నిన్న దుమ్ము దుమారం..నేడు రాజమార్గం
సీఎం రాక ఎఫెక్ట్ ఫటాఫట్ రోడ్డు పనులు
వర్గల్ : సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా శనివారం తూప్రాన్-గజ్వేల్ మీదుగా ఎర్రవల్లి చేరుకుంటున్నారనే సమాచారంతో ఆర్అండ్బీ శాఖ ఉలిక్కిపడింది. రోడ్డు పనులు పూర్తి కాకుండా సీఎం కాన్వాయ్ వెళుతున్నపుడు దుమ్ము రేగితే తమ కొంప మునుగుతుందని ఆ శాఖ అప్రమత్తమైంది. వర్గల్ మండలం మజీద్పల్లి సమీపంలో కంకర పరచడంతో దుమ్ము రేపుతున్న రోడ్డును తారుగా తీర్చిదిద్దే పనులు శనివారం ఉదయం యుద్ధప్రాతిపదికన చేపట్టింది. సాయంత్రం వరకు తారు వేసి ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నారు ఆ శాఖ అధికారులు, కాంట్రాక్టర్. మరోవైపు ఎలాగైతేనేం తమకు దుమ్ము కష్టాలు తొలగిపోయాయని ప్రయాణికులు సంబరపడ్డారు.