breaking news
canvey
-
ఎంపీ గల్లా జయదేవ్ కు తప్పిన ప్రమాదం
హైదరాబాద్: టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శుక్రవారం గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పై అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించబోయి వాహనం పక్కనే ఉన్న ఓ మట్టి గుట్టను ఢీకొట్టింది. దీంతో ఆయనకు స్పల్ప గాయాలైనట్టు సమాచారం. గల్లా జయదేవ్ కు వెంటనే ప్రధమ చికిత్స అందించారు. గుంటూరు లో ఓ హోటల్ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఎంపీ గల్లా జయదేవ్ కాన్వాయ్‌లో ప్రమాదం
గుంటూరు : టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. శనివారం గుంటూరు జిల్లా పేరిచర్ల వద్ద ఆయన కాన్వాయ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికి ఒకటి ఢీకొనడంతో అయిదు వాహనాలు స్వల్వంగా ధ్వంసం అయ్యాయి. మేడికొండూరులో ఓ శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.