breaking news
BOAML
-
రూ.లక్ష కోట్లకు పైగా ఖజానాకు...!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ. లక్ష కోట్లు బదిలీ అయ్యే అవకాశాలు న్నాయి. ఆర్బీఐ వద్ద ఉన్న ’మిగులు మూలధన నిల్వలను’ ప్రత్యేక కమిటీ గుర్తించిన అనంతరం ఈ నిధులను బదిలీ చేసే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిల్ లించ్(బీవోఏఎంఎల్) ఒక నివేదికలో పేర్కొంది. ‘ఆర్బీఐ వద్ద ఉండతగిన మూలధన నిల్వల విధానాన్ని(ఈసీఎఫ్) రూపొందించేందుకు ఏర్పాటైన ప్రత్యేక కమిటీ సుమారు రూ.1–3 లక్షల కోట్ల మేర మిగులును గుర్తించే అవకాశం ఉంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది సుమారు 0.5– 1.6 శాతానికి సమానం‘ అని వివరించింది. రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉండతగిన అత్యవసర నిల్వలపై విధించే పరిమితులను బట్టి కేంద్రానికి రూ. లక్ష నుంచి రూ.3 లక్షల కోట్ల దాకా బదిలీ కావచ్చని పేర్కొంది. -
బ్యాంకింగ్ నుంచి పావుశాతం రేటు కోత
బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ తానిచ్చే రుణాలపై వడ్డీరేటును పావుశాతం వరకూ తగ్గించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా– మెరిలించ్ (బీవోఏఎంఎల్) అంచనా వేసింది. ఇండస్ట్రియల్ బిజీ సీజన్– అక్టోబర్ నెల ప్రారంభం అయ్యేనాటికే ఈ నిర్ణయం తీసుకునే వీలుందని వివరించింది. రుణ వృద్ధికి ఇది దోహ దపడుతుందని అంచనావేసింది. ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోను ఆగస్టు 2వ తేదీన 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిన నేపథ్యంలో అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం– ఈ అంశంపై తాజా నివేదికను ఆవిష్కరించింది. బ్యాంకింగ్ తనకు రెపో ద్వారా అందిన రేటు ప్రయోజనాన్ని ఆటో, గృహ నిర్మాణ రంగాలకే కాకుండా మిగిలిన రంగాలకూ అందించాల్సిన అవసరం ఉందని పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ చేసిన వ్యాఖ్యలను సైతం నివేదిక ఈ సందర్భంగా ప్రస్తావించింది. అదే విధంగా డీమోనిటైజేషన్ నేపథ్యంలో బ్యాంకింగ్ వద్ద భారీ నగదు లభ్యత (లిక్విడిటీ) ఉండడాన్నీ ఉటంకించింది. మరికొంతకాలం ద్రవ్యోల్బణం దిగువస్థాయిలోనే కొనసాగే వీలుందని పేర్కొంది. జూలై రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 2 శాతంగా అంచనా వేసింది. ఇక డిసెంబర్ పాలసీ సమీక్షలో ఆర్బీఐ రెపోను మరోశాతం తగ్గించే వీలుందని పేర్కొంది.