breaking news
CCTV video
-
బిచ్చగత్తెను కాల్చేశారు...
బ్రెజిల్‌లోని రీయో డీ జెనిరో నగరంలో పట్టపగలు ఓ ఘోరం జరిగి పోయింది. ఇల్లూ వాకిలి లేక రోడ్డు మీద భిక్షమెత్తుకునే 31 ఏళ్ల జిల్దా హెన్రిక్ డాస్ సంతోష్ లియోనార్దో ‘ఆకలవుతోంది. 25 సెంట్లు ఇవ్వండి ప్లీజ్..బన్ను కొనుక్కుంటా!’ అంటూ ఓ బాటసారి వెనకాల పడింది. ఆమె వైపు చూడకుండానే ఆ బాటసారి ‘చీ పో!’ అంటూ ఓ సారి కసురుకున్నాడు. ఆమె వినిపించుకోకుండా ఆయన పక్కకు వచ్చి మళ్లీ చేయి చాపడంతో చిర్రెత్తి పోయిన అతగాడు బొడ్డు లోనుంచి రివాల్వర్ తీసి నేరుగా ఆమెను కాల్చాడు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లే లోగానే ఆమె ప్రాణం పోయింది. అంతకు నాలుగు గంటల ముందే ఆ ప్రాంతంలోనే నలుగురు భిక్షగాళ్లు విష ప్రయాగానికి మరణించారు. ఆ నేపథ్యంలో బిచ్చగత్తెను కాల్చేశారన్న వార్త సంచలనం సృష్టించింది. ఏడుగురు పురుషులు, ఒక యువతి ఉన్న బృందం ఓ మద్యం బాటిల్‌ను రోడ్డు ఫుట్‌పాత్‌పై ఉన్న భిక్షగాళ్లకు ఇచ్చి పోయారట. అందులోని మద్యాన్ని తాగిన ఎనిమిది మంది భిక్షగాళ్లు తీవ్రంగా అస్వస్థులయ్యారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించగా నలుగురు చనిపోగా, మరో నలుగురు ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. డ్రగ్ మాఫియా ఆ మద్యం బాటిల్‌ను ఇచ్చిందా? మరెవరైనా బిచ్చగాళ్ల నిర్మూలనకు ఇలా చంపుతున్నారా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇక బిచ్చగత్తెను హత్యచేసిన బాటసారిని సీసీ కెమేరాల ద్వారా 39 ఏళ్ల అడెర్బాల్ రామోస్ డీ కాస్ట్రోగా గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ రోడ్డు మీద భిక్షగాళ్ల బెడద ఎక్కువగా ఉందని, తాను ఆ రోడ్డు మీద వెళ్లినప్పుడల్లా వేధిస్తుంటారని, ఆ రోజు సొంతంగా ఓ హోటల్‌ను ఏర్పాటు చేయడం కోసం డబ్బును తీసుకెళుతుంటే ఆమె వెంట పడటంతో డబ్బెక్కడ దోచుకుపోతుందోనన్న భయంతో కాల్పులు జరిపానని అతడు వాదిస్తున్నారు. సీసీ టీవీ కెమేరాలోని దృశ్యాలను చూస్తే అడెర్బాల్ వాదన తప్పని తెలుస్తోంది. గత శనివారం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి వీడియో ఇప్పుడు ఆన్లైన్లో వైరల్ అవుతోంది. -
పెట్రోల్ బంకులో ప్రమాదకరమైన సంఘటన
-
పెట్రోల్ బంకులో షాకింగ్ సంఘటన
తిరునెల్వేలి : బైకులో ట్యాంక్ ఫుల్ చేయించుకున్న ఓ వాహనదారునికి, ప్రమాదకరమైన అనుభవం ఎదురైంది. పెట్రోల్ బంకులో ట్యాంక్ నింపుకుని బయలుదేరబోతున్న సమయంలో అగ్నిప్రమాదానికి గురయ్యాడు ఆ వాహనదారుడు. ఈ షాకింగ్ సంఘటన తిరునెల్వేలి పెట్రోల్ బంకులో చోటు చేసుకుంది. సీసీటీవీలో ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. బైకుపై కూర్చున్న వాహనదారుడు, తన ట్యాంక్ ఫుల్ చేయించున్నాడు. ఆ అనంతరం నగదు చెల్లించి, బైక్ స్టార్డ్ చేశాడు. ఇక అంతే భగ్గుమని మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు వాహనదారుడు గాయాల పాలయ్యాడు. బైకుకు మంటలు అంటుకోవడంతో, వాహనదారుడిని రక్షించడానికి పెట్రోల్ బంక్ సిబ్బంది అంతా అతని వద్దకు పరిగెత్తారు. గాయాల పాలైన ఆ వ్యక్తిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వాహనదారుడు తన ట్యాంక్ ఫుల్ చేయించుకున్న అనంతరం ఫ్యూయల్ ట్యాంక్ నుంచి పెట్రోల్ లీకై ఉండొచ్చని రిపోర్టులు తెలిపాయి. ఇదే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని తెలిసింది. ఈ ప్రమాదాన్ని పోలీసులు విచారణ చేస్తున్నారు. పెట్రోల్ బంకులో ప్రమాదం: సీసీటీవీ దృశ్యాలు -
సంచలన కేసులో కీలక మలుపు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో సంచలనం రేపిన కుటుంబం ఆత్మహత్యల కేసు కీలక మలుపు తిరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 11 మందిని ఆత్మహత్యలకు ప్రేరేపించినట్లు అనుమానిస్తున్న ఓ మహిళను ఢిల్లీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. తాంత్రిక పూజల వెనుక ఆ మహిళ హస్తం ఉందన్న కోణంలో విచారణ కొనసాగుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేది. ఓ కప్పులో నీళ్లు ఉంచితే.. అది రంగు మారగానే నాన్న వచ్చి కాపాడతాడని బురారీ ఏరియాకి చెందిన లలిత్ భాటియా(45) తన కుటుంబాన్ని నమ్మించాడు. ఈ క్రమంలో తాంత్రిక పూజలు చేసిన అనంతరం కుటుంబం మొత్తం గత ఆదివారం సామూహిక ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. అయితే ‘గీతా మా’ అనే మహిళ వీళ్లను తాంత్రిక పూజల దిశగా నడిపించినట్లు అనుమానాలున్నాయి. మరోవైపు కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత ప్రధాన ద్వారం తెరిచి ఉండటంతో పూజలు చేసిన వ్యక్తి ఆ మార్గం గుండానే వెళ్లిపోయి ఉండొచ్చన్న అనుమానాలున్నాయి. ఈ కేసుకు సంబంధించి 12వ వ్యక్తి మిస్టరీ చేధించే క్రమంలో గీతా మాను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించి ఓ డైరీని సేకరించిన పోలీసులు, దాని ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎవరీ గీతా మా...? లలిత్ భాటియా కుటుంబానికి, పోలీసులు అదుపులోకి తీసుకున్న గీతా మాకు సంబంధం ఉంది. భాటియా కుటుంబం ఉంటున్న ఇంటిని ఓ కాంట్రాక్టర్ నిర్మించారు. ఆ కాంట్రాక్టర్ కూతురే గీతా మా కావడం గమనార్హం. ఆమెకు లలిత్ భాటియాకు సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. ఏదైన కారణంతో భాటియా కుటుంబం తమకు తామే బలవన్మరణానికి పాల్పడేలా చేసి ఉండొచ్చునేమోనని గీతా మాను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత కథనాలు 11 మంది మరణం: అతడే సూత్రధారి బురారీ కేసులో 12వ వ్యక్తి?? తండ్రి కాపాడుతాడని... -
తండ్రి కాపాడుతాడని...
న్యూఢిల్లీ: దేశరాజధానిలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోయిన కేసు మరో మలుపు తిరిగింది. ఆత్మహత్య సందర్భంగా చనిపోయిన తండ్రి తమను కాపాడతాడని భాటియా కుటుంబం నమ్మేదని ఇంట్లో పోలీసులకు లభ్యమైన డైరీల్లో ఉంది. ఈ క్రతువులో భాగంగా ‘ఓ కప్పులో నీళ్లు ఉంచండి. అది రంగు మారగానే నేను వచ్చి మిమ్మల్ని కాపాడతాను’ అని లలిత్ భాటియా(45)తో ఆయన తండ్రి అన్నట్లు వీటిలో ఉంది. జూన్ 30న(శనివారం) చివరిసారిగా రాసిన డైరీలో ఈ క్రతువుల్ని ‘దేవుడి దగ్గరకు దారి’గా లలిత్ అభివర్ణించాడు. కొన్నేళ్ల క్రితం చనిపోయిన తండ్రి తనకు కన్పిస్తున్నారనీ, ఆయన సూచనలతో మోక్షం కోసం ఈ క్రతువును పాటించినట్లు లలిత్ రాసుకున్నాడు. మరోవైపు భాటియా కుటుంబం ఆత్మహత్యకు చేసుకుంటున్న ఏర్పాట్లు ఎదురింటివారు అమర్చిన సీసీటీవీలో నమోదయ్యాయి. దీన్ని ఓ జాతీయ మీడియా సంస్థ బుధవారం ప్రసారం చేసింది. తాంత్రిక క్రతువులో భాగంగా భాటియా కుటుంబం పెద్ద కొడలు సవిత, ఆమె కుమార్తె నీతూలు శనివారం రాత్రి 10 గంటలకు ఐదు కుర్చీలను ఇంట్లోకి తీసుకెళ్లినట్లు వీడియోలో ఉంది. మరో 15 నిమిషాలకు ఉరి వేసుకునేందుకు కావాల్సిన వైర్లను శివమ్(15), ధ్రువ్(12)లు తీసుకొచ్చారు. కాగా, ఈ దారుణం జరిగిన రోజున బయటివారెవరూ భాటియా ఇంట్లోకి వెళ్లలేదని పోలీసులు స్పష్టం చేశారు. బురారీ ఘటనలో చనిపోయిన శివమ్(15), ధ్రువ్(15) చదువులో ఎప్పుడూ చురుగ్గానే ఉండేవారని ఢిల్లీకి చెందిన వీరేంద్ర పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయుడు తెలిపారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా సంఘటన జరిగిన తీరుతెన్ను ఇదే.. శనివారం రాత్రి 10 గంటలు: పెద్ద కోడలు సవిత, ఆమె కుమార్తె నీతూ ఆత్మహత్య కోసం కుర్చీలు తెచ్చారు. ► 10:15గంటలు–ధ్రువ్, శివమ్లు ఉరి కోసం వైర్లను తీసుకొచ్చారు. ► 10:39– ఆర్డర్ చేసిన 20 రొట్టెల్ని ఓ వ్యక్తి డెలివరీ చేశాడు ► 10:57– పెద్ద కుమారుడు భవనీశ్ ఇంట్లోని కుక్కను షికారుకు తీసుకెళ్లాడు. ► 11:04– కుక్కను ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం ► 5.56 గంటలు– పాలవాడు క్యాన్లను ఇంటిదగ్గర పెట్టివెళ్లాడు. ► 7.14– పొరుగునే ఉన్న ఓ వ్యక్తి ఇంట్లోకి వెళ్లి మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. -
నిమ్స్ వద్ద దాడి.. షాకింగ్ వీడియో
సాక్షి, హైదరాబాద్ : నిమ్స్ లో విధి నిర్వహణలో ఉన్న సురేశ్ అనే సెక్యూరిటీ సూపర్ వైజర్ పై మెడికల్ రిప్రజెంటేటివ్ దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడి జరగ్గా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వాహనాలకు అనుమతి లేని స్థలంలో నిలిపినందుకు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేశ్ అభ్యంతరం తెలిపాడు. ఓ కంపెనీకి చెందిన పది మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిమ్స్ లోని క్యాంటీన్ సమీపంలో వాహనం నిలిపి అక్కడే గుంపుగా నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అధికారుల ఆదేశం మేరకు సెక్యూరిటీ సూపర్ వైజర్.. వారిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించాడు. పార్కింగ్ చేసిన వాహనాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరాడు. నిర్లక్ష్యంగా సమాధానమిచ్చిన మెడికల్ రిప్రజెంటేటివ్ ను గట్టిగా నిలదీశాడు. దీంతో గుంపులోని ఓ వ్యక్తి సురేష్ పై దాడి చేశాడు. కిందపడేసి కొట్టడంతోపాటు బూతులు తిట్టాడు. ఈ విషయాన్ని సదరు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేష్ నిమ్స్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. ఎలాంటి ఫలితం లేకపోయింది. పైగా దాడి చేసిన మెడికల్ రిప్రజెంటేటివ్ తో రాజీ కుదుర్చుకోవాలని అధికారులు సూచిస్తున్నట్లు తెలిసింది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో సురేష్ ఫిర్యాదు చేశాడు. వాహనాల పార్కింగ్ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఓ వైపు చెబుతుండగా ఉల్లంఘన దారులతో రాజీ కుదుర్చుకోవాలని నిమ్స్ అధికారులు చెబుతుండటం వల్ల కిందిస్థాయి సిబ్బంది మనోస్థైర్యం కోల్పోతున్నారు. -
నిమ్స్ వద్ద దాడి.. షాకింగ్ వీడియో
-
వరంగల్‌లో షాకింగ్ వీడియో..
సాక్షి, వరంగల్ : నడిరాత్రి మొదలుకొని సరిగ్గా తెల్లవారే వరకు మిగితా వారంతా గాఢ నిద్రలో ఉండగా వారు మాత్రం కంటిపై రెప్పవేయకుండా పనిచేస్తుంటారు. శుభ్రతను వృత్తిగా తీసుకొని చెత్తాచెదారాన్ని ఊడ్చిపారేస్తుంటారు. ఆ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలు ఎన్నో.. వారు సురక్షితంగా ఇల్లు చేరే వరకు కూడా బిక్కుబిక్కుమనుకుంటూ ఉండాల్సిందే. ఎందుకంటే నడి రోడ్డుపై వాళ్లు చెత్తను శుభ్రం చేసే పనుల్లో ఉండగా అటుగా వచ్చే వాహనాలు ఎలా వస్తుంటాయో ఎవరూ ఊహించలేరు. ఎవరు తాగి నడుపుతుంటారో, ఎవరు నిద్రపోయి డ్రైవ్ చేస్తుంటారో, ఎవరు కావాలని మీదకు వాహనాలు తోలుకొస్తారో అస్సలు ఊహించలేరు. ఇంకా చెప్పాలంటే పనిమీద ధ్యాసతో పాపం వారు పారిశుధ్య పనుల్లో నిమగ్నమవుతారు. అలా ఉన్న సమయంలో వారు అనేక ప్రమాదాలకు గురై ప్రాణాలుకోల్పోతుండటం అప్పుడప్పుడు చూస్తుంటాం. ఇప్పుడు అలాంటి ఘటన చోటుచేసుకుంది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ ఘటన వరంగల్‌లో బుధవారం తెల్లవారు జామున 4.25గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఆ వీడియో చూస్తే ఎవరైనా భయంతో వణికిపోవాల్సిందే. సుమలత అనే మహిళ వరంగల్ జిల్లా పరకాలలో నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్నారు. ఆమె తెల్లవారు జామున రోడ్డు ఊడుస్తుండగా ఆమె వెనుకాలే వచ్చిన ఓ లారీ ఒళ్లు గొగుర్పొడిచేలా ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె గాల్లో ఎగిరి పడ్డారు. పక్కనే ఉన్న మరోకార్మికురాలు వెంటనే వెళ్లి ఆమెను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం ఆ కార్మికురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. తొలుత ఆమెకు దూరంగా వెళ్లిన లారీ అనూహ్యంగా ఆమె వైపు ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని వీడియో చూసిన వాళ్లంతా అంటున్నారు. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన వీడియో వీక్షించండి -
షాకింగ్: ఆ వీడియోలు మాయం!
న్యూఢిల్లీ: హరియాణ బీజేపీ చీఫ్ కొడుకు యువతిని వేధించిన కేసులో షాకింగ్ పరిణామం.. ఈ కేసుకు సంబంధించి ఐదు ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరా దృశ్యాలు మాయమవ్వడం కలకలం రేపుతోంది. హర్యానా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ బరాలా కొడుకు వికాస్ బరాలా గత శుక్రవారం ఓ యువతిని కారులో వెంబడించి వేధించిన సంగతి తెలిసిందే. అతను కారులో యువతిని వెంబండించిన ఐదు ప్రదేశాల్లోని సీసీటీవీ కెమెరా దృశ్యాలు మాయయ్యాయి. ఈ కేసు విచారణలో ఈ దృశ్యాలు అత్యంత కీలకమని భావిస్తున్న తరుణంలో ఇవి కనిపించడం లేదని పోలీసులు పేర్కొనడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు ఈ కేసులో బాధితురాలైన ఐఏఎస్ అధికారి కూతురినే బీజేపీ రాష్ట్ర శాఖ నిందించడం గమనార్హం. అర్ధరాత్రి బాధితురాలు ఒంటరిగా ఎందుకు వెళ్లిందంటూ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాంవీర్ భట్టీ పేర్కొన్నారు. 'అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె బయటకు వెళ్లాల్సింది కాదు. ఆమె ఒక్కరే కారు నడుపుకుంటా అంత రాత్రి ఎందుకు వెళ్లింది?' అని భట్టీ ప్రశ్నించారు. చండీగఢ్‌లో గత శుక్రవారం రాత్రి బాధితురాలు కారులో తన ఇంటికి వెళ్తుండగా.. మద్యం మత్తులో ఉన్న వికాస్, అతని స్నేహితుడు ఆశిష్ తమ ఎస్యూవీ వాహనంలో ఆమెను వెంబడించారు. కారు ఆపాలని యువతిని పదే పదే హెచ్చరించారు. దీంతో ఆమె పోలీస్ హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేసి విషయాన్ని తెలిపింది. పోలీసులు అక్కడికి చేరుకునేలోగా ఆమెను నిలువరించి మరీ ఆ ఇద్దరూ వేధించారు. అప్పటికే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే వికాస్‌ను, ఆశిష్‌ను అరెస్ట్ చేశారు. తను ఐఏఎస్ అధికారి కూతురిని అయినందుకు దుండగుల నుంచి తప్పించుకున్నానని, తానొక సామాన్యుడి కూతురిని అయి ఉంటే తనపై అత్యాచారం జరిగి, హత్య జరిగి ఉండేదేమోనని బాధితురాలు ఫేస్బుక్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాజకీయ ప్రాబల్యమున్న నిందితులకు బెయిల్ ఇచ్చి.. ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. -
ఆగని కామాంధుల ఉన్మాదం
ఉత్తరప్రదేశ్, ఢిల్లీ,మహారాష్ట్రల్లో దారుణాలు న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రెండ్రోజుల్లో ఢిల్లీ,యూపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో కిరారీ ప్రాంతంలో గుడిసె బయట పడుకున్న ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేశాడో బాలుడు (మైనర్‌గా భావిస్తున్నారు). బాలికను బలవంతంగా స్థానికంగా ఉన్న నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. అటు యూపీలోనూ ఎనిమిదేళ్ల బాలికపై ఖురేషి అనే 40 ఏళ్ల నకిలీ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే దుకాణానికి వెళ్లిన యువతిని ఖురేషి మాయమాటలు చెప్పి క్లినిక్‌కు తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. అటు మీరట్‌లోనూ మందులకోసం వచ్చిన బాలికను మెడికల్ దుకాణం యజమాని నిర్బంధించి రెండ్రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణేలో12 ఏళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి ఖాన్ (42) అత్యాచారం చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో 17 ఏళ్ల యువతిపై ఐదుగురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వలస వెళ్లగా.. అక్క దగ్గర ఉంటున్న బాలికపై లైంగికంగా దాడి చేశారు.