breaking news
Border Security Grid
-
సరిహద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం
-
సరిహద్దుపై కేంద్రం సంచలన నిర్ణయం
జైసల్మేర్: భారత్-పాకిస్థాన్ సరిహద్దు విషయంలో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్-పాక్ సరిహద్దును 2018, డిసెంబర్ వరకు పూర్తిగా మూసివేయనున్నట్టు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఈ సమయంలో సరిహద్దులో పరిస్థితిని కనిపెట్టి చూస్తామని పేర్కొన్నారు. బోర్డర్ సెక్యురిటీ గ్రిడ్ పేరుతో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. దీని ద్వారా సరిహద్దు రాష్ట్రాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటామన్నారు. రాజస్థాన్ లోని జైసల్మేర్ లో శుక్రవారం సరిహద్దు రాష్ట్రాల బీఎస్ ఎఫ్ ఉన్నతాధికారులతో రాజ్ నాథ్ సమావేశమయ్యారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... దేశభద్రత విషయంలో ఏమాత్రం రాజీపడబోమని స్పష్టం చేశారు. భారత్-పాక్ సరిహద్దులో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. సైన్యం పట్ట పూర్తి విశ్వసనీయత చూపాలని కోరారు.