breaking news
Buttons
-
బటన్స్‌తో భలేగా...
ఇంటికి - ఒంటికి మనకు ఎన్ని రకాల జ్యుయెలరీ ఉన్నా.. వేరే కొత్తరకం జ్యుయెలరీ ఏదైనా కనిపిస్తే వద్దంటామా? చాన్సే లేదు.. అంతే కాదు, మారుతున్న ఫ్యాషన్ డ్రెస్సుల మీదకు రకరకాల జ్యుయెలరీ వేసుకుంటేనే కదా మనకు తృప్తి. అలాంటి వారి కోసమే ఈ బటన్ జ్యుయెలరీ మేకింగ్. అవును! మన డ్రెస్సులకు ఉండే బటన్సే. పాడైపోయిన డ్రెస్సుల బటన్స్‌తో లేదా షాపుల్లో విడిగా దొరికే బటన్స్‌తో ఎంతో అందంగా.. ఎంతో సులువుగా జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం... కావలసినవి: రంగురంగుల బటన్స్ (చిన్నవి, పెద్దవి), రంగురంగుల ఎలాస్టిక్ దారాలు (బ్రేస్లెట్ తయారీకి), సన్నని జంప్‌రింగ్స్, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్లెట్ హుక్స్ తయారీ: ముందుగా బ్రేస్లెట్ కోసం... ఎలాస్టిక్ దారానికి రంగురంగుల బటన్స్‌ను ఎక్కించాలి (వాటికి ఉండే రంధ్రాల ద్వారా). ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించి, చివర్లకు బ్రేస్లెట్ హుక్ తగిలించాలి. అలాగే దారానికి బదులుగా సన్నని జంప్రింగ్స్ను కూడా వాడొచ్చు. అలాగే పెద్ద లేదా చిన్న సైజు బటన్స్‌కు జంప్‌రింగ్స్, హుక్స్ తగిలించి ఎంతో అందమైన ఇయర్ రింగ్స్‌ను తయారు చేసుకోవచ్చు. అంతేకాదు, బ్రేస్లెట్ తయారీలాగే నెక్లేస్, కాళ్ల పట్టీలనూ తయారు చేసుకోవచ్చు. ఉంగరాలకు రంగు రాళ్లు పెట్టుకున్నట్ల్లు.. ఈ బటన్స్‌ను జోడిస్తే అవీ రెడీ అయినట్టే. అలాగే చీర పిన్నులకు చిన్న బటన్స్‌ను జంప్‌రింగ్స్ సాయంతో తగిలిస్తే, మ్యాచింగ్ పిన్ తయారవుతుంది. ఈ జ్యుయెలరీ మేకింగ్‌లో బటన్స్‌తో పాటు రంగురంగుల పూసలు జోడిస్తే.. అవి మరింత అందంగా మారతాయి. -
బటన్స్‌తో బెస్ట్ డిజైన్స్..
ఇంటికి - ఒంటికి ఒక్కోసారి డ్రెస్ పాడైపోతుంది. కానీ దాని బటన్స మాత్రం బాగానే ఉంటాయి. అలాంటప్పుడు వాటిని పడేయడానికి మనసొప్పదు. పడేయాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగో... ఇలా రకరకాల వస్తువులు తయారు చేయవచ్చు. 1. ఒక బెలూన్‌కి సగం వరకూ గ్లూ రాసి, రంగురంగుల బటన్సని అతికించండి. తర్వాత చిన్న సూదితో బెలూన్‌కి రంధ్రం చేసి, గాలిని తీసేయండి. ఆపైన బెలూన్ని తీసేస్తే బటన్స ఇలా బుట్టలా అవుతాయి. 2. పాతబడిన చెప్పులు, బూట్లను తీసుకుని, గ్లూ రాసి చక్కని బటన్సని అతికిస్తే... పాతవే కొత్త రూపాన్ని సంతరించుకుంటాయి. 3. ఓ దళసరి అట్టను తీసుకుని, అంచుల పక్కనంతా జిగురు రాసి, బటన్సని అతి కించండి. దాని చుట్టూ ఫ్రేమ్ బిగిస్తే మంచి ఫొటో ఫ్రేమ్ రెడీ. 4. రంగురంగుల బటన్సను దారాలకు ఎక్కించి, కళ కోల్పోయిన చెక్కగూళ్ల చుట్టూ వేళ్లాడదీస్తే సూపర్‌బగా ఉంటుంది. 5. సన్నని వైరు తీసుకుని, దానికి బటన్స ఎక్కించి ముడివేయండి. ఓ రిబ్బన్ కట్టి ఎక్కడైనా వేళ్లాడదీస్తే ఎంతో బాగుంటుంది. 6. పాడైపోయిన పర్సుకి కూడా రంగురంగుల బటన్సను అతికించి కొత్త రూపం తేవొచ్చు. 7. ఓ పేపర్ మీద ఇలా చెట్టు ఆకారంలోనో, మరో ఆకారంలోనే బటన్సని అతికించి, ఫ్రేమ్ కట్టించి వేళ్లాడదీస్తే మీ గోడలకు కొత్త అందం వస్తుంది.