breaking news
the CBI special court
-
చిక్కుల్లో కేంద్ర మాజీ మంత్రి
న్యూఢిల్లీ: ఓ ప్రైవేటు సంస్థకు బొగ్గు బ్లాకు కేటాయింపులో ఆ శాఖ మాజీ సహాయమంత్రి సంతోశ్ బగ్రోడియా, మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, మరో అధికారి ఎల్ఎస్ జనోతి నిబంధనలు ఉల్లంఘించారని ప్రాథమిక ఆధారాలను బట్టి నిర్ధారణైందని ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అవినీతి నిరోధక చట్టం ప్రకారం వారు నేరానికి పాల్పడ్డారని పేర్కొంది. మహారాష్ర్టలోని బందేర్ కోల్ బ్లాకును ఏఎంఆర్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీకి కట్టబెట్టడంలో కుట్రకు పాల్పడ్డారని తేల్చింది. ఆ కంపెనీకి ఇప్పటికే పలు బొగ్గు బ్లాకులను అప్పగించిన విషయం బగ్రోడియాకు తెలిసినా ఆ సంగతి వెల్లడించకుండా బందేర్ బ్లాకు ఫైలుపై సంతంకం చేసి ప్రధాని కార్యాలయానికి కావాలనే పంపించారని తప్పుబట్టింది. -
జగన్ కేసు విచారణ 19కి వాయిదా
సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించిన కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి గురువారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఆడిటర్ విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్తలు పెన్నా ప్రతాపరెడ్డి, ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి, ఐఏఎస్ అధికారులు శామ్యూల్, మన్మోహన్సింగ్, ఆదిత్యనాథ్ దాస్, శాంబాబు తదితరులు కూడా హాజరయ్యారు. మాజీ మంత్రులు గీతారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పారిశ్రామికవేత్తలు నిత్యానందరెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, అయోధ్యరామిరెడ్డి తదితరులకు హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది. తదుపరి విచారణను డిసెంబర్ 19కి వాయిదా వేసింది. ఇక ఓఎంసీ కేసులో నిందితులుగా ఉన్న గాలి జనార ్దన్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, అలీఖాన్ రిమాండ్‌ను వచ్చే నెల 19 వరకు కోర్టు పొడిగించింది.