భయానక యాక్సిడెంట్ వీడియో..
న్యూయార్క్ : అది అమెరికా. మిచిగాన్లోని ఓ ప్రధాన రహదారి. వాయు వేగంతో వాహనాలు దూసుకుపోతున్నాయి. వాతావరణంలో తీవ్ర మార్పుల కారణంగా ప్రస్తుతం అక్కడ మంచు కూడా విపరీతంగా పడుతోంది. రోడ్లపైన అక్కడక్కడా పేరుకుపోయింది. ఇది గమనించకుండానే వేగంగా వెళుతున్న వాహనాలు అక్కడక్కడా ప్రమాదానికి గురవుతున్నాయి. ఆ క్రమంలోనే మిచిగాన్లోని రహదారిలో పేరుకు పోయిన మంచుకారణంగా ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురికాగా దానిని తొలగించే వాహనంతో ఓ డ్రైవర్ అక్కడికి చేరుకున్నాడు.
ప్రమాదానికి గురైన కారు దగ్గరకు వెళ్లి దానిని పరిశీలిస్తుండగానే బుల్లెట్కంటే వేగంగా తనవైపు మరో కారు దూసుకొచ్చింది. కళ్లుమూసి తెరిచేలోపే వేగంగా వచ్చి అప్పటికే ప్రమాదానికి గురైన కారును, అక్కడే ఉన్న తన ట్రక్కును బలంగా ఢీకొట్టడమే కాకుండా ఆ ట్రక్కుపైకి ఎక్కింది. రెప్పపాటులో అక్కడ పరిశీలనలో ఉన్న రిలీఫ్ ట్రక్కు డ్రైవర్ చావునుంచి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి మరీ!