breaking news
Black Nationals
-
మళ్లీ అదే పాతపాట: కమల
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మళ్లీ తన పాత విభజన సిద్ధాంతాన్నే ముందుకు తెస్తున్నారని, అగౌరవపరిచే ధోరణి కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి విభజనవాది కాకుండా, అమెరికాకు నిజాలు మాట్లాడే నాయకులు, వాస్తవాలను ఎదుర్కోవాల్సి వచి్చనప్పుడు.. శత్రుభావంతో, ఆగ్రహంతో ఊగిపోకుండా అర్థం చేసుకునే నాయకులు కావాలని ఆమె అభిప్రాయపడ్డారు. హూస్టన్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ప్రజల్లో ఉన్న వైరుధ్యాలు విభజనకు తావివ్వకూడదని, అవే మన బలమని తెలిసిన నాయకుడు అమెరికాకు కావాలని చెప్పారు. అమెరికా ప్రజలను విభజించడానికి ట్రంప్ ప్రయ్నతిస్తున్నారని హారిస్ ఎన్నికల ప్రచార డైరెక్టర్ మైఖేల్ టేలర్ విమర్శించారు. మాజీ అధ్యక్షుడి వ్యాఖ్యలు అవమానకరమైనవిగా వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ జీన్ పెర్రీ పేర్కొన్నారు. వ్యక్తులను ఎలా గుర్తించాలో చెప్పే హక్కు ఎవరికీ లేదని, అది ఎవరికి వారు సొంతగా తీసుకునే నిర్ణయమన్నారు. -
Donald Trump: భారతీయురాలా? బ్లాకా?
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ల అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉపాధ్యక్షురాలు, డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కానున్న కమలా హారిస్ భారతీయురాలా? లేక నల్ల జాతీయురాలా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఆమె చాలాకాలంగా భారతీయ సంతతికి చెందిన అమెరికన్‌గా తెలుసని, ఇప్పుడు హఠాత్తుగా నల్లజాతీయురాలినని చెప్పుకొంటున్నారని ఎద్దేవా చేశారు. షికాగోలో బుధవారం జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ కన్వెన్షన్‌లో ట్రంప్ మాట్లాడారు. వేదికపై ట్రంప్‌ను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులలో ఒకరు.. ‘హారిస్ ఎప్పుడూ నల్లజాతీయురాలిగానే గుర్తింపును కోరుకున్నారు. నల్లజాతీయుల యూనివర్సిటీలోనే చదువుకున్నారు’ అని చెప్పడానికి ప్రయత్నించగా ట్రంప్ అడ్డుపడ్డారు. ఆమె ఏదో ఒకదానికి కట్టుబడితే గౌరవిస్తానని, కానీ గతంలో భారతీయ వారసత్వం గురించి చెప్పుకున్న ఆమె అకస్మాత్తుగా నల్లజాతి వైపు మలుపు తిరిగారని, ఎవరైనా దానిని పరిశీలించాలని వ్యాఖ్యానించారు. న్యాయవాదిగా ఆమె బార్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేదని, పాస్ అవుతానని కూడా ఆమె అనుకోలేదని, ఆ తరువాత ఏమి జరిగిందో తనకు తెలియదని ఎద్దేవా చేశారు. అంతకుముందు రోజు ఫాక్స్‌న్యూస్‌కు ఇచి్చన ఇంటర్వ్యూలో సైతం ట్రంప్ అభ్యంతరకరంగా మాట్లాడారు. కమల అధ్యక్షురాలిగా ఎన్నికైతే ప్రపంచవ్యాప్తంగా నేతలు ఆమెను ఆట బొమ్మలా చూస్తారని, ఆమె చుట్టూరా తిరుగుతారని వ్యాఖ్యానించారు. -
అగ్రరాజ్యంపై ‘నల్ల’ నెత్తుటి మరక
తరతరాలుగా జాత్యహంకార వారసత్వం ఉన్న దక్షిణ కరోలినా నేడు తొమ్మిది మంది నల్ల జాతీయులను పొట్టన పెట్టుకొంది. ఇలాంటి దాడులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. అన్ని రంగాలలోనూ అమలవుతున్న వివక్ష వల్ల మానవాభివృద్ధిలో నల్ల జాతీయులు పూర్తిగా వెనుకబడి పోయారు. ఈ వివక్షకు, అణచివేతకు ముగింపు ఎప్పుడో తెలియదు. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తూ, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న అమెరికా ఈ మారణకాండ గురించిగానీ, వివక్ష గురించిగానీ నోరు విప్పడం లేదు. ‘‘నీవు, నీ నల్లజాతి పుట్టగతులు లేకుండా పోతారు. త్వరలోనే మా శ్వేత జాతి ఉగ్రరూపంతో లేచి మీ భార్యాపిల్లలతో సహా మీ నీచ జాతినంతటినీ ఖండఖండాలుగా నరికివేస్తాం. ఒక్కరూ మిగలకుండా మీ జాతిని నిర్మూ లిస్తాం’’ అంటూ జూన్, 3, 2007న అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రం బవియా ప్రాంతానికి చెందిన ఒక ఆఫ్రికన్ అమెరికన్ జర్నలిస్టును ఒకరు ఫోన్లో బెదిరించారు. మార్చి, 1, 2008న న్యూజెర్సీ రాష్ర్టంలోని ఒక ఆఫ్రికన్ అమెరికన్ జాతి మేయర్ కు ఇలాంటి ఫోన్ కాలే వచ్చింది. ‘నువ్వో నీగ్రోవి. ఏ ఒక్క తెల్లజాతి మనిషిపైనా నీ పాలన సాగదు’’ అంటూ నానా తిట్లూ తిట్టారు. శ్వేత జాత్యహంకారులలో నల్ల జాతీయులపై నరనరానా జీర్ణించు కుపోయిన వ్యతిరేకతకు, వివక్షకూ ఇవి మచ్చుతునకలు మాత్రమే. 2008 నవంబర్‌లో దేశాధ్యక్షునిగా ఆఫ్రికన్ అమెరికన్ జాతీయుడైన బరాక్ ఒబామా గెలుపు ఖాయమైన ఆ రాత్రి... శ్వేత జాతీయుల అహం దెబ్బతిన్న వేళ... తరతరాలుగా బానిసలుగా పడివున్న ఓ తెగ మమ్మల్ని పరిపాలించడమా? అంటూ శ్వేత జాత్యహంకారులు ఆగ్రహంతో దహించుకుపోతుండగా... ఒక ఆఫ్రికన్ అమెరికన్ యువకుడు స్నేహితుడి ఇంట్లో టీవీ చూసి ఇంటికి వెళుతుండగా ముగ్గురు శ్వేతజాతి యువకులు ఇనుప రాడ్లతో కాళ్ళు, చేతులు విరగ్గొట్టి వెళ్ళిపోయారు. కార్లోంచి దిగుతూ వారు ‘ఒబామా!’ అంటూ పెద్ద అరుపులతో ఆ ప్రాంతమంతా భయోత్పాతాన్ని సృష్టించారు. అదేవిధంగా నవంబర్ 5, 2008న ఒబామా అధ్యక్షునిగా ఎన్నికైన కొన్ని గంటల వ్యవధి లోనే మాసిడోనియాలోని ‘గాడ్ ఇన్క్రిస్ట్’ చర్చిని తగలబెట్టారు. ఇవన్నీ నియోనాజీ గ్రూపుల ఆధ్వర్యంలో జరిగినట్టు వార్తలొచ్చాయి. ఉన్మాదం కాదు పకడ్బందీ దుర్మార్గం ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నట్టుగానే వారం రోజుల క్రితం దక్షిణ కరోలినా రాష్ట్రం చార్లెస్టన్ పట్టణంలోని మదర్ ఎమాన్యుయెల్ ఆఫ్రికన్ మెథడిస్ట్ ఎపిస్కోపల్ చర్చిలో ఒక శ్వేత జాతి యువకుడు తొమ్మిది మంది ఆఫ్రికన్లను దారుణంగా కాల్చి చంపిన ఘటన ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఈ ఘటనలో చనిపోయిన వారిలో ప్రముఖ రాజకీయ వేత్త క్లెమెంటా పింక్నే అనే సెనేటర్ కూడా ఉన్నారు. ఆయన 1990లోనే 23 సంవత్సరాల వయసులో రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన అద్భుత ప్రతిభాశాలి, విద్యావంతుడు. పైగా ఆయన పౌరహక్కుల ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర కలిగిన కుటుంబంలో పుట్టినవాడు. ఉత్తర చార్లెస్టన్ పట్టణానికి చెందిన మైఖేల్ స్లాగర్ అనే శ్వేత జాతి పోలీస్ అధికారి అన్యాయంగా ఆఫ్రికన్ యువకుడు వాల్టెర్ స్కాట్‌ను కాల్చిచంపిన ఘటనపై జరిగిన ఉద్యమాలకు ఆయన నేతృత్వం వహించారు. వ్యాసం ఆరంభంలో పేర్కొన్న ఘటనలకు, ఈ నరమేధానికి సంబంధ ముందనేది స్పష్టమే. నల్లజాతివారు, పేదలు, బానిసలు అణిగిమణిగి ఉండా ల్సిందే కానీ అధికారం నెరిపితే సహించేదిలేదని హెచ్చరించడానికే పింక్నే లక్ష్యంగా, మిగతా ఎనిమిది మందిని కూడా హతమార్చినట్టు కనిపిస్తున్నది. డైలాన్ స్మార్ట్ రూఫ్ అనే 21 సంవత్సరాల యువకుడు ఈ దురాగతానికి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ మారణకాండతో అమెరికాలో జాతుల మధ్య యుద్ధం మొదలవుతుందని ఆశిస్తున్నట్టు డైలాన్ అన్నట్టు తెలుస్తున్నది. కాబట్టి ఇది కేవలం ఉన్మాదంతో చేసిన మారణకాండ కాదు, ఒక దుర్మార్గ లక్ష్యంతో జరిగిన హత్యాకాండ. డైలాన్ గత కార్యక్రమాలే అందుకు సాక్ష్యాలు. ఈ హత్యాకాండ తదుపరి నేర పరిశోధనా సంస్థలకు డైలాన్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. అతడు ‘‘ది లాస్ట్ రొడీషియా’’ అనే వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ప్రస్తుతం జింబాబ్వేగా పిలు స్తున్న ఒకప్పటి రొడీషియాలో శ్వేత జాతీయులకు, నల్లజాతీయులకు మధ్య యుద్ధాలు జరిగాయి. దానికి గుర్తుగా డైలాన్ తన జాకెట్‌పై ఒకప్పటి రొడీ షియా, దక్షిణాఫ్రికా జాత్యహంకార ప్రభుత్వాల చిహ్నాలను ముద్రించుకు న్నాడు. ఒకప్పటి నాజీ అసోసియేషన్‌తో సంబంధాలున్న ‘కౌన్సిల్ ఆఫ్ కన్సర్వేటివ్ సిటిజన్స్’తో డైలాన్‌కు సంబంధాలున్నట్టు వెల్లడైంది. ‘‘చార్లెస్ టన్ పురాతన పట్టణం. అందుకే దీన్ని ఎన్నుకున్నాను. చాలా మంది ఇంట ర్నెట్లో డాంబికాలు పలుకుతున్నారు. ఎవరో ఒకరు సాహసించాలి. అది నేనే ఎందుకు కాకూడదనుకున్నాను’’ అంటూ అతగాడు ట్వీట్ చేసినట్టు పత్రికలు తెలిపాయి. అంటే ఒక పథకం ప్రకారం తెల్ల, నల్లజాతి ప్రజల మధ్య అంత ర్యుద్ధాన్ని ప్రేరేపించాలనేదే డైలాన్ ఉద్దేశంగా కనిపిస్తున్నది. ఈ రక్తపిపాస ఈనాటిది కాదు ఆఫ్రికన్ ప్రజల పట్ల శ్వేత జాతి దురహంకారం అమెరికా అంతటా పాల్పడ్డ దారుణాలకు ఎన్నయినా ఉదాహరణలు చెప్పవచ్చు. అసలు దక్షిణ కరోలినా రాష్ట్రానికే ఈ జాత్యహంకార చరిత్ర ఉన్నది. ఇక్కడ నల్లజాతి ప్రజలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 1860లో అధ్యక్షుడిగా ఎన్నికైన అబ్రహం లింకన్‌కు దక్షిణ ప్రాంతం నుంచి సరియైన మద్దతు లభించలేదు. బానిసల వ్యాపా రాన్ని నిషేధిస్తూ లింకన్ చేసిన చట్టాన్ని వ్యతిరేకించిన దక్షిణ రాష్ట్రాల నాయ కులు ఆయనపై తిరుగుబాటు చేశారు. 1861 ఫిబ్రవరిలో దక్షిణ కరోలినాతో పాటూ, మిస్సిసిపి, ఫ్లోరిడా, అలబామా, జార్జియా, టెన్నిసి, ఉత్తర కరోలి నాలు స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్నాయి. ఇలా తరతరాలుగా జాత్యహంకా రం వారసత్వంగా ఉన్న దక్షిణ కరోలినా నేడు తొమ్మిది మంది నల్ల జాతీ యులను పొట్టన పెట్టుకొని, అలనాటి దాని రక్తపిపాసను గుర్తుకు తెచ్చింది. అమెరికాలో ఇటువంటి దారుణాలు కోకొల్లలు. హత్యలు, అత్యాచా రాలు మాత్రమేగాక, సామాజిక, ఆర్థిక, విద్యారంగాల్లో కూడా నల్లజాతి వారిని వివక్షకు గురిచేసి, ద్వితీయశ్రేణి పౌరులుగా అణచివేయడం సర్వసాధా రణం. ఇక విద్యారంగంలో నల్ల జాతీయుల పరిస్థితి మరీ అధ్వానం. విద్యాల యాల్లో నల్లజాతీయులను వెలివేస్తున్న పరిస్థితి ఉన్నది. ఎక్కువ ఫీజుల వల్ల ఇరుగు పొరుగు పాఠశాలల్లో వీరు చేరలేకపోతున్నారు. పాఠశాల విద్యలోనే చాలా మంది బడి మానేయాల్సి వస్తున్నది. 17 శాతం మంది నల్ల జాతీ యులు మాత్రమే హైస్కూలు స్థాయి చదువులు కొనసాగిస్తున్నారు. 5.8 శాతం మంది నల్లజాతీయులు మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తున్నారు. మొత్తం గా విద్యాసూచికలో శ్వేత జాతీయులు 5.62 శాతం ఉంటే ఆఫ్రికన్లు కేవలం 3.10 శాతం మాత్రమే ఉన్నారు. నల్లజాతీయులు నివాసం, ఆదా యం, ఉద్యోగ రంగాల్లో తీవ్ర వివక్షలకు గురవుతున్నట్టు ఆధారాలున్నాయి. అమెరికాలో ఉద్యోగాల కల్పన విషయంలో కొన్ని ప్రత్యేక విధానాలు ఉన్నప్ప టికీ అవి ఆచరణలో తగిన ఫలితాలను ఇవ్వలేదు. దీంతో మానవాభివృద్ధిలో నల్ల జాతి ప్రజలు అమెరికాలోని మిగతా జాతులన్నిటికన్నా వెనుకబడి పోయారు. జాతి వివక్ష అగ్రరాజ్యపు అసలు రూపం అమెరికాలో పేదరికం ఉన్నదంటే మనకు నమ్మశక్యం కాదు. కానీ అమె రికాలోని ఆఫ్రికన్లలో, అక్కడి భూమి పుత్రులైన నేటివ్ అమెరికన్లలో పేదరికం చాలా ఎక్కువ. దేశ జనాభాలో 13 శాతంగా ఉన్న నల్లజాతీయులలో దాదాపు 28 శాతం పేదరికంలో మగ్గుతున్నారు. వారిలో కనీసం పిడికెడు అన్నం దొర కని వాళ్ళు 33 శాతం వరకు ఉన్నారు. నల్ల జాతీయులే ఎక్కువగా నేరాలకు పాల్పడుతారనే దురవ గాహన కూడా మనలో బలంగా ఉంది. తాజా లెక్కల ప్రకారం మొత్తం 94,99,725 అరెస్టులు జరిగితే, ఇందులో 65,78,133 అరె స్టులు శ్వేతజాతీయులవి. 26,97,539 అరెస్టులు మాత్రమే నల్లజాతీయులవి. అయితే జైళ్లలో మాత్రం నల్లజాతీయుల సంఖ్యే అధికం. మొత్తం జైళ్లలో ఉన్నవారిలో 40 శాతంపైగా నల్లజాతీయులే. శ్వేత జాతీయులతో పోలిస్తే పది రెట్లు అధికంగా నల్లజాతీయులకే శిక్షలు పడతాయి. అరెస్టుల విషయంలో శ్వేత జాతీయులు చాలా ఎక్కువైనా శిక్షలు మాత్రం అత్యధికంగా నల్లజాతీ యులకే పడటం అక్కడి న్యాయవ్యవస్థలోనే వేళ్లూనుకొని ఉన్న వివక్షకు అద్దం పడుతుంది. ఇక నల్లజాతి మహిళల పరిస్థితి మరీ దారుణం. గత పాతికేళ్లలో నల్లజాతి మహిళల నేరాలు దాదాపు నాలుగు వందల శాతం పెరిగినట్టు ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. 4 లక్షల మందికిపైగా మహిళలు జైళ్లలో మగ్గుతున్నట్టు తెలుస్తోంది. శ్వేతజాతి మాఫియాలు నల్ల జాతి మహిళలను ఎక్కువగా మాదకద్రవ్యాల రవాణాకు ఉపయోగించుకుంటోంది. కటిక పేద రికం, ఆకలి తీరే దారిలేక వారీ ఉచ్చులో కూరుకుపోతున్నారు. అమెరికాలో ఆఫ్రికన్ల పట్ల అమలవుతున్న వివక్షకు, అణచివేతకు ముగింపు ఎప్పుడో కూడా తెలియదు. ప్రపంచానికే పెద్దన్నగా వ్యవహరిస్తూ, తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్న అమెరికా తన దేశంలోనే జరుగుతున్న ఈ మారణకాండ గురించిగానీ, వివక్ష గురించి గానీ నోరు విప్పడం లేదు. తాను ఏది చెబితే అదే ప్రజాస్వామ్యంగా, తమదే అత్యంత ప్రజాస్వామిక దేశంగా ప్రచారం చేసుకుంటున్న అమెరికా ప్రజాస్వా మ్యం ముసుగులో అత్యంత నిరంకుశంగా వ్యవహరిస్తోంది. తన దేశంలోనే అమలవుతున్న వివక్ష, అసమానతలను ఎంతమాత్రం పరిష్కరించలేకపో తోంది. పైగా జాతి వివక్షను కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో వారినే నేరస్తు లుగా నిలబెడుతోంది. ఒక జాతి పట్ల వివక్షాపూరితమైన వైఖరిని, విద్వేషంతో కూడిన దాడులను ఆపగలిగే ఒక నిజమైన ప్రజాస్వామిక పాలనను, సామా జిక, ఆర్థిక సమానత్వాన్ని అందించగలిగినప్పుడే అమెరికాలో జాతి వివక్షకు చరమగీతం పాడడం సాధ్యం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213 - మల్లెపల్లి లక్ష్మయ్య