breaking news
CBRT
-
సీబీఆర్‌టీతో అక్రమాలకు అడ్డుకట్ట
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి ♦ పోటీపరీక్షల్లో ఆన్లైన్ విధానంతో పారదర్శకత ♦ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను పరిశీలించిన కేంద్రమంత్రి ♦ తమ రాష్ట్రంలోనూ ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తామన్న కర్ణాటక సాక్షి, హైదరాబాద్: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రూ. 5-10 లక్షల చొప్పున వసూళ్లకు పాల్పడి, పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిన ఘటనలు దేశంలో అనేకం జరిగాయని, అలాంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్టు (సీబీఆర్టీ) ఉపయోగపడుతుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. సీబీఆర్టీ ద్వారా పరీక్షలను పక్కాగా నిర్వహించడంతోపాటు పారదర్శకత పెరుగుతుందన్నారు. ఇందులో ప్రతిభావంతులకే ఉద్యోగాలు దక్కుతాయని పేర్కొన్నారు. అసిస్టెంట్ మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఆదివారం సీబీఆర్టీ విధానంలో ఆన్లైన్ పరీక్షను నిర్వహించింది. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను దత్తాత్రేయతోపాటు కర్ణాటక సర్వీసు కమిషన్ సభ్యులు సందర్శించారు. పరీక్షల నిర్వహణ తీరును తెలుసుకున్నారు. అనంతరం దత్తాత్రేయ మాట్లాడుతూ, కొత్త రాష్ట్రంలో తక్కువ సమయంలో పకడ్బందీగా క్లౌడ్ టెక్నాలజీ ద్వారా ఆన్లైన్ పరీక్ష నిర్వహించడం అభినందనీయమని కితాబునిచ్చారు. ఒక్కో పరీక్షకు 1,000 ప్రశ్నలు రూపొందించి, అందులో 150 ప్రశ్నలను ఎంపిక చేసి, అదీ ఒక అభ్యర్థికి వచ్చిన సీక్వెన్స్ మరో అభ్యర్థికి రాకుండా కట్టుదిట్ట చర్యలు చేపట్టారన్నారు. టీఎస్పీఎస్సీ 31 వేల మందికి మొదటిసారిగా ఆన్లైన్ పరీక్ష నిర్వహించి ఇతర రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలిచిందని కొనియాడారు. తాము కూడా ఉద్యోగ రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ)లో ఆన్లైన్లో 8 వేల పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు. ఎంతో భద్రత, పారదర్శకత కలిగిన ఆన్లైన్ విధానాన్ని భవిష్యత్తులో అన్ని ఉద్యోగ పరీక్షల్లో అమలు చేయాలని సూచించారు. తమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కెరీర్ సర్వీసు (ఎన్సీఎస్) సెంటర్లను ప్రారంభించామని, వాటి ద్వారా దేశంలోని 983 ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లను అనుసంధానం చేశామన్నారు. ఇందులో 3.5 కోట్ల మంది రిజిస్టర్ చేసుకున్నారని, వారు ఫోన్లోనే తగిన ఉద్యోగ సమాచారం పొందుతారన్నారు. రూ.380 కోట్లతో 100 మోడల్ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్ కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. టీఎస్పీఎస్సీ ఓటీఆర్‌తో తమ ఎంప్లాయిమెంట్ ఎక్స్ఛేంజ్లను ఎలా అనుసంధానం చేయాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, దేశంలో ఒకే విధమైన పరీక్ష విధానం కోసం యూపీఎస్సీ చూస్తోందన్నారు. తాము చేస్తున్న ఆన్లైన్ పరీక్షల విధానం అంతటా అమలు చేయవచ్చని చెప్పారు. ఓటీఆర్‌లో 6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. ఇతర రాష్ట్రాలు కూడా దీన్ని అమలుచేసేందుకు చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, రామ్మోహన్‌రెడ్డి, సాయన్న, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. కర్ణాటక కమిషన్ ఇన్చార్జి చైర్మన్ ఎం.మహదేవ, సభ్యులు ఆన్లైన్ పరీక్ష విధానాన్ని పరీశీలించారు. ఈ ఆన్లైన్ విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే గుజరాత్ ముందుకురాగా, కర్ణాటకలోనూ అమలు చేస్తామని కమిషన్ సభ్యులు వెల్లడించారు. -
లీకేజీలకు ఆస్కారం లేని సీబీఆర్టీ
ఈ విధానంలో ఒకరోజు ముందు కూడా కొన్ని ప్రశ్నలను చేర్చాం. అలాగే కొన్నింటిని తొలగించాం. ప్రశ్నలను రూపొందించడానికి ఉపయోగించిన సర్వర్లకు ఇంటర్నెట్తో ఉన్న కనెక్షన్ పూర్తిగా తొలగించారు. (ఈ నెల 20వ తేదీ, ఆదివారం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సీబీఆర్టీ పరీక్షను నిర్వహించింది) సంప్రదాయకంగా కాగితం, కలం విధానంతో కాకుండా, కంప్యూటర్ సాయంతో పరీక్ష నిర్వహించి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) భారీ సంస్కరణకు శ్రీకారం చుట్టింది. హైదరా బాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ జోన్లలో దాదాపు 34,000 మంది అభ్యర్థుల కోసం ఈ కంప్యూటర్ ఆధారిత నియామక పరీక్షను (సీబీఆర్టీ) కమిషన్ నిర్వ హించింది. కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఒక రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇలా ఉద్యోగ నియామక పరీక్షను నిర్వహించడం దేశంలో ఇదే తొలిసారి. బహుళ జోన్లలోని 99 పరీక్షా కేంద్రాలలో, ఒకేరోజు రెండు ప్రశ్న పత్రాలతో నిర్వహించడం కూడా మొదటిసారే. కంప్యూటర్ సాయంతో పరీక్ష నిర్వహించడానికైనా మామూలుగా అయితే ఏర్పాట్ల కోసం కనీసం నాలుగు మాసాల కాలం అవసరమవుతుంది. అయితే పరీక్ష నిర్వహణ ఏర్పాట్లనూ, పనులనూ టీఎస్పీఎస్సీ నాలు గు వారాల లోపుననే పూర్తి చేసింది. ప్రశ్నల ఎంపిక, ప్రశ్నల నిధుల తయారీ, పరీక్షా కేంద్రాల ఎంపిక, రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయదలచిన 40,000 కంప్యూ టర్ల సంసిద్ధతను పరీక్షించడం, యూపీఎస్, డీజీ సెట్ల సౌకర్యాలు, 50 మంది స్క్వాడ్ సభ్యుల, 250 మంది కమిషన్ పర్వవేక్షకుల, 250 మంది టెక్నికల్ మేనేజర్లు, ఇన్విజిలేటర్లను నియామకం, ఈ సిబ్బందికి తర్ఫీదు, నమూనా పరీక్షల నిర్వహణ, ఫలితాల విడుదల ఏర్పా ట్లు - అన్నీ కూడా ఆ నాలుగువారాలలోనే పూర్తి చేశారు. ఇదంతా కేవలం 40 మంది సిబ్బంది ఉన్న సంస్థ సాధిం చింది. శక్తిసామర్థ్యాలు తన సొంతం అనిపించే కమిషన్ చైర్మన్ డాక్టర్ ఘంటా చక్రపాణి, సభ్యుడు సి. విఠల్, కార్యదర్శి పార్వతి చూపిన అకుంఠిత దీక్ష ఇందుకు కార ణం. వారంతా రోజుకు 16 గంటలు పనిచేశారు. సీబీఆర్టీ పరీక్ష వల్ల ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయి. మేం మొత్తం 1500 ప్రశ్నలతో ఒక నిధిని సిద్ధం చేశాం. కంప్యూటర్ను ఉపయోగించడం ద్వారా ర్యాండమ్ విధా నంతో వాటి నుంచి తీసుకున్న ప్రశ్నలతో బహుళ ప్రశ్న పత్రాలను (150 ప్రశ్నలతో) రూపొందించాం. ఇవి కూడా ఎన్క్రిప్షన్ (సంకేత లిపిని విశ్లేషించి రాసే విధా నం)తో రూపొందించడం జరిగింది. దీనితో పరీక్షలో ఏ ప్రశ్నలు ఇస్తారో ఏ ఒక్కరికీ (కమిషన్ చైర్మన్, సభ్యులు సహా) తెలిసే అవకాశం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో పరీక్ష నిర్వహించడానికి ముందు పది పదిహేను రోజుల ముందు పరీక్ష పత్రాల కట్టలను అచ్చుకు పంపడం లేదు. దీనితో పేపర్ లీకేజీకి ఏమాత్రం అవకాశం ఉండ దు. ఈ విధానంలో ఒక రోజు ముందు కూడా కొన్ని ప్రశ్నలను చేర్చాం. అలాగే కొన్నింటిని తొలగించాం. ప్రశ్నలను రూపొందించడానికి ఉపయోగించిన సర్వర్ లకు ఇంటర్నెట్తో ఉన్న కనెక్షన్ పూర్తిగా తొలగించారు. కాబట్టి హ్యాకింగ్ లేదా సైబర్ దాడికి కూడా అవకాశం లేదు. ప్రతి ప్రశ్నపత్రానికి కమిషన్ చైర్మన్ ముందు రాత్రే రహస్య పాస్వర్డ్ రక్షణ కల్పిస్తారు. అయితే ఒకసారి ఈ రక్షణ కల్పించిన తరువాత పరీక్ష సమయం ముగిసే దాకా మళ్లీ దానిని తొలగించడం చైర్మన్‌కు కూడా సా ధ్యం కాదు. ఎవరైనా ఆ పాస్‌వర్డ్‌ను తస్కరించినా కూ డా ఆ రక్షణ నుంచి తప్పించలేరు. పరీక్షా కేంద్రాల దగ్గర ఏర్పాటు చేసిన ప్రతి కంప్యూటర్ టెర్మినల్‌ను టీఎస్పీ ఎస్సీ కేంద్రంతో అనుసంధానించారు. అసలు పరీక్షను నిర్వహించడానికి ముందురోజు నుంచి వాటి కార్యకలా పాలను పర్యవేక్షించడం ప్రారంభించారు. 99 కేంద్రాల లోని 31,000 కంప్యూటర్ల పని తీరును డమ్మీ ప్రశ్న పత్రంతో పరీక్షించారు. ఇది సంక్రమంగా జరుగుతున్న దని 250 మంది కమిషన్ అబ్జర్వర్ల ద్వారా, 250 మంది టెక్నికల్ మేనేజర్ల ద్వారా, 1,600 మంది ఇన్విజిలేటర్ల ద్వారా నిర్ధారించుకున్నారు. నమూనా పరీక్ష, పోస్ట్ ఎగ్జా మ్ ప్రక్రియలలోని ప్రతి అడుగును తనిఖీ చేయడానికీ, ప్రతి పరీక్షా కేంద్రాన్నీ, కంప్యూటర్‌నూ, పరీక్ష జరుగు తున్నంత సేపు అభ్యర్థి కదలికలనూ కనిపెట్టి ఉండ డానికీ టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థి నిబంధనలు ఎప్పుడు చదువుకున్నాడు, ఎప్పుడు లాగ్ ఇన్ అయ్యా డు, ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి ఎంత సమ యం తీసుకున్నాడు వంటి అంశాలను కూడా అది గమ నిస్తుంది. పరీక్షా సమయానికి సరిగ్గా మూడు గంటల ముం దు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రశ్నపత్రం పాస్‌వర్డ్‌ను ఐటీ సమాచార పంపిణీ విధానం ద్వారా తెలంగాణ అం తటా ఏర్పాటు చేసిన 169 కంప్యూటర్ సర్వర్లకు విడు దల చేశారు. దీనితో పోలీస్, ట్రెజరీ వంటి విభాగాలకు పని తగ్గించారు. ఇదే విధానంతో ఒక గంట ముందు టీఎస్పీఎస్సీ చైర్మన్ డ్రైవ్ పాస్‌వర్డ్‌ను విడుదల చేశారు. కేంద్రాలలో ఏర్పాటు చేసిన 34,000 కంప్యూటర్లకు ప్రశ్న పత్రం చేరిన విషయం దీనితో రూఢీ అవుతుంది. అయితే దీనిని అభ్యర్థి మాత్రమే(తన పాస్‌వర్డ్‌తో) తెలు సుకోగలడు. ఈ కార్యక్రమం మొత్తాన్ని ఉదయం పది గంటల నుంచి టీఎస్పీఎస్సీ కేంద్రంలో పర్యవేక్షిం చారు. ఈ విధానం కూడా చాలా పని గంటలను, సిబ్బం ది శ్రమను ఆదా చేసింది. ఫొటోను గుర్తించే వెబ్‌క్యామ్ తో సహా, బయో మెట్రిక్‌ను (వేలి ముద్ర)ను ప్రతి అభ్య ర్థికి ఇచ్చారు. దీనిని సరి చూసే వ్యవస్థను టీఎస్పీఎస్సీ సర్వర్ ద్వారా నిర్వహించారు. పరీక్ష రాయడం పూర్తయి నాక జవాబు పత్రాలు వాటికవే టీఎస్పీఎస్సీ దగ్గర ఏర్పాటు చేసిన సర్వర్లకు చేరుకుంటాయి. ఒక అభ్యర్థికి బదులు వేరొక అభ్యర్థి పరీక్ష రాసే అక్రమాన్ని అరికట్ట డానికి గేట్, క్యాట్, ఐఐటీ-జీఈఈలు కూడా ఇలాంటి విధానాన్ని ఇంతవరకు ప్రవేశపెట్టలేదు. వ్యాసకర్త ఈసీ మేరీ క్యూరీ ఫెలో-ఇండియన్ ఐఐటీ హైదరాబాద్, nishanth@iith.ac.in - ప్రొ. దొంగరి నిశాంత్