breaking news
boyfriends parents
-
ఆ నిశ్శబ్దం భయంకరం
‘కోవిడ్ లక్షణాలు కనిపించిన వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి. లైట్‌గా జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ని కలవండి’’ అన్నారు పాయల్ రాజ్‌పుత్. పాయల్ బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ తల్లి మృతి చెందారు. ఈ సందర్భంగా పాయల్ మాట్లాడుతూ – ‘‘నేను, సౌరభ్ హైదరాబాద్‌లో ఉన్నాం. అనితా ఆంటీ (సౌరభ్ తల్లి) ఢిల్లీలో ఉంటున్నారు. ఒకరోజు ఆంటీ ఫోన్ చేసి జ్వరం వచ్చిందని చెబితే, అది మామూలు జ్వరమేమో అనుకున్నాం. ఎక్కువగా ఏసీ రూమ్‌లో ఉంటున్నందున శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి ఉంటుందని ఆంటీ కూడా భావించారు. కానీ ఆ తర్వాత ఆమెకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది. సౌరభ్ వాళ్ల అన్నయ్య ఓ హాíస్పిటల్‌లో జాయిన్ చేశారు. సౌరభ్, నేను ఢిల్లీ వెళ్లాలనుకున్నా కుదర్లేదు. అయితే ఆకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఆమె ఇబ్బంది పడ్డారు. చివరికి మాకు దూరమయ్యారు. మా పెళ్లి చూడకుండానే వెళ్లిపోయారని బాధగా ఉంది. ఆంటీకి జ్వరం వచ్చిన రోజే హాస్పిటల్లో చేర్చి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదేమో. ఆమె మరణంతో మా రెండు కుటుంబాల్లో నిశ్శబ్దం నెలకొంది. ఈ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. దయచేసి ఏమాత్రం కోవిడ్ లక్షణాలు మీలో కనిపించినా, ఆరోగ్యంపరంగా వేరే అసౌకర్యం ఉన్నా వెంటనే పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యంగా ఉండొద్దు’’ అన్నారు. -
లవర్స్ పేరెంట్స్ ను మెప్పించాలంటే..
ముంబై: 'మనసున ఉన్నది చెప్పాలని ఉన్నది మాటలు రావే ఎలా' అంటూ ముందు కొద్ది రోజులపాటు పాటలు పాడుకున్నా తర్వాత ఏదో ఒకలా తమ మనసుకు నచ్చిన వ్యక్తిని బాయ్ ఫ్రెండ్‌గా దగ్గర చేసుకోగలరు అమ్మాయిలు. వారిని చూపులతో ఇట్టే కట్టేయగలరు. కానీ, పూర్తిగా సొంతం చేసుకోవాలంటే మాత్రం కచ్చితంగా ఆ బాయ్ ప్రెండ్స్ తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి. కానీ ఇది పెద్ద సాహసమే. ఎందుకంటే బాయ్ ఫ్రెండ్స్‌ను మెప్పించినంత ఈజీ కాదు వారి తల్లిదండ్రులను ఒప్పించడం. మెప్పించడం సంగతీ దేవుడెరుగు.. కనీసం వారి ముందుకు వెళ్లే సాహసం కూడా చేయలేరు. అయితే, ఇదంతా కేవలం కొన్ని విషయాలపై అవగాహన లేక జరుగుతుందని, కొన్ని కిటుకులను అనుసరించడం ద్వారా వారి మనసును కూడా బాయ్ ఫ్రెండ్స్ మనసులకన్నా వేగంగా కట్టేయోచ్చంటున్నారు. ఒక్కసారి ఆ కిటుకులేమిటో చూస్తే.. ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా.. అందుకే హుందాగా ఉండటమే కాకుండా కాస్త బిగుతుగా ఉండే దుస్తులు ధరిస్తే వారు చూపు మీపై నిలుస్తుందట. అలాగే, తొలిసారి కలిసేందుకు వెళుతున్నప్పుడు కాబోయే అత్తమామలకు కచ్చితంగా చేతిలో బహుమతి ఉండాలంటున్నారు. ఇక ఇంటర్వ్యూకు వెళ్లినట్లుగానే ముందుగా ప్రిపేర్ అయ్యి వెళ్లాలట. గబగబా మాట్లాడకుండా వారేం మాట్లాడుతున్నారో సావధానంగా వినాలి. ఇంకా, ఆ సమయంలో అమ్మాయి మాట్లాడే మాటల్లో అబ్బాయిపైనే ఊహలున్నట్లుగా ఉండటంతోపాటు, అన్ని తెలిసిన అమ్మాయిలా ప్రవర్తించకూడదు. అబ్బాయిపక్కనే కూర్చోవలటకానీ చేతులు వేయకూడదని అంటున్నారు. గతంలో ఏవైన వాస్తవాలు తెలిసి ఉన్నా వాటిని ప్రస్తావించకుండా ఉంటాలట. మాట్లాడేముందు తప్పినిసరిగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడితే మంచి ఇంప్రెషన్ ఉంటుందట. ఇన్ని చేసినా చివరికి వాళ్లు ప్రతికూల నిర్ణయం తీసుకుంటే మరో అవకాశం వారికిచ్చేలాగా మనసును సరిచేసుకోవాలేగానీ వారిపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పరుచుకోకూడదట. ఇప్పుడు తెలిసిందిగా అమ్మాయిలు.. ఇక ఫాలో అయిపోండి.