breaking news
brock lesnar
-
శకం ముగిసింది.. డబ్ల్యూడబ్ల్యూఈకి స్టార్ రెజ్లర్ గుడ్ బై
డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్‌స్టార్ బ్రాక్ లెస్నర్ ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆగస్టు 1న మిన్నెసోటా వేదికగా జరిగిన 'సమ్మర్ స్లామ్' ఈవెంట్లో నైజిరీయా స్టార్ రెజ్లర్ ఒబా ఫెమీ చేతిలో ఓటమి అనంతరం బ్రాక్ లెస్నర్ ఈ ప్రకటన చేశాడు. 49 ఏళ్ల బ్రాక్ లెస్నర్ పదిసార్లు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌గా నిలిచాడు. Photo Credit: WWE Twitterఈ ఏడాది 'రెజల్మేనియా 42' ఈవెంట్లో మెగా క్లాష్లోనే ఓబా ఫెమీ చేతిలో ఓటమి పాలైన బ్రాక్ లెస్నర్ అప్పుడే వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. కానీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న బ్రాక్ లెస్నర్ 'సమ్మర్ స్లామ్'లో ఒబా ఫెమీతో ఫైనల్ ఫైట్‌కు సిద్ధమయ్యాడు. 'హెల్ ఇన్ ఏ సెల్' కేజ్‌లో జరిగిన ఫైట్‌లో బ్రాక్ లెస్నర్ మూడుసార్లు సూప్లెక్సెస్తో పాటు ఎఫ్-5 ఇచ్చినప్పటికీ ఒబా ఫెమీ ఏం కానట్లు లేచి నిల్చున్నాడు. ఆ తర్వాత ఫెమీ తన ఫెవరెట్ షాట్ 'ఫాల్ ఫ్రమ్ గ్రేస్'తో లెస్నర్పై విరుచుకుపడడంతో అతడికి ఓటమి తప్పలేదు. కాసేపటి తర్వాత పైకి లేచిన బ్రాక్ లెస్నర్.. ఒబా ఫెమీ చేతిని పైకి లేపి 'ఫ్యూచర్ ఆఫ్ డబ్ల్యూడబ్ల్యూఈ' అని పేర్కొన్నాడు. ఇక నాది గతం అని పేర్కొన్న లెస్నర్.. 'నేను ఈరోజు రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా' అని ఎమోషనల్ అయ్యాడు. దీంతో 24 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్‌కు బ్రాక్ లెస్నర్ వీడ్కోలు పలికినట్లయింది.Photo Credit: WWE Twitter49 ఏళ్ల బ్రాక్ లెస్నర్ 10 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ చాంపియన్‌గా నిలవడంతో పాటు రెండుసార్లు 'రాయల్ రంబుల్' విన్నర్‌గా (2003, 2022), 2002లో 'కింగ్ ఆఫ్ ది రింగ్' గా నిలిచాడు. 2019లో 'మనీ ఇన్ ది బ్యాంక్' సొంతం చేసుకున్నాడు. అయితే 2004లో డబ్ల్యూడబ్ల్యూఈని వీడిన బ్రాక్ లెస్నర్ ఆ తర్వాత కొంతకాలం నేషనల్ ఫుట్‌బాల్ లీగ్ (ఎన్ఎఫ్ఎల్)లో ఆడాడు. ఆ తర్వాత 2007లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) లో అడుగుపెట్టిన బ్రాక్ లెస్నర్ 2008లో రాండీ కౌచర్ను ఓడించి యూఎఫ్‌సీ హెవీవెయిట్ చాంపియన్‌గా నిలిచాడు. 2012లో డబ్ల్యూడబ్ల్యూఈకి రీఎంట్రీ ఇచ్చిన లెస్నర్ ఎక్స్ట్రీమ్ రూల్‌లో జాన్ సీనా చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత సీనా, ట్రిబుల్ హెచ్, సీఎం పంక్, రోమన్ రీయిన్స్, హండర్టేకర్, రాండీ ఆర్టన్, గోల్డ్బర్గ్, సెత్ రాలిన్స్, సామి జోలను ఓడించి తన రీఎంట్రీని గొప్పగా మలుచుకున్న లెస్నర్ మల్టీ టైమ్ చాంపియన్‌గా నిలిచాడు. THE PAST 🤝 THE PRESENT 🤝 THE FUTURE@BrockLesnar | @Obaofwwe pic.twitter.com/YLmd6tDWg5— WWE (@WWE) August 2, 20262014లో రెజల్మేనియా 30లో హండర్టేకర్ను ఓడించి అతడి అన్డిఫీట్ స్ట్రీక్‌ను(21-1) బ్రేక్ చేసిన లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ ఐకాన్‌గా మారిపోయాడు. తాజాగా ఒబా ఫెమీ రూపంలో ఫ్యూచర్ డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ కనిపించడంతో తన వీడ్కోలుకు సమయం ఆసన్నమైందని బ్రాక్ లెస్నర్ భావోద్వేగంతో పేర్కొన్నాడు.OBA FEMI DEFEATS BROCK LESNAR IN A HELL IN A CELL MATCH 🤯 #SummerSlam pic.twitter.com/2GhksQpOKV— SportsCenter (@SportsCenter) August 2, 2026#WWE : Brock Lesnar is officially retired.From a South Dakota farm to the top of every combat sport.-NCAA Champion.-UFC Heavyweight Champion.-Youngest WWE Champion.-Ended the Undertaker’s Streak.-Multiple-time world champion across promotions. pic.twitter.com/73co4wQcYR— Rajat Jain (@RajatJain) August 4, 2026Read: 22 బంతుల్లోనే రికార్డు శతకం.. 95 ఏళ్ల క్రితమే! -
రెజ్లింగ్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!
డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ అభిమానులకు బిగ్ షాక్ తగిలింది. స్టార్ రెజ్లర్ బ్రాక్ లెస్నర్ (Brock Lesnar) అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించారు. రెజ్లిమేనియా 42 ఈవెంట్లో భాగంగా.. యువ రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో లెస్నర్ ఓటమి పాలయ్యాడు. తదనంతరం లెస్నర్ చర్యతో ఫ్యాన్స్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్(WWE) అనేది ‘స్క్రిప్టెడ్ రెజ్లింగ్’ అనేది అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఫైటింగ్లో పాల్గొనే రెజ్లర్లు నిపుణుల సమక్షంలోనే ప్రాక్టీస్ చేసి స్టేజ్ ప్రదర్శనలు ఇస్తుంటారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం వేకువ జామున నెవెడా స్టేట్ లాస్ వెగాస్‌లో అలెజెయింట్ స్టేడియం వేదికగా రెజ్లిమేనియా 42 మెయిన్ ఈవెంట్ జరిగింది. అయితే.. ఆద్యంతం ఆకట్టుకుంటుందని భావించిన లెస్నర్-ఒబా మ్యాచ్.. నిమిషాల వ్యవధిలో ముగియడం రెజ్లింగ్ ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది. డబ్ల్యూడబ్ల్యూఈలో ఇంతకాలం పవర్‌హౌస్‌గా పేరున్న లెస్నర్ ఏ దశలోనూ ఒబాకు పోటీ ఇవ్వలేకపోయాడు. తన ఫినిషింగ్ మూవ్ ఎఫ్-5 ఇచ్చినా.. ఒబా ఫెమి లేచి నిల్చోవడంతో అంతా షాక్‌లో ఉండిపోయారు. ఆ వెంటనే తన పవర్ బాంబ్ మూవ్‌తో ఒబా మ్యాచ్‌ను ముగించాడు. 48 ఏళ్ల వయసున్న బ్లాక్ లెస్నర్.. 27 ఏళ్ల నైజీరియా రెజ్లర్ ఒబా ఫెమి చేతిలో ఓటమితో అభిమానులు షాక్‌కు గురయ్యారు. ఆ వెంటనే స్టేజ్‌పైనే కూర్చుండిపోయిన లెస్నర్ తన గ్లౌస్, షూస్‌ను వదిలి అక్కడి ప్రేక్షకులకు అభివాదం చేస్తూ వీడ్కోలు సందేశం ఇచ్చాడు. తన మేనేజర్ పాల్ హేమన్ను కౌగిలించుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ పరిణామాలు లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూఈ కెరీర్ ముగింపు కావచ్చని భావిస్తున్నప్పటికీ.. ఈ ఏడాది సమ్మర్‌స్లామ్ ఈవెంట్లో లెస్నర్ చివరి మ్యాచ్ అడొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. BROCK LESNAR RETIRING? 👀Brock left his gear in the ring and hugged Paul Heyman as the crowd cheered thank you after his match at #WrestleMania pic.twitter.com/8ts2gJWYpR— SportsCenter (@SportsCenter) April 19, 2026ఇక.. డబ్ల్యూడబ్ల్యూఈకే ప్రధాన ఈవెంట్‌గా చెప్పుకునే రెజ్లిమేనియా ఈసారి చప్పగా సాగింది. ఏప్రిల్ 18–19 తేదీల్లో రెండు రోజులపాటు సాగాయి మ్యాచ్‌లు. లక్ష మందికి పైగా అభిమానులు హాజరైన ఈ ఈవెంట్‌కు రెజ్లర్(రిటైర్డ్)-యాక్టర్ జాన్ సీనా హోస్ట్‌గా వ్యవహరించాడు. అయితే మ్యాచ్ ఫలితాలు చాలా వరకు అభిమానులు పెదవి విరుస్తున్నారు. మరీ ముఖ్యంగా లెస్నర్ను అంత దారుణంగా ఓడిపోయేలా స్క్రిప్ట్ రాయడంపై మండిపడుతున్నారు. అన్డిస్ప్యుటెడ్ చాంపియన్‌షిప్ కోసం జరిగిన మ్యాచ్‌లో కోడి రోడ్స్.. రాండీ ఆర్టన్ను ఓడించాడు. తద్వారా కోడి రోడ్స్ తన చాంపియన్‌షిప్‌ను విజయవంతంగా కాపాడుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక రోమన్ రేన్స్, సీఎం పంక్ను ఓడించి హెవీవెయిట్ టైటిల్‌ను నెగ్గాడు. ఉమెన్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ పోరులో లివ్ మోర్గాన్ స్టెఫనీ వాక్వర్పై విజయం సాధించింది. బెక్కీ లించ్, ఏజే లీను ఓడించి ఉమెన్స్ ఇంటర్కాంటినెంటల్ టైటిల్‌ను గెలుచుకుంది. జేకబ్ ఫాటూ, డ్రూ మెక్‌ఇంటైర్‌పై విజయం సాధించాడు. ఉసోస్ & ఎల్ఏ నైట్లు ది విజన్-ఐషోస్పీడ్(ప్రముఖ య్యూట్యూబర్)ను ఓడించారు. రియా రిప్లీ, జేడ్ కార్గిల్‌ను ఓడించి మహిళల చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచింది. ట్రిక్ విలియమ్స్, సామీ జేన్‌ను ఓడించి యూస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలిచాడు. ఫిన్ బాలర్, డొమినిక్ మిస్టీరియోను ఓడించాడు. గుంథర్, సెత్ రోలిన్స్‌ను ఓడించాడు. అయితే గుంథర్-రోలిన్స్ మ్యాచ్ ఒక్కటే ఈ ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.


