breaking news
booking record
-
ప్రీమియం హోటళ్లలో జోరుగా బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ప్రీమియం హోటళ్లలో బుకింగ్‌లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) అక్యుపెన్సీ రేషియో (భర్తీ రేటు) దశాబ్దం గరిష్ట స్థాయి అయిన 70–72 శాతానికి చేరుకుంటుందని, సగటు రూమ్ రేటు రూ.6,000–6,200 మధ్య ఉండొచ్చని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఆక్యుపెన్సీ రేటు 68–70 శాతం మధ్య ఉంది. ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వినియోగ సెంటిమెంట్ స్థిరంగా మెరుగుపడుతున్నట్టు తెలిపింది. కార్పొరేట్ల స్థిరమైన పనితీరు, దేశీ ప్రయాణికుల రద్దీ కరోనా ముందు నాటి స్థాయిని అధిగమించడం రవాణా, హోటల్ పరిశ్రమలకు డిమాండ్‌ను తీసుకొస్తున్నట్టు వివరించింది. ఈ మేరకు ఇక్రా ఓ నివేదికను విడుదల చేసింది. భారత హోటల్ పరిశ్రమ ఆదాయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం వృద్ధిని చూస్తుందని అంచనా వేసింది. ఒక రూమ్ నుంచి వచ్చే సగటు ఆదాయం ఇప్పటికీ 2007–08 నాటి గరిష్ట స్థాయితో పోలిస్తే 20–25 శాతం తక్కువగా ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ, ముంబైలో ఎక్కువ డిమాండ్ ఢిల్లీ, ముంబై పట్టికలో ఎగువ భాగాన ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇక్కడి హోటళ్లలో ఆక్యుపెన్సీ రేషియో 75 శాతంగా ఉటుందని ఇక్రా వైస్ ప్రెసిడెంట్ వినుత ఎస్ తెలిపారు. ఇతర అన్ని పట్టణాల్లోనూ డిమాండ్ ఆరోగ్యకరంగా ఉంటుందని, బెంగళూరు, పుణెలో మాత్రం బలహీనంగా ఉండొచ్చన్నారు. ముఖ్యంగా జీ20 సమావేశాలు ఉండడం, ఆర్థిక వ్యవస్థ మెరుగుపడడంతో వ్యాపార సమావేశాల ఫలితంగా పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్ ఉంటుందని ఇక్రా పేర్కొంది. అలాగే విహార యాత్రలు, సదస్సులు, ఎగ్జిబిషన్లు, వ్యాపార ప్రయాణాలు, విదేశీ ప్రయాణికుల రాక డిమాండ్‌కు సానుకూలిస్తాయని వివరించింది. మధ్యస్థాయి హోటళ్లలోనూ భర్తీ రేటు పుంజుకుంటున్నట్టు తెలిపింది. వీటిల్లోనూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రేటు నమోదు కావచ్చని అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడంతో గత 12–15 నెలల్లో వాయిదా పడిన ప్రాజెక్టులను ప్రారంభించడం, కొత్త ప్రాజెక్టుల ప్రారంభం ఉండొచ్చని పేర్కొంది. ప్రీమియం విభాగంలో కొత్త హోటళ్ల ప్రారంభం ఎంపిక చేసిన మార్కెట్లలోనే ఉండొచ్చని తెలిపింది. కొత్తగా రానున్న హోటళ్లలో ఎక్కువగా బెంగళూరు, ముంబై మార్కెట్ల నుంచే ఉంటాయని వెల్లడించింది. ‘‘కొత్త హోటల్ వసతుల సరఫరా ఏటా 3.5–4 శాతం కాంపౌండెడ్ వృద్ధి రేటు ప్రకారం ఉండొచ్చు. ప్రీమియం విభాగంలో దేశవ్యాప్తంగా 15,000–16,000 రూమ్‌ల లభ్యత పెరుగుతుంది’’అని ఇక్రా వివరించింది. -
హాట్ కేకుల్లా టిక్కెట్ల అమ్మకాలు
రైల్వే టిక్కెట్లు ఆన్లైన్లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. తొలిరోజే రికార్డు స్థాయిలో రైల్వే టిక్కెట్లు బుక్ అయ్యాయి. కాగా 120 రోజుల ముందే ఐఆర్సీటీసీ ద్వారా ఆన్లైన్ టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్న నిబంధన అమల్లోకి వచ్చిన మొదటిరోజే 13.45 లక్షల టికెట్లను ప్రయాణికులు బుక్ చేసుకున్నారు. సాధారణంగా అయితే రోజుకు 5లక్షల టికెట్లు మాత్రమే అమ్ముడయ్యేవి. తాజాగా నాలుగు నెలల ముందే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకునే నియామవళిని అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇది ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వచ్చింది. గతంలో 60రోజుల ముందు మాత్రమే ఆన్లైన్ టికెట్ల విక్రయానికి అవకాశం ఉండేది. మారిన నిబంధనల ప్రకారం ఇప్పుడు 120 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ నిబంధనను కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు రైల్వే బడ్జెట్లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఇక పగటి పూట నడిచే ఎక్స్‌ప్రెస్ రైళ్లు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్, కొన్ని ఇతరత్రా సర్వీసులకు 30 రోజుల ముందు టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు. ఒకసారి వెబ్సైట్లో లాగిన్ అయితే కేవలం ఒక టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలని, ఆ తర్వాతే మరోసారి లాగిన్ అయితే మరో టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉందిని రైల్వే శాఖ తెలిపింది.