breaking news
Burqas
-
బుర్ఖాతో వచ్చినా.. ముఖం చూపించాలి
వారణాసి: మాస్క్, ముసుగు, బుర్ఖా, హెల్మెట్ వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు నగలను విక్రయించరాదని యూపీలోని వారణాసి జిల్లా నగల దుకాణదారుల సంఘం నిర్ణయించింది. ఇటీవల పలు జిల్లాల్లో బుర్ఖా, ముసుగులతో వచ్చిన చోరులు దుకాణాల్లో నగలను దోచుకోవడం, మోసాలకు పాల్పడటం వంటి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ మేరకు నిషేధం విధించినట్లు యూపీ జువెల్లర్స్ అసోసియేషన్(యూపీజేఏ) వారణాసి జిల్లా అధ్యక్షుడు కమల్ సింగ్ చెప్పారు. ‘ముఖాన్ని కప్పుకుని దుకాణానికి వచ్చే వినియోగదారులకు నగలను విక్రయించం. ముఖాన్ని కప్పుకుని వచ్చే వారు ఏదైనా నేరానికి పాల్పడితే, గుర్తించి పట్టుకోవడం కష్టమవుతోంది. అందుకే, మేం మాస్క్, బుర్ఖా, హెల్మెట్, ముసుగు ధరించి వచ్చే వారికి నగలను అమ్మబోమంటూ దుకాణాల వద్ద బోర్డులు ఏర్పాటు చేశాం. ఇదంతా మా భద్రత కోసం మాత్రమే. ఏ మతాన్ని ఉద్దేశించింది కాదు’అని అన్నారు.ఇకపై కొనుగోలుదారు ఎవరైనా దుకాణంలోకి ప్రవేశించేందుకు ముందుగా ముఖంపై ఉన్న ఆచ్ఛాదనాన్ని తప్పనిసరిగా తొలగించాకనే లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుందన్నారు. దీనివల్ల ఆ కొనుగోలుదారు గుర్తింపు సులభమవుతుందని చెప్పారు. ఇలాంటి నిషేధం యూపీలోని ఝాన్సీ తదితర జిల్లాల్లో ఇప్పటికే అమలవుతోందని యూపీజేఏ అధ్యక్షుడు సత్య నారాయణ్ సేథ్ చెప్పారు. -
ఆస్ట్రేలియా పార్లమెంట్ ను తాకిన 'బుర్ఖా' వివాదం!
కాన్ బెరా: బుర్ఖాల ధరింపుపై ఆస్ట్రేలియా పార్లమెంట్ లో రచ్చ కొనసాగుతోంది. బుర్ఖాలపై ధరింపుపై నిరసన వ్యక్తం చేస్తూ ముగ్గురు వ్యక్తులు అభ్యంతరకరమైన మాస్క్ లు ధరించి సభలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. కు క్లుక్స్ క్లాన్ మాస్క్, నీకాబ్, హెల్మెట్ ధరించి పాత పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించడానికి ప్రయత్నం చేశారని, భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ ఓ కథనంలో వెల్లడించింది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడాన్ని నిషేధించాలని సెర్జి రెడెగల్లీ, నిక్ ఫోల్క్స్, విక్టర్ వాటర్ సన్ లు నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో బుర్ఖా ధరించడాన్ని నిషేధించాలని ఓ గ్రూప్ డిమాండ్ చేస్తోంది. బుర్ఖాపై నిరసన కార్యక్రమాలు ఆస్ట్రేలియాలో వివాదం రేపుతున్నాయి.


