర్‌నైట్ కమిటీ ఆమోదించాయి. అలానే జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ఈ ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడు చారిత్రక కట్టడాల దత్తత కోసం దరఖాస్తు చేసింది. వాటిలో ఢిల్లీలోని ఎర్రకోట, గోల్కొండ కోట కూడా ఉన్నాయి. దీని గురించి జీఎమ్ఆర్ స్పోర్ట్స్ కంపెనీ అధికారులు ‘ మేము గోల్కొండ కోట కోసం వేసిన బిడ్‌ను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఒకవేళ మా బిడ్ కమిటీకి నచ్చి, మాకు గోల్కొండ కోటను కేటాయిస్తే అప్పుడు మేము ప్రభుత్వంతో ఒక ఎమ్వోయూను కుదుర్చుకుంటాము’ అని తెలిపారు. జీఎమ్ఆర్ స్పోర్ట్స్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు ప్రచారకర్తగా ఉన్న విషయం తెలిసిందే. ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ :... చారిత్రక కట్టడాల సంరక్షణతో పాటు పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్ధేశంతో కేంద్ర ప్రభుత్వం 2017, సెప్టెంబరులో ‘అడాప్ట్ ఏ హెరిటేజ్’ కార్యక్రమం ప్రారంభింది. ఈ దత్తత కార్యక్రమంలో భాగంగా దాదాపు 100 చారిత్రక కట్టడాల పేర్లను ప్రకటించింది. తాజ్‌మహల్, ఎర్రకోట, సూర్య దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్ వంటి చారిత్రక కట్టడాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్ధేశం పర్యటక రంగంలో కార్పొరేట్ సంస్థలను భాగస్వామ్యం చేసి ఆయా చారిత్రక కట్టడాలను సంరక్షించడం. చారిత్రక కట్టడాల దత్తత కార్యక్రమంలో భాగంగ కేంద్ర ప్రభుత్వం టెండర్లను ఆహ్వానిస్తుంది. అత్యధిక బిడ్ వేసిన కంపెనీలకు ఈ చారిత్రక కట్టడాలను కేటాయిస్తారు. ఇక రానున్న ఐదేళ్లపాటు ఆయా చారిత్రక కట్టడాల సంరక్షణ బాధ్యత ఆ కంపెనీలదే. ఈ కార్యక్రమం అమలులో భాగంగా ఎర్రకోటను దత్తత చేసుకోవాడానికి దాల్మియా భారత్ గ్రూపు, ఇండిగో ఎయిర్‌లైన్స్ కంపెనీలు పోటీ పడగా... చివరకు ఈ రేసులో దాల్మియా భారత్ కంపెనీ 25 కోట్ల రూపాయల టెండర్ వేసి ఎర్రకోటను దక్కించుకుంది. ఇకమీదట ఎర్రకోట సంరక్షణ బాధ్యతలతో పాటు ఎర్రకోటకు వచ్చే పర్యాటకుల బాధ్యత కూడా ఇక దాల్మియానే చూసుకోనుంది. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) : ఏదైనా వ్యాపారంలో భాగస్వామి అయ్యేందుకు లేదా ఉద్యోగం చేసే ఉద్ధేశంతో ఒక కంపెనీ లేదా పెట్టుబడిదారు పోటీ పడటం. -
నగరానికి నేడు కేంద్రమంత్రి చిరంజీవి రాక
సాక్షి, ముంబై: కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి శనివారం నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగువారి కార్యక్రమానికి కూడా హాజరుకానున్నారు. కామాటిపుర ప్రాంతంలో ఆధునీకరించిన అఖిల పద్మశాలి సమాజం హాలును ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మిలింద్ దేవరాతోపాటు స్థానిక ఎమ్మెల్యే అమీన్ తదితర ప్రముఖులు పాల్గొననున్నట్టు సమాజం అధ్యక్షుడు దొంతుల బాలనర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఎతురాజుల గంగాధర్‌లు ఓ ప్రకటనలో తెలిపారు.