breaking news
bonas
-
సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్న్యూస్ తెలిపారు. ఈ ఏడాది కార్మికులకు రూ. 1,10,250 చొప్పున బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించారు. సింగరేణి తెలంగాణకు కొంగుబంగారమని బొగ్గు ఉత్పత్తి పెంచేందుకు సరైన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రతకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్లు కేంద్రమంత్రి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏసీబీకి చిక్కిన అధికారిణి -
చౌడేశ్వరిదేవిదేవి ఉత్సవాలు ప్రారంభం
నందవరం(బనగానపల్లె రూరల్): మండల పరిధిలోని నందవరం గ్రామంలో వెలసిన శక్తిమాత చౌడేశ్వరిదేవి మహోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్న మహోత్సవాల్లో భాగంగా మొదటి రోజు ఆలయ ఈవో రామానుజన్, పాలక మండలి సభ్యుడు పీవీ కుమార్రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారికి భక్తులు రాయబారాది, జ్యోతి రథ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. చెరువుపల్లె, తిమ్మాపురం, జిల్లెల్ల, నందవరం గ్రామాల నుంచి భక్తులు పన్నేరపు బండ్లపై ఆలయానికి చెరుకొని చౌడేశ్వరిదేవికి మొక్కులు తీర్చుకున్నారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


