breaking news
bunny on twitter
-
అల్లు అర్జున్ ట్విట్టర్లోకి వచ్చేశాడు..
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ బహుమతి ఇచ్చాడు. బహుమతి అంటే ఏంటో అనుకునేరు. అభిమానులకు మరింత దగ్గర అయ్యేందుకు బన్నీ ట్విట్టర్లో అందుబాటులోకి వచ్చాడు. తన పుట్టిన రోజైన ఏప్రిల్ 8వ తేదీన ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ అయ్యాడు. అంతకుముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా.. అది అర్జున్ అసలైన అకౌంట్ కాదు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదల అవుతున్న సందర్భానికి దగ్గర్లోనే అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతాలో అభిమానులకు అందుబాటులో ఉండటం శుభవార్తే. Chal chalo chaloo...Life sey miloo...Idho kotha chapter...Just say HELLLOOOO ! — Allu Arjun (@alluarjun) April 8, 2015 -
ఇక ట్విట్టర్లోకి అల్లు అర్జున్!
బన్నీ అభిమానులకు శుభవార్త. ఎట్టకేలకు ట్విట్టర్లోకి రావాలని ఈ స్టైలిష్ స్టార్ నిర్ణయించుకున్నాడు. తన పుట్టినరోజైన ఏప్రిల్ 8వ తేదీ ఉదయం సరిగ్గా 8 గంటలకు తన ట్విట్టర్ అకౌంట్ యాక్టివేట్ కానుంది. ఈ విషయాన్ని బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకు తెలిపాడు. ఇంతకుముందు కూడా యువర్స్ ట్రూలీ బన్నీ అనే పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా ఉన్నా.. అది అర్జున్ అసలైన అకౌంట్ కాదు. ఇన్నాళ్లుగా తాను చాలాసార్లు అడిగినా.. అర్జున్ ఒప్పుకోలేదని, ఎట్టకేలకు ఇప్పుడు తనను కన్విన్స్ చేసి అకౌంట్ ఓపెన్ చేయిస్తున్నానని శిరీష్ తెలిపాడు. సనాఫ్ సత్యమూర్తి సినిమా విడుదల అవుతున్న సందర్భానికి దగ్గర్లోనే అర్జున్ ట్విట్టర్ ఖాతా కూడా వస్తుండటం అభిమానులకు శుభవార్తే అవుతుంది. Finally I convinced Bunny to join Twitter. So, #AlluArjunonTwitter : 8th April - 8am. Stay tuned! pic.twitter.com/SIgsqhXC7T — Allu Sirish (@AlluSirish) April 4, 2015