breaking news
Breach of privilege notices
-
రాహుల్‌పై సభా హక్కుల నోటీస్
న్యూఢిల్లీ: హోం మంత్రి అమిత్‌షానుద్దేశిస్తూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ అనుచిత వ్యాఖ్యలుచేశారంటూ ఆయనపై బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ గురువారం సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇచ్చారు. ఈ మేరకు ఆ నోటీస్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఠాకూర్ అందజేశారు. ‘అమిత్ షానుద్దేశించి రాహుల్ జూలై 29 తేదీన అమర్యాదగా మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలుచేసి సభా మర్యాదలను ఉల్లంఘించారు. విద్యార్థులతో సంభాషణను గుర్తుచేస్తూ ‘విద్యార్థులు’,‘మూర్ఖులు’,‘అంధభక్తులు’ అనే పదాలు వాడారు. చివరి రెండు పదాలు రాజకీయ ప్రత్యర్థులను, ప్రభుత్వ మద్దతుదారులనుద్దేశించి వాడారు. సభలో ఇలాంటి పదాల వినియోగాన్ని లోక్‌సభ సెక్రటేరియట్ నియమావళిలోని 352(3), (7), 353 నిబంధనల ప్రకారం ఏనాడో నిషేధించారు. దారుణమైన ఆరోపణలు చేసిన రాహుల్‌గాంధీ వెంటనే లోక్‌సభకు, అమిత్ షాకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. రాహుల్ అమర్యాదకర వైఖరి అంశాన్ని సభాహక్కుల ఉల్లంఘన కమిటీకి సిఫార్సు చేసి సమగ్ర దర్యాప్తు తర్వాత ఆయనపై తగు చర్యలు తీసుకోవాలి’’ అని తన మూడు పేజీల నోటీస్‌లో అనురాగ్ ఠాకూర్ కోరారు. -
బోండా, గోరంట్లపై సభాహక్కుల నోటీస్
అసెంబ్లీ కార్యదర్శికి అందజేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత దూషణలతో ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కే రోజా సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. పార్టీ ఎమ్మెల్యేలు ఉప్పులేటి కల్పన, పాముల పుష్ప శ్రీవాణి, వి.కళావతి, కోటంరెడ్డిశ్రీధర్‌రెడ్డిలతో కలసి ఆమె శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శికి ఈ నోటీసును అందించారు. అనంతరం మీడియా పాయింట్లో మాట్లాడుతూ.. ఈ నెల 18న పట్టిసీమపై చర్చ జరిగినప్పుడు మంత్రులతోసహా టీడీపీ సభ్యులు ఏవిధంగా అసభ్యకర పదజాలంతో మాట్లాడారో ప్రజలు చూశారని రోజా అన్నారు. ఎమ్మెల్యేలు బుచ్చయ్యచౌదరి, బోండా ఉమామహేశ్వరరావు, మంత్రులు రావెల కిశోర్‌బాబు, దేవినేని ఉమా, కె.అచ్చెన్నాయుడు, పీతల సుజాత తదితరులు మాట్లాడిన మాటల క్లిప్పింగ్స్ చూస్తే ఏ ఒక్కరోజన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడింది, లేనిదీ బహిర్గతమవుతుందన్నారు. తమను రెచ్చగొట్టేలా వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడారని, వాళ్లు పదిసార్లు మాట్లాడితే.. ఒకసారి మాట్లాడిన తమను టీవీల్లో చూపించడం దుర్మార్గమన్నారు. తనపై టీడీపీ ఎమ్మెల్యే అనిత ద్వారా గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభాహక్కుల నోటీస్ ఇవ్వడాన్ని తప్పుపట్టారు. హావభావాలను ప్రదర్శించడం బూతు అయితే.. సభలో స్పీకర్ సాక్షిగా ‘ఏంట్రా... అరేయ్ పాతేస్తా... నా కొ...’ అనడం తప్పుగా అనిపించకపోవడం బాధాకరమన్నారు. టీడీఎల్పీ కార్యాలయంలో మీడియా ముందు ఎడిట్ చేసి ప్రదర్శించిన వీడియో ఫుటేజీ వ్యవహారానికి సంబంధించి చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులుపై చర్యలు తీసుకోవాలని రోజా డిమాండ్ చేశారు. స్పీకర్ కు సంబంధం లేకుండా ఎంపిక చేసిన క్లిప్పింగ్స్ మాత్రమే ఎలా బయటికొచ్చాయని ప్రశ్నించారు. -
రోజాపై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానం
వివరణకు అవకాశమివ్వాలని స్పీకర్‌కు రోజా వినతి హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై అధికారపక్ష ఎమ్మెల్యే అనిత సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ఇచ్చారు. గత డిసెంబర్లో అసెంబ్లీలో జరిగిన వ్యవహారంలో విపక్ష ఎమ్మెల్యే రోజా మహిళాలోకం సిగ్గుపడేలా ప్రవర్తించారని అనిత ఆరోపించారు. డిసెంబర్లో సభలో ఏం జరిగిందనే విషయాన్ని సీడీలో సమర్పిస్తున్నామని చెప్పారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ.. ‘గతంలోనూ ఒకసారి ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు. తీర్మానాన్ని అసెంబ్లీ కార్యదర్శి ద్వారా ప్రివిలేజ్ కమిటీకి పంపిస్తాం. కమిటీ విచారించి నివేదిక ఇస్తుంది’ అని చెప్పారు. దీనిపై రోజా స్పందిస్తూ తాను తప్పు చేయలేదని, తనపై ఆరోపణలు చేసినందున వివరణనిచ్చే అవకాశమివ్వాలని స్పీకర్‌కు విన్నవించారు. రోజా వినతికి స్పీకర్ సానుకూలంగా స్పందించలేదు. ప్రివిలేజ్ కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోదని, దాని ముందు వాదన వినిపించాలని సూచించారు. రోజాకు మాట్లాడే అవకాశమివ్వకపోవడం పట్ల విపక్ష నేత జగన్మోహన్రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఆమెకు మాట్లాడే అవకాశమివ్వకపోవడం అన్యాయమన్నారు.


