బస్టాండ్ ఎదుటే మహిళ ప్రసవం
తూర్పుగోదావరి(సామర్లకోట): సామర్లకోట ఆర్టీసీ బస్టాండుకు ఎదురుగా ఉన్న రోడ్డుపై గుర్తుతెలియని మహిళ బుధవారం సాయంత్రం ప్రసవించింది. ఆ మహిళను108 వాహనంలో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మహిళ ఒరియా భాషలో మాట్లాడుతోంది. మహిళకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.