డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ కన్నుమూత.. షాకింగ్ విషయాలు వెలుగులోకి!
డబ్ల్యూడబ్ల్యూఈ (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్)లో విషాదం నెలకొంది. రెజ్లర్ బ్రాన్సన్ రీడ్ 38 ఏళ్ల వయసులో కన్నుమూసినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ యాజమాన్యం శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా బ్రాన్సన్ రీడ్ అసలు పేరు జెర్మైన్ హేలీ. మెడికల్ సమస్యల కారణంగా బ్రాన్సన్ మరణించినట్లు డబ్ల్యూడబ్ల్యూఈ ధృవీకరించింది.అయితే బ్రాన్సన్ రీడ్ మరణంపై అతడి స్నేహితుడు ఒకరు అతడి చివరి రోజుల గురించి కొత్త విషయాలు వెల్లడించారు. సౌదీ అరేబియాలో శస్త్రచికిత్స తర్వాత అతనికి ఇన్ఫెక్షన్లు, రక్తపు గడ్డలు ఏర్పడ్డాయని ఆరోపించారు. వైద్యులు రీడ్‌ను యునైటెడ్ స్టేట్స్కు తిరిగి తీసుకురావడానికి ఏర్పాట్లు చేశారని పేర్కొన్నాడు. ఇవాళ ఎక్స్‌లో స్మార్టెస్ట్ మార్క్ అలైవ్ షేర్ చేసిన ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాలు బయటికొచ్చాయి.Photo Credit: Twitterఇక నవంబర్ 7న క్రౌన్ జ్యువెల్‌లో రీడ్‌కు తీవ్ర గాయాలైన తర్వాత అతడిని మొదట సౌదీ అరేబియాలోని ఒక ఆసుపత్రికి తీసుకెళ్లారని ఆ రెజ్లింగ్ కంటెంట్ క్రియేటర్ తెలిపారు. క్రౌన్ జ్యువెల్ ఈవెంట్ సందర్భంగా బ్రాన్సన్ రీడ్ ప్రత్యర్థి ఒబా ఫెమితో మ్యాచ్ ఆడాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒబా ఫెమి.. బ్రాన్సన్ను పైకెత్తి టేబుల్‌పై పడేయడంతో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రిలో చేర్చినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో రీడ్‌కు అనేక పక్కటెముకలు విరిగాయని, మూత్రపిండం చిట్లిందని సమాచారం. అతను చికిత్స కోసం సౌదీ అరేబియాలో ఉండి, నవంబర్ 18న అమెరికాకు తిరిగి వచ్చాడు. కాగా తొమ్మిది రోజుల తర్వాత, శుక్రవారం డబ్ల్యూడబ్ల్యూఈ అతడి మరణ వార్తను బయటపెట్టింది.ఇక ఆస్ట్రేలియాకు చెందిన బ్రాన్సన్ రీడ్ 2007లో రెజ్లింగ్ కెరీర్‌ను ప్రారంభించాడు. 2019లో డబ్ల్యూడబ్ల్యూఈలో ఎంట్రీ ఇచ్చి 2021లో ఎన్ఎక్స్టీ నార్త్ అమెరికా చాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు. రీడ్ భార్య ప్రస్తుతం గర్భవతి. ఈ సమయంలో రీడ్ మృతి చెందడం బాధాకరం.Spare a thought for Oba. This man is going through a hell of a lot right now, and these idiot, swine accounts on here blaming him are the bottom of society. Bronson was taken to hospital in Saudi and the decision was made to bring him back to the US after complications for the surgery in Saudi. During the process he got infections and blood clots, and when they rushed him to the hospital this morning it was too late. That’s what happened. Bronson was an Adelaide boy, my home. I know members of his family well, and this was told to me from them directly. You cannot blame Oba for medical complications, stop with the bullshit. Rest in Peace Jermaine. #WWE #RIPBronsonReed— Smartest Mark Alive (Youtube 🔗 In Bio) (@thesmartmark) November 28, 2026 All for this pointless and unnecessary spot, just to show how strong Oba Femi is 🤦🏼♂️ Wishing Bronson Reed a speedy recovery. https://t.co/Tr3BmioV93— AEWCer0Miedo (@AEWCer0Miedo) November 11, 2026ఇదీ చదవండి: ‘లడ్డూలాంటి క్యాచ్‌లు వదిలేశారు’.. భారత దిగ్గజం ఆగ్రహంఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్.. న్యూజిలాండ్ జట్టు ప్రకటన! వారిద్దరూ రీఎంట్రీ