ఆగని కామాంధుల ఉన్మాదం | Not stoped rape attempts | Sakshi
Sakshi News home page

ఆగని కామాంధుల ఉన్మాదం

Jun 1 2016 1:48 AM | Updated on Jul 28 2018 8:35 PM

ఆగని కామాంధుల ఉన్మాదం - Sakshi

ఆగని కామాంధుల ఉన్మాదం

దేశవ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రెండ్రోజుల్లో ఢిల్లీ,యూపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఉత్తరప్రదేశ్, ఢిల్లీ,మహారాష్ట్రల్లో దారుణాలు
 
 న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్నారులపై అత్యాచారాలు పెరిగిపోయాయి. రెండ్రోజుల్లో ఢిల్లీ,యూపీ, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్‌లలో బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీలో కిరారీ ప్రాంతంలో గుడిసె బయట పడుకున్న ఎనిమిదేళ్ల బాలికను కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం చేశాడో బాలుడు (మైనర్‌గా భావిస్తున్నారు). బాలికను బలవంతంగా స్థానికంగా ఉన్న నిర్మానుష్యప్రాంతానికి లాక్కెళ్లి అత్యాచారం చేశాడు. సీసీటీవీ వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు.

అటు యూపీలోనూ ఎనిమిదేళ్ల బాలికపై ఖురేషి అనే 40 ఏళ్ల నకిలీ వైద్యుడు దారుణానికి పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే దుకాణానికి వెళ్లిన యువతిని ఖురేషి మాయమాటలు చెప్పి క్లినిక్‌కు తీసుకొచ్చి అత్యాచారం చేశాడు. అటు మీరట్‌లోనూ మందులకోసం వచ్చిన బాలికను మెడికల్ దుకాణం యజమాని నిర్బంధించి రెండ్రోజులపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని థాణేలో12 ఏళ్ల బాలికపై పక్కింటి వ్యక్తి ఖాన్ (42) అత్యాచారం చేశాడు. ఛత్తీస్‌గఢ్‌లో 17 ఏళ్ల యువతిపై ఐదుగురు కామాంధులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు పొట్టకూటి కోసం పక్క రాష్ట్రానికి వలస వెళ్లగా.. అక్క దగ్గర ఉంటున్న బాలికపై లైంగికంగా దాడి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement