నిమ్స్ లో విధి నిర్వహణలో ఉన్న సురేశ్ అనే సెక్యూరిటీ సూపర్ వైజర్ పై మెడికల్ రిప్రజెంటేటివ్ దాడి చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఈ దాడి జరగ్గా దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వాహనాలకు అనుమతి లేని స్థలంలో నిలిపినందుకు సెక్యూరిటీ సూపర్ వైజర్ సురేశ్ అభ్యంతరం తెలిపాడు. ఓ కంపెనీకి చెందిన పది మంది మెడికల్ రిప్రజెంటేటివ్స్ నిమ్స్ లోని క్యాంటీన్ సమీపంలో వాహనం నిలిపి అక్కడే గుంపుగా నిల్చొని మాట్లాడుకుంటున్నారు. అధికారుల ఆదేశం మేరకు సెక్యూరిటీ సూపర్ వైజర్.. వారిని అక్కడి నుంచి వెళ్లాల్సిందిగా సూచించాడు. పార్కింగ్ చేసిన వాహనాన్ని తీసుకెళ్లాల్సిందిగా కోరాడు.
Dec 16 2017 5:56 PM | Updated on Mar 20 2024 3:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement