breaking news
brain infection
-
బొత్సకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్!
-
బొత్సకు బ్రెయిన్ ఇన్ఫెక్షన్!
హైదరాబాద్ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయన బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బొత్స సత్యనారాయణ బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు సమాచారం. వైద్యులు ఆయనకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక చికిత్సల అనంతరం బొత్సకు మెదడులో రక్తం గట్టకట్టినట్లు వైద్యలు నిర్థారించారు. డాక్టర్ సోమరాజు ఆధ్వర్యంలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా రెండున్నర నెలల తర్వాత రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. అయితే అస్వస్థత కారణంగా బొత్స ఈ భేటీకి దూరంగా ఉన్నారు.