breaking news
borewells slipped
-
బోరు బావిలో పడ్డ బాలుడు
-
బోర్ వెల్స్ బోల్తా, ఒకరి మృతి
హయత్నగర్ (రంగారెడ్డి జిల్లా): హయత్నగర్ మండలం తారామతిపేట్ సమీపంలో గురువారం ఉదయం బోరు వాహనం బోల్తాపడిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన బోర్వెల్స్ వాహనం ఔటర్ రింగురోడ్డుపై ఈసీఐఎల్ వైపు వెళ్తుండగా టైరు పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తోన్న ఏడుగురిలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడగా దగ్గర్లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. మృతుడు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.