breaking news
Booking counter
-
రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..
రైలు టికెట్లు బుకింగ్ చేయడమంటే అదో పెద్ద ప్రహసనం. అది ఆన్లైన్లోనైనా సరే.. రైల్వే కౌంటర్ వద్దనైనా సరే. కావాల్సిన రైళ్లకు టికెట్లు దక్కుతాయో లేదో చెప్పడం కష్టం. ఇది పక్కన పెడితే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే వారికి ఉన్నవారికి ఉన్న సౌకర్యం ఇప్పటి వరకూ కౌంటర్ వద్ద టికెట్ తీసుకునేవారికి లేదు. కానీ ఇప్పుడది కౌంటర్ వద్ద టికెట్ బుకింగ్ చేసుకున్నా సరే వర్తించనుంది.రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్ల వద్ద టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు శుభవార్త. ఆన్లైన్లో ఈ-టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐచ్ఛిక ప్రయాణ బీమా సౌకర్యాన్ని కౌంటర్ టికెట్లకూ కల్పించాలని భారతీయ రైల్వేలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈనెల (అక్టోబర్) 27లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలని స్పష్టం చేసింది. అంతేకాదు ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైతే రైల్వే బోర్డు నేరుగా బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది కూడా..ఆన్లైన్ ప్రయాణికులతో సమానంగా బీమా సౌకర్యంజస్టిస్ అహ్సానుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఆర్. మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునే వారికి బీమా సౌకర్యం కల్పిస్తున్నప్పుడు, రైల్వే కౌంటర్లలో టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకూ అదే తరహా ప్రయోజనం అందుబాటులో ఉండాలని పేర్కొంది. కౌంటర్ టికెట్లకూ ప్రయాణ బీమాను విస్తరించాలని నిర్ణయించినట్లు, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం గతంలో కోర్టుకు తెలిపింది. మే 11న ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, అధికారులకు తగిన సమయం ఇచ్చినా అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో అక్టోబర్ 27లోగా ఆదేశాలను అమలు చేయాలని గడువు విధించింది.ప్రస్తుతం ఆన్లైన్ టికెట్లకు బీమా ఎంతంటే?ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) ప్రస్తుతం అర్హులైన ఈ-టికెట్ ప్రయాణికులకు ఐచ్ఛిక ట్రావెల్ ఇన్సూరెన్స్ అందిస్తోంది. దీనికి గానూ పన్నులతో కలిపి ఒక్కో ప్రయాణికుడు రూ.0.45 ప్రీమియం (2024 ఫిబ్రవరి 17 నుంచి ) చెల్లించాల్సి ఉంటుంది.రైలు ప్రయాణికుల బీమా పాలసీ ప్రధాన ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..» ప్రయాణికుడు మరణించిన సందర్భంలో రూ.10 లక్షలు» శాశ్వత సంపూర్ణ వైకల్యం కలిగితే రూ.10 లక్షలు» శాశ్వత పాక్షిక వైకల్యం ఏర్పడితే రూ.7.5 లక్షలు» గాయాల కారణంగా ఆసుపత్రి ఖర్చులకు రూ.2 లక్షల వరకు» మృతదేహం తరలింపు ఖర్చులకు రూ.10,000 వరకుఇవి ప్రస్తుతం ఆన్లైన్ టికెట్‌కు అమల్లో ఉన్న ప్రయాణ బీమా పథకానికి సంబంధించిన వివరాలు. అయితే కౌంటర్ టికెట్లకు వర్తించే బీమా మొత్తం, ప్రీమియం, అర్హతలు, ఇతర నిబంధనలు రైల్వే ప్రకటించే తుది మార్గదర్శకాలను బట్టి ఉండొచ్చు.ఏయే ప్రమాదాలకు బీమా వర్తిస్తుంది?ప్రస్తుత పాలసీ నిబంధనల ప్రకారం, అర్హత కలిగిన ప్రయాణ సమయంలో జరిగే నిర్దిష్ట రైల్వే ప్రమాదాలకు బీమా రక్షణ లభిస్తుంది. రైలు ఢీకొనడం, పట్టాలు తప్పడం, ప్రమాదవశాత్తు రైలు నుంచి పడిపోవడం వంటి ఘటనలతోపాటు, పాలసీలో పేర్కొన్న కొన్ని నేర సంబంధిత సంఘటనలకూ నిబంధనలకు లోబడి కవరేజీ ఉంటుంది. అయితే, ప్రతి ప్రమాదానికీ ఆటోమేటిక్‌గా బీమా పరిహారం లభిస్తుందని భావించకూడదు. సంబంధిత ఘటన పాలసీ పరిధిలోకి వస్తుందా లేదా అనేది బీమా నిబంధనలు, ప్రమాద వివరాలు, సమర్పించిన పత్రాల ఆధారంగా నిర్ణయిస్తారు.పిల్లలకు బీమా వర్తిస్తుందా?ప్రస్తుత ఐఆర్సీటీసీ ఆన్లైన్ బీమా పథకంలోనూ వయస్సు, టికెట్ స్థితికి సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. బెర్త్ లేదా సీటు లేకుండా ప్రయాణించే ఐదేళ్లలోపు పిల్లలకు ఈ పథకం వర్తించదు. ఐదు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు, పాలసీ షరతులకు లోబడి, బెర్త్ ఉన్నా లేకపోయినా కవరేజీ లభిస్తుంది. ఈ అర్హత నిబంధనలు కౌంటర్ టికెట్లకు విస్తరించే కొత్త బీమాలోనూ ఇదే విధంగా ఉంటాయా అనేది రైల్వే తుది మార్గదర్శకాలు వెల్లడైన తర్వాతే స్పష్టమవుతుంది.బీమా క్లెయిమ్ ఎలా చేయాలి?ప్రస్తుత ఆన్లైన్ పథకం కింద బీమా ఎంచుకున్న ప్రయాణికులకు పాలసీ వివరాలను బీమా సంస్థ ఎస్ఎంఎస్, ఈ-మెయిల్ ద్వారా పంపుతుంది. పాలసీ నంబర్‌ను ఐఆర్సీటీసీ బుకింగ్ హిస్టరీలోనూ చూసుకోవచ్చు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత బీమా సంస్థ సూచించిన విధంగా క్లెయిమ్ దాఖలు చేసి, అవసరమైన పత్రాలను సమర్పించాలి.కౌంటర్ టికెట్లకు బీమా అందించే విధానం, ప్రయాణికులు ప్రత్యేకంగా దరఖాస్తు చేయాలా, ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందా, పాలసీ వివరాలు ఎలా అందుతాయి వంటి అంశాలపై రైల్వే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.ఇదీ చదవండి: రెనో కొత్త హైబ్రిడ్ కారు.. 29 KM మైలేజీ! -
స్థానిక కోటాకు గోవిందా..
♦ తిరుపతి వాసులపై ప్రభుత్వానికి చిన్నచూపు ♦ శ్రీవారి దర్శన భాగ్యానికి దూరం చేసిన వైనం ♦ ప్రతినెలా మొదటి మంగళవారానికి మంగళం ♦ మూడునెలలకోసారీ దొరకని దర్శనం ♦ మహతి నుంచి తిరుమలకు బుకింగ్ కౌంటర్ ♦ స్థానికుల కోటాపై దళారుల కన్ను రోజూ ఎదురుగా సాక్షాత్కరిస్తుంది. ఏడుకొండలెక్కి దర్శించుకుందామంటే గంటల తరబడి క్యూలో వేచి ఉండాలి. తిరుమల పాదాల చెంత ఉండి కూడా స్వామి దర్శనం తిరుపతి వాసులకు కష్టమే. గతంలో పెట్టిన ‘స్థానిక’ కోటాకు ప్రభుత్వం మంగళం పాడేయడంతో వెంకన్నను దర్శించుకోవాలంటే దూర ప్రాంతాల భక్తుల్లానే నిరీక్షించాల్సిందే. పైగా తిరుపతి వాసుల కోటాపై దళారులు కన్నేసి అమ్మేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షి, తిరుపతి: తిరుమలేశుని దర్శన భాగ్యానికి తిరుపతి వాసులను ప్రభుత్వం దూరం చేస్తోంది. స్థానికులకున్న దర్శనం కోటాకు కోతపెట్టింది. ప్రతినెలా మొదటి మంగళవారం వీరికి కేటాయించిన శ్రీవారి దర్శనం కోటాను మూడునెలలకోసారిగా మార్చింది. ఇప్పుడు ఆ అవకాశానికి కూడా ప్రభుత్వం, టీటీడీ మంగళం పాడేందుకు రంగం సిద్దం చేస్తున్నాయని తెలిసింది. తిరుమలకు ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న నేపథ్యంలో స్థానికులకు దర్శనం కష్టంగా మారింది. తమ కోసం ప్రత్యేకంగా కోటా కల్పించాలని వీరంతా డిమాండ్ చేశారు. ఫలితంగా 2013 బ్రహ్మోత్సవాల అనంతరం స్థానికులకు దర్శనం కల్పించాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. తిరుపతిలో నివాసం ఉండేవారికి (ఆధార్ ఆధారంగా) ప్రతినెలా మొదటి మంగళవారం ప్రత్యేకంగా దర్శనం కల్పించేలా నిర్ణయం తీసుకుంది. తిరుపతిలోని మహతి ఆడిటోరియంతో పాటు తిరుమలలో స్థానికుల కోసం ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. టీటీడీ మొదటి మంగళవారం ఐదు సేవలకు అవసరమైన టికెట్లు ఇచ్చేవారు. మొదట్లో కొద్దిరోజులు 5వేల మంది వరకు స్థానికులు శ్రీవారిని దర్శించుకునేవారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2015 నుంచి స్థానికుల దర్శనం కోటాలో సమూల మార్పులు చేయటం ప్రారంభించారు. ప్రతినెలా మొదటి మంగళవారం భక్తుల సంఖ్యను పరి మితం చేశారు. వేల నుంచి వందలకు కుదించారు. మొదటి మంగళవారంలో 600 టికెట్లు సుప్రభాతం, నిజపాద దర్శనం, తిరుప్పావడ, సహస్రకళసాభిషేకం, అష్టదళపాదపద్మారాదన సేవ కోసం ఇచ్చేవారు. కొన్నాళ్లకు ప్రతి మూడునెలల కొకసారి అంటూ నిబంధన పెట్టారు. స్థానికుల కోటా ఎత్తివేత? ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో స్థానిక దర్శనం కోటాను ఎత్తేయడానికి టీటీడీ సిద్ధమైనట్లు ఆరోపణులు వినిపిస్తున్నాయి. మహతిలో ఉన్న కౌంటర్‌ను తిరుమలలోని జేఈఓ కార్యాలయానికి మార్చారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడైనా స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నారా? అంటే అదీ లేదని మండిపడుతున్నారు. గతంలో కరెంట్ బుకింగ్‌తో పాటు ఆన్లైన్లో కూడా టికెట్లు ఇచ్చేవారని, ప్రస్తుతం అవేమీ లేకుండా చేసినట్లు చెబుతున్నారు. ప్రతి మూడునెలల కొకసారి వచ్చే మొదటి మంగళవారంలో మొక్కుబడిగా 100 లేదా 120 టికెట్లు మాత్రం స్థానికులకు ఇచ్చి మిగిలినవి కొందరు దళారులు అమ్మి సొమ్ముచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీటీడీ అధికారులు స్థానికుల దర్శన కోటా సేవా టికెట్లను సైతం వీఐపీలకు కేటాయించి తిరుపతి వాసులకు శ్రీవారి దర్శన భాగ్యం లేకుండా చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై ప్రభుత్వం, టీటీడీ అధికారులు స్పందించి స్థానిక కోటాను కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.


