breaking news
Captain Darren syami
-
విండీస్ కెప్టెన్ స్యామీకి అరుదైన గౌరవం
వెస్టిండీస్ జట్టుకు రెండుసార్లు టి20 ప్రపంచకప్ అందించినందుకు ఆ జట్టు కెప్టెన్ డారెన్ స్యామీకి అరుదైన గౌరవం లభించింది. అతడి సొంత దేశం సెయింట్ లూసియాలోని ప్రధాన క్రికెట్ స్టేడియానికి ఈ స్టార్ క్రికెటర్ పేరు పెట్టారు. ‘బ్యూసెజర్ క్రికెట్ మైదానాన్ని ఇకపై డారెన్ స్యామీ జాతీయ క్రికెట్ మైదానంగా పేరు మారుస్తున్నాం’ అని ఆ దేశ ప్రధాని కెన్ని. డి. ఆంథోని ప్రకటించారు. -
‘ప్రాక్టీస్’లో ఓడిన ఆస్ట్రేలియా
3 వికెట్లతో నెగ్గిన వెస్టిండీస్ హాజెల్‌వుడ్ హ్యాట్రిక్ వృథా కోల్‌కతా: కెప్టెన్ డారెన్ స్యామీ (28 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) బ్యాటింగ్‌లో దుమ్మురేపడంతో... ఆదివారం జరిగిన టి20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వెస్టిండీస్ 3 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసింది. వాట్సన్ (39 బంతుల్లో 60; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మిత్ (29 బంతుల్లో 36; 1 ఫోర్), ఫించ్ (24 బంతుల్లో 33; 6 ఫోర్లు) రాణించారు. డ్వేన్ బ్రేవో 4, బెన్ 3 వికెట్లు తీశారు. తర్వాత వెస్టిండీస్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 162 పరుగులు చేసింది. నాలుగో ఓవర్లోనే హాజెల్‌వుడ్... హోల్డర్ (6), శామ్యూల్స్ (0), బ్రేవో (0)లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించినా... చివర్లో స్యామీ ధాటికి కంగారూలు చేతులెత్తేశారు.