breaking news
bullet train model
-
India Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. కీలక సమాచారాన్ని వెల్లడించిన మంత్రి
భారత్‌లో బుల్లెట్ రైలు ప్రాజెక్టు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందనే విషయంపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. గుజరాత్లో జరుగుతున్న ‘వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2024’కు హాజరై మాట్లాడారు. అహ్మదాబాద్-ముంబయి బుల్లెట్ రైలు ప్రాజెక్టులో కొంతభాగం 2026 నాటికి పూర్తవుతుందన్నారు. గుజరాత్‌లోని సూరత్ నుంచి బిలిమోరా వరకు 35కి.మీ దూరం సిద్ధం అవుతుందని చెప్పారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు బాగానే జరుగుతున్నాయని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రాజెక్ట్ కచ్చితంగా ఏ సమయంలోపు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగమైన అహ్మదాబాద్‌లోని సబర్మతి మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ హబ్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆయన సూచించారు. ఈ ప్రాజెక్ట్‌కు మహారాష్ట్రలో భూసేకరణ కూడా దాదాపు పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్ట్ పరిధిలో ఉన్న ఎనిమిది నదులపై వంతెనల నిర్మాణం పూర్తయిందని చెప్పారు. ముంబై, థానే మధ్య సముద్రంలోని సొరంగం నిర్మాణం పనులు జరుగుతున్నట్లు వివరించారు. ఇదీ చదవండి: ఖజానాకు చేరిన పన్ను వసూళ్లు ఎంతంటే.. దేశంలోనే ఈ తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు. 251కి.మీ మేర పిల్లర్లు, 103 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం జరిగిందని రైల్వే మంత్రి గతంలోనే చెప్పారు. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే కేవలం 2.58 గంటల్లో అహ్మదాబాద్ నుంచి ముంబయి చేరుకోవచ్చు. ఈ రైలు మార్గం ముంబై, థానే, వాపి, వడోదర, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లను కలుపుతుంది. -
బుల్లెట్ రైలు నమూనా తయారు చేసిన శిల్ప
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పదో తరగతి విద్యార్థి బుల్లెట్ రైలు నమూనాను తయారు చేసింది. హమీర్పూర్ జిల్లా సుదియల్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగది చదువుతున్న శిల్ప ఈ ఘనత సాధించింది. ఈ నమూనా జాతీయ స్థాయి ఎగ్జిబిషన్లో ప్రదర్శకు ఎంపికకావడం విశేషం. అయస్కాంత సజాతి ధృవాల వికర్షణ సిద్ధాంతం ఆధారంగా శిల్ప ఈ నమూనాను రూపొందించింది. రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపికైన ఈ నమూనాను అక్టోబర్‌లో ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయిలో ప్రదర్శించనున్నారు. తనకు వచ్చిన వినూత్న ఆలోచనలతో ఈ నమూనాను రూపొందించానని, సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసేందుకు దృష్టిసారిస్తానని శిల్ప చెప్పింది.