breaking news
Border soldier
-
సైనికులకు సిరిధాన్యాల ఆహారం
మైసూరు: దేశ రక్షణ కోసం సరిద్దుల్లో పనిచేస్తున్న సైనికుల ఆరోగ్యాన్ని పెంపొందించేలా సిరిధాన్యాలను వారి ఆహారంలో వినియోగిస్తామని కేంద్ర రక్షణ, పర్యాటక శాఖల సహాయ మంత్రి అజయ్ భట్ తెలిపారు. శనివారం మైసూరులోని కేంద్ర రక్షణ ఆహార పరిశోధనా ప్రయోగాలయం (డీఎఫ్ఆర్ఎల్)లో ‘మిలిటరీ రేషన్, పౌష్టికాంశాలతో కూడిన సిరిధాన్యాలు’అంశంపై రెండు రోజుల సదస్సును ఆయన ప్రారంభించారు. చిరుధాన్యాల నిపుణుడు, పద్మశ్రీ డాక్టర్ ఖాదర్ వలి కూడా పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ అత్యంత ఎత్తైన సియాచిన్ లాంటి ప్రాంతాల్లో గస్తీ విధులను నిర్వహిస్తుంటారని చెప్పారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసే సైనికుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన పని అన్నారు. వారు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు సిరిధాన్యాలతో కూడిన ఆహారాన్ని అధికంగా ఇస్తామని చెప్పారు. -
మా తుఝే సలామ్
సైనికుడిని సరిహద్దుకు పంపే తల్లి వీర తిలకం దిద్దుతుంది. అది.. రుధిర తిలకం కాదు... తిరంగా తిలకం! తల్లి తన కొడుకును దేశ రక్షణ కిరణమై ఉదయించేందుకు... సన్నద్ధం చేసి పంపిస్తుంది. ఉదయించే సూర్యుడిలో ఎరుపు ఒక్కటే వర్ణం.\ సరిహద్దు సైనికుడిలో ప్రతిఫలించేవి త్రివర్ణాలు.అతడి ఊపిరిలో రెపరెపలాడేవి త్రివర్ణ పతాకాలు! దేశానికి తన కొడుకెప్పుడూ... రక్షకుడిలా ఉండాలని తల్లి కోరుకుంటుంది. భరతమాతను కాపాడ్డం కోసం అతడెప్పుడూ త్రినేత్రుడై కాపుగాయాలని ఆకాంక్షిస్తుంది. విధి నిర్వహణలో ఆ సైనికుడు అస్తమిస్తే... కొడుకును త్యాగం చేసిన వీరమాత అవుతుంది! ఎంత వీరమాత అయినా.. అమ్మ అమ్మే! పుట్టినప్పుడు పురిటి నొప్పి కన్నా... పోయినప్పటి కడుపు కోతే ఎక్కువ.ఆ మాతృమూర్తికి మొక్కాలి! ఆమెకు మొక్కడం అంటే.. అమరుడైన ఆ సైనికుడికి మొక్కడమే. చిన్నప్పుడు మనం స్కూల్లో... రిపబ్లిక్ డేకీ, ఇండిపెండెన్స్ డేకీ వందనం చేస్తున్నప్పుడు.. మన హృదయం ఉప్పొంగిపోయి ఉంటుంది. అందుకే ఇప్పుడు మన జెండాను ఎవరైనా అవమాన పరిస్తే.. మన సైనికుడిపై దొంగ దెబ్బ తీస్తే.. గుండె రగిలిపోతుంది.. ఆగ్రహంతో కళ్లు ఎర్రబడతాయి. ఈ ఆగ్రహజ్వాలలు.. సైనికుల్ని త్యాగం చేసిన తల్లుల ఊపిరులు. అందుకే.. దేశం కోసం బొడ్డుతాడు తెంపుకున్న తల్లులందరికీ.. పేగు బంధాన్ని పణంగా పెట్టిన మాతృమూర్తులందరికీ.. రేపు మదర్స్ డే సందర్భంగా... ‘సాక్షి’ సలామ్ చేస్తోంది. మా తుఝే సలామ్. 1947–2017. డెబ్బయ్ ఏళ్లుగా పొరుగుదేశం భారత్‌తో యుద్ధం చేస్తోంది! ఈ డెబ్బయ్ ఏళ్లలోనూ ఆ దేశంతో భారత్ ఒక్కసారీ ప్రత్యుద్ధం చెయ్యలేదు. శత్రువు చొరబడి రావడం, భారత్ వెనక్కి తరమడం... ఇదే మన వైపు నుంచి జరుగుతున్న యుద్ధం. భారత్ శాంతిమాత. సహనమూర్తి. కానీ ఆ శాంతిని, సహనాన్ని ఏడు దశాబ్దాలుగా పొరుగుదేశం పరీక్షిస్తూనే ఉంది. కనిపించదు... కాలుదువ్వుతుంది! కవ్వించదు... కాల్పులు జరుపుతుంది! దొంగదాడి చేస్తుంది... సైనికుల తలల్ని తెగనరుకుతుంది! భౌగోళిక సరిహద్దుల మధ్య ఇంత అతిక్రమణ, ఇంత ఉల్లంఘన జరుగుతుంటే... దేశం లోపలి భావోద్వేగాలను ఏ హద్దులు ఆపగలుగుతాయి? ‘ఒక తలకు యాభై తలలు కావాలి’ ఒక కూతురు రగిలిపోతోంది. ‘పది తలలు తెస్తానన్నారు! ఏవీ?’ అని ఒక తల్లి అడుగుతూనే ఉంది. ఆక్రమణలు... ఉల్లంఘనలు రెండు దేశాల మధ్య నిజానికి వాస్తవాధీన రేఖ అన్నది భారత్ మదిలో ఉంది. శత్రువు దానిని ఎప్పుడో మరిచిపోయింది. సరిహద్దుల్లో 78,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆ దేశం ఆక్రమించిన ప్రదేశం ఒక్కటే ఇప్పుడు రెండు దేశాల మధ్య గుర్తు! ఆ ప్రదేశం నుంచే శత్రువు ఘాతుకాలకు పాల్పడుతోంది. కశ్మీర్ కోసం ఉవ్విళ్లూరుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి, భారత్‌పైకి లంఘిస్తోంది! భారత్ తనను తాను నిలువరించుకుని, సంయమనంతో నెట్టుకువస్తోంది. ఏ తల్లి మాత్రం యుద్ధాన్ని కోరుకుంటుంది? ఏ తల్లీ మాత్రం యుద్ధాన్ని రానిస్తుంది. యుద్ధానిదేముంది?! ఒక బాంబు వేస్తే మొదలౌతుంది. ఇంకో బాంబు వేస్తే ముగిసిపోతుంది. యుద్ధంలోకి దిగకుండా తమాయించుకోడానికే.. దేశాన్ని కుదిపేసేటంతటి శక్తి కావాలి! అంతటి సహనశక్తి ఈ సృష్టిలో ఒక్క మాతృమూర్తికే ఉంటుంది. సహనమూర్తికి సరిహద్దు పరీక్ష 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై జరిగిన పాక్ ప్రేరేపిత ఉగ్రదాడుల తర్వాత శత్రుదేశంపై దండెత్తబోయి మరీ భారత్ రెండుసార్లు తమాయించుకుంది. ఒక దశలో సరిహద్దుకు రెండు వైపులా రెండు దేశాల సైన్యాలు మోహరించాయి. ఆ తర్వాత కూడా అనేక సందర్భాలలో భారత్ హెచ్చరికలతో సరిపెట్టింది. యుద్ధం జరిగితే కూలిపోయేది దేశాలు కాదు. కుటుంబాలు. ధ్వంసం అయ్యేది ఆర్థిక వ్యవస్థలు మాత్రమే కాదు, పటిష్టంగా అల్లుకుని ఉన్న అనుబంధాలు కూడా! ఆ సంగతి.. 130 కోట్లకు పైగా ముద్దుబిడ్డలు ఉన్న భరతమాతకు తెలుసు. అందుకే సహనం వహిస్తోంది. కానీ ఆ దేశం తీరు మాత్రం మారలేదు. రీతీ మారలేదు. నీతి తప్పిన పొరుగు దేశం ధర్మనీతి, దండనీతి, దౌత్యనీతి, యుద్ధనీతి, రాజనీతి.. ఏ నీతీ మన పొరుగుదేశానికి లేదని మే 1న మరోసారి రుజువైంది. భారత్‌తో చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ, జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్లో భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చిన ఆ దేశ సైనికులు భారత సైన్యంపై తెగబడి ఇద్దరు భారత జవాన్ల తలలు నరికేశారు. 42 ఏళ్ల నాయిబ్ సుబేదార్ పరమ్‌జీత్ సింగ్, 45 ఏళ్ల సరిహద్దు హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్సాగర్లపై ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ఉద్వేగాల ప్రకంపనలు ఇలాంటి ఘాతుకాలు జరిగిన ప్రతిసారీ మన మాతృదేశం ఉద్వేగంతో ప్రకంపిస్తుంది. రక్షణశాఖ ప్రతీకార హెచ్చరికలను సంధిస్తుంది. భారత్‌లోని ప్రతి పౌరుడి గుండె మతాలకు అతీతంగా దేశం కోసం స్పందిస్తుంటుంది. జవాన్లను కోల్పోయిన ఆ కుటుంబాలు గుండెలు బాదుకుంటాయి. ఆ అమరవీరుల శవపేటికలపై పరిచిన జాతీయపతాకంపై నుదురు ఆన్చి ‘దేశమా! ఇంతకింతా తీర్చుకో’అని నినదిస్తాయి! 2013 జనవరి లాన్స్ నాయక్ హేమ్రాజ . కొడుకు ఫొటోతో హేమ్రాజ్ తల్లి. 2013 జనవరి లాన్స్ నాయక్ సుధాకర్ సింగ్. అతడి కుటుంబ సభ్యులు. ‘ఒక తలకు యాభై తలలు కావాలి’ ఒక కూతురు రగిలిపోతోంది. ‘పది తలలు తెస్తానన్నారు! ఏవీ?’ అని ఒక తల్లి అడుగుతూనే ఉంది. 1999 జూన్ కార్గిల్ యుద్ధంలో కెప్టెన్ సౌరభ్ కాలియాను పట్టుకుని చిత్రహింసలు పెట్టిన పాకిస్తాన్ సైన్యం, ఆ తర్వాత అతడి తల నరికి భారత్‌కు మృతదేహాన్ని అప్పగించింది. (తల్లితో సౌరభ్ కాలియా) 2017 మే 10 ఉమర్ ఫయాజ్ : ఉగ్రవాదులు భారత యువ సైనికాధికారి లెఫ్టినెంట్ ఉమర్ ఫయాజ్ను పెళ్లింట్లోంచి అపహరించుకు వెళ్లి హత్య చేశారు. (రోదిస్తున్న ఫయాజ్ తల్లి) 2017 మే 1 ప్రేమ్‌సాగర్ కుమార్తె సరోజ్ ధర్మనీతి, దౌత్యనీతి, యుద్ధనీతి, రాజనీతి...ఏ నీతీ మన పొరుగుదేశానికి లేవని ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారీ రుజువౌతోంది. మా నాన్న అమరుడయ్యాడు. ఆయన త్యాగం వృథా కాకూడదు. ఒక తలకు బదులుగా నాకు 50 మంది పాక్ సైనికుల తలలు కావాలి. – సరోజ్,ప్రేమ్‌సాగర్ కుమార్తె 2017 మే 1 మొన్నటి ఘటనలో పరమ్‌జీత్‌సింగ్ మృతదేహాన్ని పంజాబ్‌లోని తరన్ తరన్ జిల్లాలో ఉన్న ఆయన స్వగ్రామం వెయిన్పోయిన్కు, ప్రేమ్‌సాగర్ మృతదేహాన్ని ఉత్తరప్రదేశ్‌లోని దేవ్రియా జిల్లాలో ఉన్న ఆయన స్వస్థలం తాకెన్పూర్కు తీసుకొచ్చి అంత్యక్రియలు జరిపిస్తున్నప్పుడు వారి కుటుంబ సభ్యుల భావోద్వేగాలు భగ్గుమన్నాయి. ‘‘పాకిస్తాన్‌కు గట్టి గుణపాఠం నేర్పేందుకు ప్రభుత్వం ఆర్మీకి స్వేచ్ఛనివ్వాలి. పాక్ ఒక భారత సైనికుడి తల నరికితే పదిమంది శత్రువులకు అదే గతి పడుతుందని మన ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ ఇప్పుడేం జరుగుతోంది? మీ వల్ల కాకపోతే నా భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకోడానికి నాకు అనుమతి ఇవ్వండి’’ – పరంజీత్ కౌర్, పరంజీత్ భార్య