breaking news
bullock cart race
-
సరిలేరు మీకెవ్వరు..!
మంచిర్యాలఅర్బన్: ఎడ్లబండ్ల పోటీల్లో గెలవాలంటే బలమైన ఎద్దులు, నియంత్రించగలిగే నైపుణ్యం, వ్యూహం, వేగం, సమన్వయంతో సత్తాచాటాల్సి ఉంటుంది. వీటన్నింటిలో పాతమంచిర్యాలకు చెందిన తూముల వెంకట్రామయ్యది అందెవేసిన చేయి. ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించడమే కాకుండా పందేల్లో గెలుపు ఇచ్చే ఆనందం కోసం పోటీలు జరిగిన ప్రతీ చోటకు వెళ్లి వచ్చాడు. వెంకట్రామయ్య స్థానిక సిమెంటు కంపెనీలో పని చేస్తూ ఉద్యోగ విరమణ పొందాడు. ఓ వైపు పని చేస్తూ వ్యవసాయం చేసేవాడు. 2013లో ఓసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ముంజంపల్లిలో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు మొదటిసారి ఎడ్లబండ్ల పోటీలు చూశాడు. ఎడ్లకు ఎలాంటి శిక్షణ లేకుండా పోటీల్లో పాల్గొని ఓటమి చవిచూశాడు. ఆ తర్వాత ఎడ్లను ప్రత్యేకంగా పోషిస్తూ తర్ఫీదు ఇచ్చి పోటీల్లో సత్తా చాటాడు. జగిత్యాల జిల్లా లొత్తునూర్, రాపల్లి, సిల్వకోడూరు, గోవిందుపల్లి, చర్లపల్లి, నందిమేడారం ఇలా ఏ గ్రామంలో పోటీలు జరిగినా పాల్గొన్నాడు. 2015 నుంచి విజయపరంపరం కొనసాగింది. నాలుగేళ్లలో 36సార్లు గెలుపొందగా.. ద్వితీయ, తృతీయ స్థానాల్లో లెక్కలేనన్ని సార్లు విజయబావుటా ఎగురవేశాడు. పాత మంచిర్యాలలో ఎనిమిదేళ్లపాటు ఎండ్లబండ్ల పోటీలు నిర్వహించి తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నాడు.చిన్నప్పటి నుంచి ఎద్దులంటే ఇష్టం..ఎడ్ల శృతి కలవాలే. మన శృతి రెండూ ఉండాలే. మన చేతుల్లో మెదిలితేనే సులువుగా గెలువొచ్చు. ఎంతమంచి ఎడ్లనిచ్చినా ఇవన్నీ లేకుంటే గెలవడం కష్టం. ఓసారి చిన్నకోడూర్‌లో ఆ ఊరి పెద్ద మనిషి నీ ఎడ్లు ఇస్తే గెలుస్తా అన్నాడు. సరిగ్గా గీతకాడికి పోయినంక గెలువలేమని గ్రహించి వెనువెంటనే ఎడ్లబండి సవారీ నాకు ఇవ్వడంతో గెలిచా. వ్యవసాయం అంటే మక్కువ కావడంతో చిన్నప్పటి నుంచి ఎద్దులను ఇష్టంగా పెంచడం అలవాటైంది. అప్పట్లోనే నెలకు క్వింటాలు ఉల్వలు దాణాగా పెట్టేవాళ్లం. ఎద్దుల శిక్షణతోపాటు పది మందికి పోటీల్లో గెలుపొందడం ఎలా అనేదానిపై తర్ఫీదు ఇచ్చాను. వయస్సు పైబడడంతో పోటీలకు దూరంగా ఉంటున్న.– తూముల వెంకట్రామయ్య, జిల్లా ఎడ్లబండ్ల పోటీల అసోసియేషన్ అధ్యక్షుడు -
ఎడ్ల బండి నడిపిన మంత్రి రోజా
-
గెలుపే గమ్యం..!
తూర్పుగోదావరి, పిఠాపురం : వ్యవసాయంలో ప్రత్యేక పాత్ర పోషించిన ఎడ్లు నేడు పరుగు పందాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. పూర్వం నుంచి ఎడ్ల పందాలు కొనసాగుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పండుగలకు మాత్రమే పరిమిత మయ్యేవి. గతంలో ప్రత్యేక పండుగ రోజులు, ప్రత్యేక సందర్భాలలో మాత్రమే నిర్వహించే ఈ పందాలు నేడు మామూలు సమయాలలోనూ కొనసాగుతున్నాయి. కేవలం పందెంలో గెలుపే లక్ష్యంగా రూ. లక్షలు వెచ్చించి మరీ ఎడ్లను పెంచడంలో పలువురు రైతుల ఆసక్తి చూపుతున్నారు. పందెంలో గెలిస్తే వచ్చేది చిన్న మొత్తమే అయినా దాని ద్వారా వచ్చే సంతృప్తి వెలకట్టలేనిదని రైతులు చెబుతున్నారు. ఎడ్లు, అవి లాగే బండ్లు వ్యవసాయంలో కీలక పాత్ర పోషించినా యంత్రాలు అందుబాటులోకి రావడంతో ప్రతి రైతు ఇంటా ఉండే ఎడ్లు బళ్లు ఇప్పుడు అంతగా కనిపించడం లేదు. కానీ కొందరు రైతులు ఎడ్ల బళ్ల పోటీల కోసమే ప్రత్యేకంగా ఎడ్లను పెంచుతున్నారు. జిల్లాలో ప్రతి నెలా ఏదో ఒకచోట ఎడ్ల పరుగు పందాలు జరుగుతుండగా రాష్ట్రంలో అన్ని జిల్లాల నుంచి పందాల కోసం రైతులు తమ ఎడ్లను తీసుకుని వస్తున్నారు. జిల్లాలో లైను పందాలు ఆడుతుండగా, ఇతర జిల్లాల్లో రౌండు పందాలు ఆడుతుంటారు. ప్రత్యేక శిక్షణ పరుగు పందాల్లో పాల్గొనే ఎడ్లకు గిత్తల ప్రాయం నుంచి ప్రత్యేక శిక్షణ ఇస్తుంటారు. కేవలం ఒక సంవత్సరం వయసులో ఉండగానే చిన్న సైజు బండ్లకు కట్టి పరుగులో శిక్షణ ఇస్తుంటారు. సాధారణ ఎడ్లలా కాకుండా నిత్యం బండి కట్టి పరుగులు పెట్టిస్తూ సమయానుకూలంగా దూరాలను పరుగెత్తిస్తుంటారు. ఎడ్ల ఖరీదు రూ.లక్షల్లో సాధారణంగా మైసూరు, దేశవాళీ ఎడ్లను పరుగు పందాలకు వినియోగిస్తారు. పరుగు పందాలలో పాల్గొనే ఎడ్ల ఖరీదు రూ.లక్షల్లో పలుకుతోంది. ఒక్కో ఎద్దు రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నాయి. ఒకే రకంగా ఒకే జాతికి చెందిన రెండు ఎడ్లను కొనడానికి ఎంత ఖర్చైనా రైతులు వెనుకాడడం లేదు. ఇతర జిల్లాలకు వెళ్లి మరీ రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మేత కూడ ప్రత్యేకమైనదే పందాల్లో పాల్గొనే ఎడ్లకు ప్రత్యేకమైన మేత మేపుతుంటారు. కేవలం ప్రత్యేకమైన దాణా పెడుతుంటారు. ఉలవలు, రాగులు, జొన్నలు, ప్రతీరోజు ఉడకబెట్టి నానబెట్టిన ఎండుగడ్డి ముక్కలలో వేసి దాణాగా మేపుతారు. వీటి మేతకు సంవత్సరానికి సుమారు 3 లక్షల వరకు వ్యయమవుతుందని రైతులు చెబుతున్నారు. పందాలు ఉన్నా లేకపోయినా వీటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తప్పదని మేతలో ఎప్పుడూ మార్పు లేకుండా ఖర్చుకు వెనుకాడకుండా మేపాల్సి ఉంటుందంటున్నారు. ప్రత్యేక మసాజ్‌లు పరుగెత్తి అలసిపోయిన ఎడ్లకు మనుషుల మాదిరిగానే జండూబామ్ వంటి మందులతో మసాజ్ చేస్తుంటారు. ప్రతీ రోజు పరుగులో శిక్షణ అనంతరం మసాజ్ చేయకపోతే కాళ్లు పట్లు పటేసి పరుగుకు ఇబ్బందిగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. దీనికోసం పరుగు పెట్టిన ప్రతీసారీ మసాజ్‌లు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందంటున్నారు. పందెం కొడితే విలువ పెరుగుతుంది పందెంలో గెలిచిన ఎడ్లకు ఎనలేని గిరాకీ ఉంటుంది. ఎన్ని పందాలు కొడితే అంత విలువ పెరగడంతో పాటు పోటీపడి మరీ ఎక్కువ ధరలకు కొనుగోలు చేస్తుంటారు. ఎక్కువ పందాలు కొట్టిన ఎద్దులు ఒక్కోటి సుమారు రూ.3 లక్షల నుంచి 4 లక్షలకు అమ్ముడవుతాయని రైతులు చెబుతున్నారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన రైతులు పందాలు ఎక్కువగా గెలిచే ఎడ్లను కొనుగోలు చేస్తుంటారు. -
ఎడ్ల పందేల కోసం పట్టుబడదాం
తమిళనాడులో జల్లికట్టు కోసం జరిగిన పోరాటం మరిన్ని రాష్ట్రాలకు స్ఫూర్తినిచ్చింది. కర్ణాటకలో కంబళ పోటీని చట్టబద్ధం చేసేందుకు అక్కడ ప్రయత్నాలు ఇప్పటికే మొదలుకాగా, తాజాగా మహారాష్ట్రలో ఎడ్ల బండ్ల పందేలకు కూడా అనుమతి పొందేందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆయన ముంబైలో జరిగిన పార్టీ సమావేశంలో ప్రకటించారు. దాంతోపాటు, త్వరలోనే జరగనున్న బృహన్ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఇక ఎవరితోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తి లేదని, అసలైన పోరు ఇప్పుడే మొదలు కాబోతోందని కూడా ఠాక్రే చెప్పారు. మహారాష్ట్రలో ఇన్నాళ్లూ బీజేపీ - శివసేనల మధ్య పొత్తు ఉండగా.. ఇప్పుడు ఒంటరి పోరాటానికి శివసేన ముందుకెళ్లడం విశేషం.


