breaking news
budget high lights
-
సర్కార్ తీరుపై డీఎస్ విమర్శనాస్త్రాలు
హైదరాబాద్ : ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ డీ.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. శాసనమండలిలో బుధవారం డిప్యూటీ సీఎం రాజయ్య బడ్జెట్ ప్రసంగం చదువుతున్న సందర్భంగా డీఎస్ జోక్యం చేసుకున్నారు. ప్రభుత్వ తీరుపై ఆయన ఈ సందర్భంగా విమర్శనాస్త్రాలు సంధించారు. రైతులు, విద్యార్థులు సహా వివిధ వర్గాలు పలు సమస్యలతో సతమతం అవుతున్నా... వాటిపై ప్రభుత్వం కనీసం ఓ ప్రకటన కూడా చేయకపోవటం శోచనీయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తుందే కానీ...ప్రతిపక్షాలను సంప్రదించాలన్న కనీస గౌరవాన్ని కూడా పాటించటం లేదని డీఎస్ మండిపడ్డారు. -
ప్రసంగం పూర్తి కాకుండానే విపక్షాలు వాకౌట్
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైతు ఆత్మహత్యలు, ఎండిపోయిన పంటల ప్రస్తావన లేకపోవటాన్ని నిరసిస్తున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలిపారు. పార్టీ ఫిరాయింపులకు నిరసనగానే సభ నుంచి వాకౌట్ చేసినట్లు వారు తెలిపారు. కాగా అంతకు ముందు ఈటెల బడ్జెట్ ప్రసంగం పూర్తి కాకుండానే ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు. -
తెలంగాణ బడ్జెట్ హైలైట్స్
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రధాన అంశాలు : * తెలంగాణ జర్నలిస్టుల భవన్‌కు కి రూ.10 కోట్లు కేటాయింపు * ఆటోలపై రవాణా పన్ను రద్దు * బలహీన వర్గాలకు ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి మూడున్నర లక్షల కేటాయింపు * దీపం పథకానికి రూ.100 కోట్లు *దళితుల భూపంపిణీకి రూ.1000 కోట్లు * సాంస్కృతిక, క్రీడారంగానికి రూ.1000 కోట్లు *విద్యాశాఖలోని అన్ని విభాగాలకు రూ.10,956 కోట్లు కేటాయింపు *వ్యవసాయం, రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.4,250 కోట్లు కేటాయింపు *మిగతా నిధులను వచ్చే మూడేళ్లలో దశలవారీగా చెల్లింపు *ఇన్పుట్ సబ్సిడీ రూ.480 కోట్లు ఇప్పటికే చెల్లింపు * ఉద్యానవన శాఖకు రూ.250 కోట్లు కేటాయింపు * వ్యవసాయ రంగంలో యంత్రీకరణకు రూ.100 కోట్లు * వికలాంగుల పెన్షన్‌ను రూ.500 నుంచి 1500లకు పెంపు * వృద్ధులు, వితంతువుల పెన్షన్ రూ.200 నుంచి రూ.1000 పెంపు * మహిళా శిశు సంక్షేమానికి రూ.221 కోట్లు, ఐసిడీఎస్ పథకానికి రూ.1103 కోట్లు * బీసీల సంక్షేమానికి రూ.2022 కోట్లు, మైనార్టీల సంక్షేమానికి రూ.1030 కోట్లు * ఎస్సీల సబ్‌ప్లాన్‌కు రూ.7579 కోట్లు, ఎస్టీల సబ్‌ప్లాన్‌కు రూ.4559 కోట్లు * 2014-19 వరకు ఎస్సీల అభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వ లక్ష్యం * కళ్యాణ లక్ష్మీ (ఎస్సీ) పథకానికి రూ.150 కోట్లు, కళ్యాణ లక్ష్మీ (ఎస్టీ) పథకానికి రూ.80కోట్లు కేటాయింపు * మైనార్టీలకు (షాదీ ముబారక్) రూ.100 కోట్లు * రహదారుల అభివృద్ధికి రూ.10వేల కోట్లు, మండల కేంద్రాల నుంచి జిల్లాలకు డబుల్ రోడ్లకు రూ.400 కోట్లు * ఈ ఏడాది 9వేల చెరువులకు రూ.2వేల కోట్ల కేటాయింపు *తెలంగాణలో దెబ్బతిన్న 45వేల చెరువులను పునరుద్ధరిస్తాం * తెలంగాణ 10 జిల్లాల్లో తలసరి ఆదాయం ఒక్కోచోట ఒక్కోలా ఉంది * 50 ఏళ్లుగా తెలంగాణపై చేసిన పరోక్ష పెత్తనం... ఈప్రాంతాన్ని వెనుకబడేలా చేసింది * విద్యుత్ రంగానికి మొత్తం రూ.3241 కోట్లు * ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.కోటిన్నర, మొత్తం రూ.234 కోట్ల కేటాయింపు * వచ్చే అయిదేళ్లలో 20వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన లక్ష్యం * ఎన్టీపీసీ ద్వారా అదనంగా 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు * 6వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కోసం జెన్కోలో రూ.1000 కోట్ల పెట్టుబడి *రూ.లక్షా 637 కోట్ల 10 నెలలకు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈటెల రాజేందర్ *ప్రణాళిక వ్యయం రూ.48, 648 కోట్లు *ప్రణాళికేతర వ్యయం రూ.51,989 కోట్లు *రెవెన్యూ మిగులు అంచనా రూ.301 కోట్లు *ఆర్థిక లోటు అంచనా రూ.17,398 కోట్లు * రహదారుల అభివృద్ధికి 10వేల కోట్లు * రైతులకు సోలార్ పంపు సెట్ల కోసం రూ.200 కోట్లు *గృహ నిర్మాణం 1000 కోట్లు * వాటర్ గ్రిడ్లకు రూ.2వేల కోట్ల కేటాయింపు * నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం * 459మంది అమరవీరుల ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయం * పథకాల అమలులో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకే సమగ్ర సర్వే * నల్లగొండ జిల్లా ప్రజలకు ఫ్లోరైడ్ శాపంగా మారింది * బంగారు తెలంగాణ లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన * ఉద్యమ భవిష్యత్ అందించేలా బడ్జెట్ * ఈ బడ్జెట్ పది నెలలకు సంబంధించినది మాత్రమే * అన్నివర్గాల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం * అమరవీరులకు పరిహారం కోసం బడ్జెట్లో రూ.100 కోట్లు