breaking news
Cairns city
-
హోటల్‌పై కుప్పకూలిన హెలికాప్టర్
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలోని పర్యాటక పట్టణం కెయిన్స్లోని ఓ హోటల్‌పై హెలికాప్టర్ కుప్పకూలింది. సోమవారం(ఆగస్టు12) తెల్లవారుజామున ఈ ఘటనలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందాడు. హెలికాప్టర్ కూలడంతో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్లోని వందల మందిని అక్కడినుంచి తరలించినట్లు క్వీన్స్లాండ్ పోలీసులు తెలిపారు. హెలికాప్టర్ కూలడం కారణంగా హోటల్లో ఉన్న వారెవరూ గాయపడలేదని చెప్పారు. హోటల్‌పై రెండు హెలికాప్టర్లు ల్యాండవుతుండగా వాటిలో ఒకటి క్రాష్ ల్యాండ్ అయినట్లు తెలిపారు. హెలికాప్టర్ ఎలా కూలిందనే విషయమై ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ రెగ్యులేటర్ విచారణ ప్రారంభించింది. -
'తల్లి రాక్షసి'పై పోలీసుల కేసు నమోదు
కాన్బెర్రా: కన్న బిడ్డలను అత్యంత కిరాతకంగా హత్య చేసిన మహిళ మెర్సెన్ వారియా (37) పై కేసు నమోదు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి జిమ్ మాంటెగ్యు ఆదివారం వెల్లడించారు. ఈ హత్యలన్నీ ఆమె చేసిందని తాము ధృవీకరించినట్లు చెప్పారు. ఈ కేసును సోమవారం కెయిర్న్స్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం నిందితురాలు మెర్సెన్... ఆసుపత్రిలో కోలుకుంటుందని పేర్కొన్నారు. అంతకు మించి సమాచారం మాత్రం తాను ఇవ్వలేనని మాంటెగ్యు స్పష్టం చేశారు. కెయిర్న్స్ పట్టణానికి చెందిన మెర్సెన్ వారియా తన ఏడుగురు చిన్నారులతోపాటు మేనకోడలైన మరో చిన్నారినీ శుక్రవారం హత్య చేసింది. అంతేకాకుండా ఆమెకు ఛాతీ, మెడపైనా గాయాలు ఉన్నాయి. వారియాకు ఐదుగురు భర్తలు ఉన్నారు. వారి ద్వారా ఈ మృతి చెందిన ఏడుగురు పిల్లలు జన్మించారు. పిల్లల మృతి వారి తండ్రులకు సమాచారం అందిస్తున్నామని చెప్పారు. చనిపోయిన వారంతా ఏడాదిన్నర నుంచి 14 ఏళ్లలోపు వారేనన్న విషయం తెలిసిందే. ఈ హత్యాకాండను మెర్సెన్ శుక్రవారం చేసిందని పోలీసులు భావిస్తున్నారు. మెర్సెన్ ను శనివారమే పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.