బాధితులకు జయలలిత పరామర్శ
చెన్నై: చెన్నైలో 11 అంతస్తుల భవనం కుప్పకూలిపోయిన ప్రాంతాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత పరిశీలించారు. మాన్గాడులో శిథిలాల కింద చిక్కుకున్న వారి కో్సం చేపడుతున్న సహాయక చర్యలను తెలుసుకుని, బాధితులను పరామర్శించారు.
శిథిలాల నుంచి శ్రీకాకుళంకు చెందిన కృష్ణవేణి అనే మహిళను రెస్క్యూ టీమ్ సురక్షితంగా బయటకు తీశారు. కాగా చెన్నైలో భారీ వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మరణించగా, శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపడుతున్నారు. బాధితుల్లో ఎక్కువగా తెలుగువారు ఉన్నారు.